Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదేమిటో కేసీయార్‌కు హఠాత్తుగా జ్వరమొస్తది… గట్టిగా పడిశం పట్టుకుంటది…

February 20, 2022 by M S R

kcr

తెలంగాణలో అతి పెద్ద గిరిజన పండుగ మేడారం… అక్కడికి వెళ్లలేదు కేసీయార్… పోతా పోతా అంటడు, పోడు… అదేమంటే ఏ ఎర్రబెల్లి దయాకరుడో ‘సారుకు పడిశం పట్టింది’ అని కవర్ చేసుకోవాలి… లేకపోతే ‘మీ మోడీ రాలేదేమిటోయ్, మా గిరిజనులతో ఉరికిచ్చి తన్నిస్తా, ఆయ్’ అని బీజేపీ వాళ్ల మీద ఎగరాలి… సీఎం పోకపోతే అడగొద్దట, మోడీ రాలేదేంటి అని గిరిజనం బీజేపోళ్లను తన్నాలట..!!. పోనీ, ముఖ్యమంత్రి హోదాలో ఓసారి మోడీని ప్రధాని హోదాలో జాతరకు రండి […]

రాధాకృష్ణకు తెలిసినన్ని నిజాలు… ఫాఫం, జగన్‌రెడ్డికి కూడా తెలియవేమో…

February 18, 2022 by M S R

aj

సమస్యలు ఏమున్నాయో తెలియదు గానీ… రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రికను పట్టించుకోవడం మానేసినట్టున్నాడు..! ఏదో వారానికి ఒకటి, వీలయితేనే ‘కొత్త పలుకు’ అని ఓ వ్యాసరత్నాన్ని జనం మీదకు వదిలేసి, పత్రికలో ఏ వార్త ఎలా వస్తుందో కూడా చేస్తున్నట్టుగా లేదు ఈమధ్య..! తన పొలిటికల్ లైన్ తెలిసిన సిబ్బందినే పెట్టుకున్నాను కదా, ఏదో ఒకటి రాసిపారేస్తారులే అనుకుంటే ఎలా మాస్టారూ… ఇదుగో ఈ వార్త చూడండి… ఫస్ట్ పేజీ వార్త… గౌతమ్ సావంగ్‌ను డీజీపీ పోస్టు నుంచి […]

ఆలీకి రాజ్యసభ సీటిస్తేనే ఆశ్చర్యం… ఆ లెక్కలు చాలా కాంప్లికేటెడ్…!!

February 17, 2022 by M S R

ali jagan

జరుగుతున్న ప్రచారం నిజమై… నిజంగానే సినిమా నటుడు ఆలీకి జగన్ గనుక రాజ్యసభ సభ్యత్వం అవకాశమిస్తే అది గొప్ప విశేషమే అని చెప్పుకోవాలి..! మొన్నొకసారి ఆలీ భుజం మీద తట్టి జగన్ త్వరలో శుభవార్త అన్నాడు… తరువాత ఆలీ జగన్ ఇంటికి వెళ్లొచ్చాడు… ఇంకేం..? ఆలీకి రాజ్యసభ సీటు అని ఊహాగానాల్ని మీడియా స్టార్ట్ చేసింది… అది వైసీపీ హెడ్డాఫీసు నుంచి లీకైందా..? లేక మీడియా సొంత సృష్టా తెలియదు… కానీ అదే నిజమైతే మాత్రం ఆసక్తికరమే… […]

బాబోఫోబియా..! ఆకు కదిలినా సరే… బాబు చేత, బాబు కోసం, బాబే బాధ్యుడు..!!

February 16, 2022 by M S R

viveka

బీజేపీ మీద మీరు ఏ విమర్శ ఐనా చేయండి, వాళ్ల తప్పొప్పుల్ని, వైఫల్యాన్ని ఎండగట్టండి… వాళ్లు సింపుల్‌గా అన్నింటికీ నెహ్రూయే కారణమని తేల్చేస్తారు… ఆయన పాలన వైఫల్యాలు, విధానాల అసమర్థత కారణంగానే ఇప్పుడు దేశం సర్వకష్టాలూ పడుతోందని సూత్రీకరించేస్తారు… సపోజ్, మీరు కేసీయార్ మీద విమర్శలు చేశారనుకొండి… అన్నింటికీ ఉమ్మడి పాలనే కారణమని అలవోకగా చెప్పేస్తాడు… ఇప్పుడైతే బీజేపీ మీదకు తోసేస్తాడు… అచ్చం, వైసీపీ..! మీరు ఏదైనా ఆరోపించండి… చంద్రబాబే బాధ్యుడు అనేస్తారు… అవాంఛనీయమైంది ఏది జరిగినా […]

ముందస్తు వైపు జగన్..? ‘ఎలక్షన్ టీం’ కసరత్తు.. ఐదారు నెలల యాక్షన్ ప్లాన్..!!

February 16, 2022 by M S R

praveen prakash

జగన్ ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోతున్నాడా..? గతంలో కేసీయార్ చూపిన బాటలోనే తనూ అడుగులు వేయబోతున్నాడా..? ఇప్పుడు ఉన్నతాధికారుల బదిలీలు ఒక ‘ఎలక్షన్ టీం’ అనే దిశలో సాగే ప్రయాణంలో భాగమేనా..? వచ్చే మూడు నాలుగు నెలల్లో జగన్ ఓ సీరియస్ కార్యాచరణ అమలు చేయబోతున్నాడా..? మూడు రాజధానులు అనే కాన్సెప్టుకు కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా..? ఈ నాలుగైదు నెలల కీలక కసరత్తులన్నీ ముగిశాక మళ్లీ జనంలోకి వెళ్లిపోనున్నాడా…? వినవచ్చే సమాచారం మాత్రం అవుననే అంటోంది… జగన్ […]

కేసీయార్ పంచాంగం లెక్కలన్నీ వేరు… ఏ ప్రముఖ జ్యోతిష్కుడూ పనికిరాడేమో…!!

February 14, 2022 by M S R

kcr

అకస్మాత్తుగా కేసీయార్ ఎందుకింతగా బీజేపీపై విరుచుకుపడుతున్నాడు..? ఏం సెగ తగులుతోంది..? రాజకీయంగానా..? కేసుల వాసన ఏమైనా వస్తోందా..? ఆ చర్చను వదిలేస్తే చాలా అంశాల్ని ఎందుకు, ఎలా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కాదు, ఎవరినీ ప్రశ్నించనివ్వడు, మీడియా మీట్‌లో ఎవరైనా ఆ ప్రశ్న వేస్తే ఇక ఆ విలేఖరి పనైపోయినట్టే… కేసీయారే ట్రోలింగుకు దిగుతాడు… నిన్నటి సుదీర్ఘమైన ప్రెస్‌మీట్‌ అనంతరం విలేకరులతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఓ వింత విషయం చెప్పుకొచ్చాడు తను… ఆంధ్రజ్యోతిలో కనిపించింది ఆ […]

ప్రత్యేక హోదా..! నిజంగా నిలువరించే సీన్ చంద్రబాబుకు ఉందా..?!

February 13, 2022 by M S R

special status

నిన్న ఓ వైసీపీ నాయకుడు ధాటిగా చెప్పేస్తున్నాడు… ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే జగన్‌కు క్రెడిట్ వస్తుంది కాబట్టి చంద్రబాబు తన పలుకుబడి అంతా ఉపయోగించి, ఆపేయించాడు, రాష్ట్ర వ్యతిరేకి’’ అంటూ గాలికిపోయే కంపను చంద్రబాబు ఇంటివైపు మళ్లిస్తున్నాడు… హహహ, పాపం చంద్రబాబుకు నిజంగా ఢిల్లీలో అంత పలుకుబడి ఉందా..? ఉండి ఉంటే జగన్‌ను ఎప్పుడో జైలులో వేయించేవాడు కదా… కనీసం మోడీ దగ్గర అపాయింట్‌మెంట్ సంపాదించేవాడు కదా… ఏదో అప్పట్లో బాగా బతికి, చితికిపోయిన జీవితం, […]

ఐనా ఈడీ దాడులతో ఏమవుతుంది..? బేఫికర్… కేసీయార్ జోలికి మోడీ రాడు…!!

February 11, 2022 by M S R

kcr

మోడీ మీద టీఆర్ఎస్ వాళ్లు సభాహక్కుల నోటీసు ఇచ్చారట, ఏమైతుంది సార్..? కేసీయార్ పై బీజేపోళ్లు అసెంబ్లీలో అలాంటి నోటీసే ఇస్తారట, ఏమవుతుంది సార్..? టీఆర్ఎస్ పెద్దల చుట్టూ ఈడీ వలలు పన్నుతోందట, నిజమేనా సార్..? …. నిన్నటి నుంచీ ఒకటే చర్చలు… బట్, ఎవరికీ ఏమీ కాదు.,. ఎవరికీ ఫికర్ అక్కర్లేదు… తెరపై కనిపించేదే సత్యం కాదు, రాజకీయాల ప్రణాళికలు అంటేనే ఓ స్పష్టాస్పష్ట భ్రమ… అది సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగు, పోస్టుల హైప్ […]

చిరంజీవికి పెద్దపీట నచ్చలేదా..? కొందరికి ఇష్యూ సెటిల్ కావడమే ఇష్టం లేదా..?!

February 11, 2022 by M S R

tollywood

జగన్ ప్రభుత్వం థియేటర్ల టికెట్ల ధరలు తగ్గిస్తూ ఆమధ్య ఓ నిర్ణయం తీసుకుంది… బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేస్తే, వసూళ్లు చేస్తే తాటతీస్తాను అని చెప్పింది… ఈ నిర్ణయం వెనుక జగన్ అహాన్ని ప్రదర్శిస్తున్నాడనీ, పవన్ కల్యాణ్‌ మీద కోపంతో ఇండస్ట్రీని తొక్కుతున్నాడనీ, తన ముఖ్యమంత్రిత్వాన్ని గుర్తించని-గౌరవించని ఇండస్ట్రీని కాళ్ల దగ్గర మోకరిల్లేలా చేసుకుంటున్నాడనీ, ఇండస్ట్రీలో ప్రధానంగా కమ్మ పెత్తనం కాబట్టి తన కమ్మ ద్వేషాన్ని ఇండస్ట్రీ మీద కూడా ప్రయోగిస్తున్నాడనీ బోలెడు కథనాలు, ప్రచారాలు […]

అబ్రకదబ్ర, అబ్రకదబ్ర… హాంఫట్… తెల్లారేసరికి కొత్త రాజ్యాంగం వచ్చేయాలంతే…

February 2, 2022 by M S R

కొత్త రాజ్యాంగం అవసరం ఈ దేశానికి..? ఈ మాట అన్నాక కేసీయార్ మీద బోలెడు వ్యాఖ్యలు, సెటైర్లు, విమర్శలు కనిపిస్తున్నయ్ సోషల్ మీడియాలో… కానీ చాలామంది నిజానికి తను సరిగ్గా ఏమన్నాడో పట్టుకున్నట్టు లేదు… ఆ మాటలు ఏ కాంటెక్స్ట్‌లో అన్నాడో, ఆయన ఆలోచన పరిధి ఎంత పరిమిత స్థాయిలో ఉందో ఓసారి చూడాలి… తను రాజ్యాంగానికి సవరణలు కాదు, కొత్త రాజ్యాంగమే అవసరం అంటున్నాడు… ఏం, 80 సార్లు మార్చుకున్నాం, ప్రపంచమంతా అవసరముంటే మార్చుకుంటూనే ఉన్నారు, […]

ఓహో… తెలంగాణ కాంగ్రెస్‌లో అంత జరిగిపోతోందా..? రేవంత్‌కు చుక్కలేనా..?!

January 2, 2022 by M S R

tpcc

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భారీ చీలిక తప్పదా..? రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించేవర్గం గత్యంతరం లేక సొంత కుంపటి పెట్టేసుకుంటుందా..? తెరవెనుక బీజేపీ సహకరిస్తుందా..? ఢిల్లీకి ఇప్పటికే రేవంత్ మీద ఫిర్యాదులు, నివేదికలు జోరుగా పంపబడుతున్నాయా..? ఆగండాగండి… ఇది సాక్షి సంకోచం లేకుండా తెలంగాణ రాజకీయాల్లోకి వదిలిన ఓ సందేహం, ఓ సంకేతం… సాక్షాత్తూ పత్రిక ఎడిటర్‌ రాసిన వార్తావ్యాసంలోనే ఈ డౌటనుమానాలు, పరోక్షంగా ఏదో జరగబోతోందనే సూచనలు వదలబడినవి… ఏమాటకామాట… ఇది ఓ విశేషమే… ఎంతసేపూ ఏపీ పాలిటిక్స్, […]

అదే గనుక జరిగితే… మరి రేవంత్‌రెడ్డి పరిస్థితేమిటి..? ఓ పెద్ద ప్రశ్న..!!

December 2, 2021 by M S R

revanth

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి కేంద్ర బిందువు అవుతున్నాడా..? నిజానికి రాజకీయాల్లో పొద్దున ఉన్న సిట్యుయేషన్ మాపు ఉండదు, ఈరోజు లెక్క వేరు, రేపటి లెక్క వేరు… పరిస్థితులు ఎటు నుంచి ఎలా తన్నుకొస్తాయో ఎవరూ అంచనా వేయలేరు… ఒక దశలో తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయడానికి సిద్ధమై, కాంగ్రెస్ చేతకానితనంతో అది అమలు జరగక… ఇక ఏడేళ్లుగా కేసీయార్ రాష్ట్రంలో రకరకాలుగా కాంగ్రెస్ పార్టీని తొక్కీ తొక్కీ నారతీసి, చీరి చింతకుకట్టి, కుళ్ల బొడిచాడు… ఇక నాకు […]

దోచుకుంటవ్, నా వాటా ఇవ్వవ్… పైగా ధర్నాలు చేయిస్తావా మోడీజీ…?

November 7, 2021 by M S R

jagan rule

ఈనాడులో, సాక్షిలో పెద్ద ఫుల్ పేజీ యాడ్ వచ్చింది… ‘‘హవ్వ, పెట్రో ధరల్ని ఇబ్బడిముబ్బడిగా పెంచి, అరకొర తగ్గించిన వాళ్లే ధర్నాలు చేస్తారట… చూశారా, జనం నుంచి కేంద్రం ఎంత వసూలు చేసుకుంటున్నదో, కానీ రాష్ట్రాలకు ఇవ్వడం లేదు… తెలుసా..?’’ అంటూ సుదీర్ఘ వివరణలతో సాగిపోయింది… ఏపీ ప్రభుత్వం బాధేమిటయ్యా అంటే… కేంద్రం వసూలు చేసుకుంటున్నది కానీ మాకు వాటా ఇవ్వడం లేదు అని..! సో, అటు కేంద్రానికీ లేదు, ఇటు రాష్ట్రానికీ లేదు, జనంపై మరింత […]

ఫాఫం… లోకేష్ ఎంత కష్టపడుతున్నా ఈ పాడులోకం అర్థం చేసుకోదెందుకో..!!

October 28, 2021 by M S R

aj

భజన గానీ, కీర్తన గానీ, డప్పు గానీ… జాగ్రత్త అవసరం, శృతి తప్పితే ఎదురు తంతుంది… ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రజ్యోతి పుంఖానుపుంఖాలుగా రాసే కథనాలు నిజానికి తెలుగుదేశానికి మంచి చేస్తున్నాయో, చెడు చేస్తున్నాయో చెప్పడం కష్టం… పదీపదిహేను చేతులతో ఎడాపెడా రాసేవాడికి, పేజీల్లో యథాతథంగా వేసేవాడికి కాస్త సంయమనం గనుక తప్పితే అసలుకే మోసం.,. అఫ్ కోర్స్, రాధాకృష్ణ కూడా మావాళ్లు భలే ఇరగదీస్తున్నారు అనుకుంటున్నాడేమో గానీ కొన్ని కథనాలు ఉల్టా దెబ్బ కొడుతున్నాయని గ్రహించడం […]

అచ్చోసిన ఆం‘బూతులు..! సమర్థన తిట్టడంకన్నా నీచం..!!

October 22, 2021 by M S R

abuse

సంస్కారరహిత రాజకీయాలు, దిక్కుమాలిన బూతుల భాష, దిగజారుడు ఎత్తుగడలు ఆంధ్రా రాజకీయాల్లో అసాధారణం ఏమీ కాదు… వీళ్లు దేవుడిగా కొలిచే ఆ ఎన్టీయారే ఓసారి అసెంబ్లీలో శాసనసభ్యురాలు నన్నపనేని మీద ప్రయోగించిన పరమ ముతకతిట్టు ఎందరికి గుర్తుందో తెలియదు గానీ… అప్పట్లో పెద్ద రచ్చే అయ్యింది..! బోషిడికే అనే హిందీ పదానికి అర్థం జగన్‌మోహన్‌రెడ్డే స్వయంగా చెప్పేవరకు చాలామందికి తెలియదు కానీ ఎన్టీయార్ వాడిన బూతు అచ్చ తెలుగు, అది అందరికీ అర్థమయ్యే తెలుగు… ఆనాటి నుంచి […]

ఏపీలో ట్రిపుల్ ఎక్స్ సంస్కార రాజకీయాలు..! పచ్చిగా చెప్పాలంటే ‘‘బోసిడీకే పాలిటిక్స్…

October 21, 2021 by M S R

bootulu

వాడెవడో బోసిడీకే అని తిట్టాడుట… (ఈమాటను ఇలాగే రాయాల్సి వస్తున్న ఖర్మకు నా కలం మీద నాకే జాలేస్తోంది… కానీ ఇప్పుడు ఏపీలో చర్చ, గొడవ, ఉద్రిక్తత, దాడులు, రాజకీయాలు అన్నీ ఆ పదం మీదే కదా… రాయాల్సిన అనివార్యత…) తిడితే తిట్టాడు, వాడి సంస్కారం అది, సింపుల్‌గా లేపుకొచ్చి, ట్రిపుల్ ఆర్‌కు, అచ్చెన్నాయుడు చేసిన ‘కస్టడీ మర్యాదలు’ ఇంకాస్త గట్టిగా చేసి ఉంటే సరిపోయేది కదా… చేయరు, తిట్టడం వెనుకా ఓ ప్లాన్, ఆ తిట్టును […]

ఈ ఉరితాళ్లు పేనింది తమరే కదా బాబు గారూ… మరిచిపోయారా ఆ రోజుల్ని..!?

October 12, 2021 by M S R

cbn

దెయ్యాలు వేదాలు వల్లించినట్టు… పిశాచాలు సంకీర్తనలు ఆలపిస్తున్నట్టు… అమావాస్య అర్ధరాత్రి ఆ భూత్ బంగళా నుంచి అకాలరోదనలేవో వినిపిస్తున్నట్టు…… వ్యవసాయానికి కరెంటు మీటర్ల మీద చంద్రబాబు వాదన చదువుతుంటే ఇలాగే రకరకాల ఫీలింగ్స్…! ఒపీనియన్స్ ఛేంజ్ చేసుకోకపోతే పొలిటిషియన్ ఎలా అవుతాడని అంటాడు కదా కన్యాశుల్కం గిరీశం… చంద్రబాబు గిరీశానికి ముత్తాత టైపు… నిజానికి ఏదేని అంశం మీద రాజకీయ పార్టీకి ఓ స్థిర విధానం అవసరం లేదా..? ఒక నాయకుడు తను చేసినదాన్నే తను తప్పుపట్టి […]

అసలు ఎవరు ఆ పంజాబీ మహిళ..? పూనం కౌరేనా..? ఇంతకీ ఎవరీమె…?!

September 29, 2021 by M S R

poonam

గురువు గారూ, ఇంతకీ ఈ వివాదంలో బకరీగా చూడబడుతున్న ఈ పంజాబీ మహిళ ఎవరు అనడిగాడు ఓ మిత్రుడు..? మనకేమో తెలియదు… చార్మి కాకపోవచ్చు, ఆమె మన అకున్ సభర్వాల్ సాక్షిగా ప్యూర్ చార్మి జగన్నాథ్… తమన్నా భాటియా కూడా కాకపోవచ్చు, ఫాఫం, పవన్ క్యాంపుకి కాస్త దూరదూరంగానే ఉంటోంది… సోనం బజ్వాకు అంత సీన్ లేదు…. మన భానుశ్రీ..? అబ్బే, మరీ టీవీలకే సరిపోవడం లేదు… ఎహె, పూనం కౌర్ కావచ్చు… అవును, అప్పుడప్పుడూ పవన్ […]

‘ట్రిపుల్ ఎక్స్’ సంస్కార రాజకీయాలు..! రొచ్చు, బురద రేంజ్ కూడా దాటేశారు..!!

September 29, 2021 by M S R

pk

‘‘… సర్వమంగళం పాడింది’’ అన్నట్టు రాజకీయంగా పూర్తిగా దివాలా తీసిన పవన్ కల్యాణ్‌ను మళ్లీ తెరపై కనబడేలా చేస్తున్నది వైసీపీ మాత్రమే, ఆ పార్టీకి ప్రతిపక్షాన్ని కౌంటర్ చేయడంలో కూడా ఓ దిశ లేదు, ఓ దశ లేదు ……… ఈ విశ్లేషణ చాలామందికి రుచించలేదు మొన్న… నో, నో… రిపబ్లిక్ మూవీ ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు రాష్ట్ర మంత్రులు మస్తు కౌంటర్ ఇచ్చారు అని అభిప్రాయపడ్డారు… కానీ ఇప్పటికే ఒకటే నిజం… […]

పవన్ కల్యాణ్ కోరుకున్నదే జరిగింది..! వైసీపీకే ఓ స్ట్రాటజీ లేకుండాపోయింది..!!

September 27, 2021 by M S R

pk

పవన్ కల్యాణ్ పిచ్చోడేమీ కాదు… జనం అన్ని ఎన్నికల్లోనూ ఘోరంగా తిరస్కరించి ఉండవచ్చుగాక… ఎంచక్కా మళ్లీ సినిమాలు చేసుకుంటూ ఉండవచ్చుగాక… కానీ తను నిర్మించుకున్న పొలిటికల్ ప్లాట్‌ఫాం మనుగడ కాపాడుకోవాలి కదా… ఎప్పుడో ఓసారి, ఏదో ఓ సందర్భం, ఏదో ఓ అంశాన్ని పట్టుకుని ప్రచారతెర మీదకు రావడం… నేను రాజకీయాల్లోనే ఉన్నానహో అని చాటుకోవడం… అది ఆయన అవసరం… నాదెండ్ల మనోహర్ తప్ప ఇంకెవరూ ఉన్నట్టు లేదు… ఆ గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సహా అందరూ […]

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions