అసలే రేటింగ్ కష్టాల్లో ఉన్న ఈటీవీని యంగ్ మేడం శ్రీమతి అనసూయ భరద్వాజ గారు నట్టేట్లో వదిలేసి వెళ్లిపోయాక… ఫాఫం, ఈటీవీకి ఇక ఎవరు దిక్కు అనే పెద్ద ప్రశ్న మల్లెమాలను, ఈటీవీని మరింత భయాందోళనల్లో పడేసింది… ఇప్పటికే మూడో ప్లేసులోకి జారిపోయిన ఈటీవీ ఇంకెంత లోతుల్లోకి వెళ్లిపోతుందో అనే భావన ప్రబలింది… ఈ సంక్షోభవేళ రష్మి గౌతమ్ ఆంటీ ‘నేనున్నాను’ అని భరోసా ఇచ్చింది… నిలబడింది… అనసూయ స్పూర్తిని అక్షరాలా కొనసాగిస్తాను అని మంగమ్మ శపథం […]
నారాయణ నారాయణ… ఒక్క టీవీ రియాలిటీ షో వెనుక ఇన్ని కథలా…
కార్పొరేట్ మీడియా ప్రపంచంలో ప్రతి కదలిక వెనుక ఓ వ్యాపార ఎత్తుగడ ఉంటుంది… తెరపై కనిపించేది వేరు, తెర వెనుక పన్నాగాలు వేరు… వందల కోట్ల దందాగా మారిన బిగ్‌బాస్ వ్యవహారమూ అంతే… అయిదు సీజన్ల లాంచింగ్ షోలు ఏకంగా 15 నుంచి 18 రేటింగ్స్ పొందితే, హఠాత్తుగా ఆరో సీజన్ లాంచింగ్ కేవలం 8.8 రేటింగ్స్‌కు పడిపోయిన పతనం వెనుక కూడా ఏదో వ్యాపారపరమైన వ్యూహం ఉందనే ప్రచారం టీవీ సర్కిళ్లలో జోరుగా సాగుతోంది… వంద […]
ఫాఫం… హీరో గోపీచంద్ కెరీర్ ఐసీయూలోకి చేరుకున్నట్టేనా..?
మనం ఇంతకు ముందు కొన్నిసార్లు చెప్పుకున్నాం… ఫాఫం, అంతటి పేరున్న దర్శకుడు టి.కృష్ణ కొడుకు గోపీచంద్ ఎక్కడికి జారిపోయి, కొట్టుకుంటున్నాడో, సగటు తెలుగు దరిద్రపు ఇమేజీ బిల్డప్పుల ఫార్ములా కథల్లో పడి, తనను తాను ఎలా కెరీర్‌ను ధ్వంసం చేసుకున్నాడో…! ఏళ్లుగా హిట్ లేక, ఫస్ట్ షోకు కూడా పెద్దగా జనం లేని ‘పక్కా కమర్షియల్’ అనబడే తన కొత్త సినిమా దురవస్థకు కారణాలేమిటో అన్వేషించుకోలేని దుస్థితిని కూడా ప్రస్తావించుకున్నాం… గోపీచంద్ పనైపోయింది అనే పరిస్థితికి కారణమేంటో ఇక […]
గ్రేట్ తల్లీ… ఏడ్చే ఓపిక కూడా లేని విషాదంలోనూ… మొక్కవోని ఆశావాదం…
బిగ్‌బాస్ షోలో ఏదో కెప్టెన్సీ టాస్క్… ఓ రింగులో నిలబడి ఒకరినొకరు తోసుకుంటున్నారు… చివరకు ఇద్దరు మిగిలారు… ఒకామె హఠాత్తుగా కడుపు పట్టుకుని కుప్పకూలిపోయింది… బాధతో ఆట నుంచి తనే విరమించుకుని, బయటికి నడిచింది… ఏమైంది..? ఎవరామె..? మీరు చాలా సైట్లలో ఆమె విషాదాన్ని గురించి పలుసార్లు చదివే ఉంటారు… కానీ ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది… ఆమె పేరు కీర్తి కేశవ్ భట్… ఆమె చాలాసార్లు తన కథ చెప్పుకుంది… ఇంటర్వ్యూల్లో, బిగ్‌బాస్ ఎంట్రీ సమయంలో […]
బిగ్‌బాస్ ఢమాల్… సిగ్గుచేటు… అత్యంత దయనీయంగా తాజా రేటింగ్స్…
నిజమా..? నిజమేనా..? ఒకటికి నాలుగుసార్లు కళ్లు నులుముకుని చూడాల్సి వచ్చింది… కోట్లకుకోట్ల ఖర్చు పెడుతున్నారు కదా బిగ్‌బాస్ షో మీద… స్టార్ మాటీవీకి ప్రిస్టేజియస్ షో కదా… బోలెడు వివాదాలు… తెల్లారిలేస్తే బొచ్చెడు వార్తలు… హౌజు నిండా తగాదాలు… ఫుల్ హంగామా కదా… ఆ షో గ్రాండ్ లాంచింగ్ నాలుగో తేదీ, ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి 9.40 గంటల దాకా… అంటే పావు తక్కువ నాలుగు గంటలు… కంటెస్టెంట్ల ఎంట్రీలు, డాన్సులు, అట్టహాసాల ప్రదర్శనకే […]
నారాయణ నారాయణ… ఆ లవ్వు ట్రాకుల ముద్దులాటలేవి..? హగ్గులాటలేవి..?
ప్చ్… సీపీఐ నారాయణ నాగార్జున మీద మళ్లీ ఓ కౌంటర్ వేశాడు… బిగ్‌బాస్ హౌజ్ వ్యభిచార్ల కొంప అని ఒకటే మొత్తుకుంటున్నాడు… మనం ఆ రచ్చలోకి మళ్లీ వెళ్లడం ఎందుకులే గానీ… నిజానికి ఈసారి బిగ్‌బాస్ హౌజులో అంత పెద్ద సీనేమీ కనిపించడం లేదు నారాయణా..? తిడుతూనే నువ్వూ చూస్తుంటావుగా… రెండోవారం నామినేషన్ల ప్రక్రియ కూడా అయిపోయింది… ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క లవ్ ట్రాకూ స్టార్ట్ కాలేదు… ఇక థ్రిల్ ఏమున్నట్టు కామ్రేడ్..? గత సీజన్లలోనైతే ఇలా […]
హతవిధీ… చివరకు టీవీ ప్రేక్షకులు కూడా తిరస్కరించేశారు…
ఈమధ్యకాలంలో దిల్ రాజుకు చేతులు కాలిన పెద్ద సినిమా బీస్ట్… కళానిధి మారన్‌తో కలిసి విజయ్ హీరోగా నిర్మించిన ఈ సినిమా నిజానికి డిజాస్టర్… కానీ తమిళ మీడియా మాత్రం 150 కోట్ల బడ్జెట్ పెడితే 250 కోట్లు వసూలు చేసింది అని తెగరాసేసింది… తమిళ పెద్ద హీరోల సినిమాలన్నీ తెలుగులోకి డబ్ చేసి వదిలేస్తున్నారు కదా… సేమ్, దీన్ని కూడా అలాగే వదిలారు… తొలిరోజు కలెక్షన్లు కుమ్మేశాయి… కారణం తెలుసు కదా… తమిళంలో సన్ నెట్వర్క్, […]
చివరకు ఆ దిక్కుమాలిన టీవీ సీరియళ్ల ప్రమోషనూ వదలవా మహేశా…!!
రెండేళ్ల క్రితం కావచ్చు బహుశా… హఠాత్తుగా మహేశ్ బాబు జీతెలుగు తెర మీద కనిపించాడు… యాంకర్ ప్రదీప్ ఉన్నాడు, త్రినయని సీరియల్ నటి ఆషికా ఉంది… మూడు సీరియళ్లకు ఒకే యాడ్‌లో ప్రమోషన్ చేసేశాడు… వాటి పేర్లు త్రినయని, ప్రేమ ఎంత మధురం, తూర్పుపడమర… అందులో త్రినయని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్లది… వాటిల్లో త్రినయని, ప్రేమ ఎంత మధురం సవాలక్ష వంకర్లతో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి… నెత్తిమాశిన సీరియళ్లు అవి… వివరంగా చెప్పడానికి స్పేస్ సరిపోదు ఇక్కడ… […]
బిగ్‌బాస్‌తో కెరీర్ గ్రోత్ అనేది ఓ భ్రమ… అవకాశాలేమీ తన్నుకురావు…
నవ్వొచ్చింది… వీజే సన్నీ అని ఓ నటుడు… బిగ్‌బాస్ వల్ల నాకు ఒరిగిందేమిటి..? అని ఏదో ఇంటర్వ్యూలో బాగా బాధపడిపోయాడట… ముందుగా తను ఏమన్నాడో చదవండి ఓసారి… ‘‘బిగ్‌బాస్ వల్ల నాకు ఒరిగిందేమీ లేదు… బిగ్‌బాస్ విన్నర్ అని చెప్పుకోవడం కూడా మానేశాను… ఎవరినైనా కలిసినప్పుడు బిగ్‌బాస్ విన్నర్‌ను అని చెబితే ‘అంటే ఏమిటి’ అనడుగుతున్నారు… బిగ్‌బాస్ వల్ల నాకు ఫేమ్, నేమ్ వచ్చిన మాట నిజమే… నా కెరీర్‌కు ఉపయోగపడిందేమీ లేదు… అందుకే ఇవన్నీ చెప్పడం […]
ఐదు వెల్లుల్లి రెబ్బల్ని పుస్తెలకు కట్టాలట… యాణ్నుంచి వస్తర్రా భయ్ మీరంతా…
ఒక దృశ్యం… ఒక మంచం వేసి ఉంది… దానిపై ఓ బట్ట… దాని నాలుగు కోళ్ల దగ్గర నాలుగు రాళ్లు తెచ్చిపెట్టారు… వాటి మీద నీళ్లు జల్లి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టారు… ఇద్దరు బాలింతలు తమ చంటి బిడ్డలను అక్కడికి తీసుకువచ్చారు… అలంకరించిన చాటల్లో పడుకోబెట్టారు… పైన తెల్లటి వస్త్రాన్ని కప్పారు… తరువాత ఆ ఇంటి పెద్దను, అనగా అత్తగారిని పిలిచారు… ఆమె చాటను ఒకవైపు లాగుతూ ఈ బిడ్డ నీకా నాకా అనడుగుతుంది… […]
నాగార్జునేనా..? చేస్తున్నది హోస్టింగేనా..? ఏంటీ పేలవమైన ఎపిసోడ్ బాస్..!!
నాగార్జునలో ఎందుకో గానీ మునుపటి బిగ్ బాస్ హోస్ట్ కనిపించలేదు… పేలవంగా ఉంది మొదటి వీకెండ్ షో… బహుశా CPI నారాయణ చేస్తున్న హార్ష్ వ్యాఖ్యల ప్రభావం కాదు కదా..!! ఐనా నారాయణ మాటల్ని కూడా పట్టించుకుంటే ఎలా సార్… ఆయన పార్టీలోనే ఎవరూ పట్టించుకోరు… టీవీ సీరియల్స్, బూతు సినిమాలు, విశృంఖల వెబ్ సీరీస్, పబ్బులు, రేవ్ పార్టీలు, లైంగిక దోపిడీలు… అసలు చుట్టూ ఎలాంటి బ్లూ కల్చర్ వ్యాప్తి చెందుతోందో సోయి లేదు… ఒక్క […]
ఎవరీ గౌరీ రాజ్..? సీనియర్ టీవీ యాక్టర్లనూ డామినేట్ చేసేస్తోంది..!!
నిజానికి సినిమా నటులతో పోలిస్తే టీవీ నటులకే నటన కష్టం… సినిమా నటులదేముంది..? ఎక్కువగా లాంగ్ షాట్స్ ఉంటయ్… ఎవరి మొహంలో ఏం ఉద్వేగాలు పలుకుతున్నాయో ఎవడు చూడొచ్చాడు..? మరీ క్లోజప్ షాట్స్ ఉంటనే సదరు నటుల అసలు సత్తా బయటపడేది… అలాంటి షాట్లు ఇప్పుడు సినిమాల్లో తక్కువగా ఉంటున్నయ్… ఎందుకంటే… మన హీరోలకు, స్టార్ నటులకు పెద్దగా నటన రాదు… రకరకాల కారణాలతో ఇండస్ట్రీలో చెలామణీ అయిపోతుంటారు… వాళ్లకు క్లోజప్పులు పెట్టే సాహసం దర్శకులకు ఉండదు… […]
బాడీ షేమింగ్‌లా, ఏజ్ షేమింగ్‌లా… లేడీ కంటెస్టెంట్ల వార్తల్లో కలర్ షేమింగ్…
పేరున్న పెద్ద సైట్లతోపాటు చాలా చానెళ్లలో, సైట్లలో ఓ వార్త కనిపించింది… నటులు, లేడీ సెలబ్రిటీల కలర్ విషయంలో మన మీడియా కురచ బుద్ధులు ఇప్పటికీ మారలేదు అని రూఢీ అయిపోయింది… ఫెయిర్ కలర్, డార్క్ షేడ్ మీద పరువు తీసేలా, ఆయా నటుల ఆత్మస్థయిర్యం, నైతికసామర్థ్యం దెబ్బతినేలా ఎవరైనా నెత్తిమాశిన వార్తలు రాస్తే, ఆ జర్నలిస్టులను టీవీ, సినిమా ప్రపంచం వెలివేసినట్టు చూస్తోంది కొన్నిచోెట్ల… ప్రత్యేకించి తమిళనాడు, కేరళ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు కనిపిస్తే […]
కార్తీకదీపం దర్శకుడికి కర్రు కాల్చి వాతలు పెట్టిన టీవీ ప్రేక్షకులు..!!
ప్రేక్షకులు హౌలాగాళ్లు… పిచ్చోళ్లలాగా మేం ఏం చూపించినా సరే, కళ్లప్పగించి చూస్తారు అనుకునేవాళ్లకు ప్రేక్షకులు కర్రు కాల్చి వాతలు పెట్టడం కొత్తేమీ కాదు… ప్రేక్షకులు అంత ఎడ్డోళ్లు కూడా కాదు… కాకపోతే ఆ టైం రావాలి… కార్తీకదీపం నిర్మాతలకు, దర్శకుడికి ఇప్పుడు ఆ అనుభవం ఏమిటో అర్థమవుతోంది… ప్రేక్షకులు ఛీకొడుతున్నారు… ఫోఫోరా ఎడ్డీస్ అని వెక్కిరిస్తున్నారు… నిజం… తాజాగా బార్క్ రేటింగ్స్ చెబుతున్న చేదు నిజం అదే… సరే, సీరియల్ మార్పుల గురించి ఓసారి సంక్షిప్తంగా చెప్పుకుందాం… […]
గీతూ రాయల్… ఇలాంటి కేరక్టర్లే అవసరమబ్బా… లేకపోతే షో శుద్ధ దండుగ…
గలాటా గీతు… గీతు రాయల్… చిత్తూరు చిరుత… ఏ పేరుతోనైనా పిలవండి… నోరిప్పితే చాలు, దడదడ మాటల ప్రవాహమే… చిత్తూరు యాస పర్ఫెక్ట్గా పలుకుతుంది తన గొంతులో… ఇంకా ఏ కృతిమత్వమూ ఆమె యాసను పెద్దగా పొల్యూట్ చేయనట్టుంది… ఎందుకు చెప్పుకోవడం అంటే..? కాస్త భోళాగా, తనేం మాట్లాడుతుందో కొన్నిసార్లు తనకే తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తుంటుంది కదా… కానీ ఇలాంటి కేరక్టర్ బిగ్‌బాస్‌లో అవసరమే… మొత్తానికి సోమవారం షోను డామినేట్ చేసిపడేసింది… మిగతా ఆడ, మగ కేరక్టర్లు […]
ఫాఫం సింగర్ రేవంత్… మొదటిరోజే మొహం వాచిపోయింది…
బిగ్‌బాస్ టీంను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు… ఆ షో ద్వారా కావల్సింది ఎక్కువ టీఆర్పీలు… కమర్షియల్ యాడ్స్, మూవీ ప్రమోషన్స్, డబ్బు… యాక్టివిటీ యాడ్స్ పేరిట ఇదే కంటెస్టెంట్లతో బోలెడు కమర్షియల్ యాడ్స్ అదే హౌజులో చేయిస్తారు… సో, కంటెస్టెంట్ల పర్ఫామెన్స్, వాళ్లకు వచ్చే వోట్లు, దానికి అనుకూలించే కంట్రవర్సీలు షోలో కంటెస్టెంట్ల గమనాన్ని నిర్దేశిస్తాయి… రెమ్యునరేషన్ల వరకూ కాస్త ఎక్కువ, తక్కువ అనేది వాళ్ల పాపులారిటీని బట్టి ఉంటుంది… కానీ కంటెస్టెంట్ అంతిమంగా ఎన్ని […]
సామాన్యులకి ఆహ్వానం, ఆడిషన్స్ అన్నారు… ఏమయ్యారురా బిగ్‌బాస్…?!
గత మే నెల… బిగ్‌బాస్ టీం అధికారికంగానే ప్రకటించింది… సామాన్యులకు ఆహ్వానం అని చెప్పింది… ఆడిషన్స్ అని పేర్కొంది… ఓహో, యూట్యూబర్స్, టీవీ యాక్టర్స్, మోడల్స్, కమెడియన్స్, సింగర్స్, ఇతరత్రా చిన్నాచితకా సెలబ్రిటీలే గాకుండా సామాన్యులతో కూడా బిగ్‌బాస్ ఆట ఆడిస్తారా అనుకున్నారు ప్రేక్షకులు… గతంలో కూడా ఒకరిద్దరిని ఇలా తీసుకొచ్చారు కూడా… కానీ తీరా చూస్తే… 20 మందిని ప్రవేశపెడితే వారిలో ఒక్క సామాన్యుడూ లేడు… మరి సామాన్యుల ఎంపిక ఏమయిపోయిందిరా బిగ్బాసోడా అనడగాలి… ఆదిరెడ్డి […]
జబర్దస్త్ ఫైమా, సింగర్ రేవంత్, చలాకీ చంటి… వీళ్లపైనే అందరికన్ను..!
సహజంగానే బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఎవరు అనే ఆసక్తి ఉంటుంది కదా… దిక్కుమాలిన సీరియళ్లు, ఆ చెత్తా కథాకథనాలు, ఈటీవీలో వచ్చే తలతిక్క రియాలిటీ షోలతో పోలిస్తే మాటీవీలో వచ్చే బిగ్‌బాస్ మీద ప్రేక్షకులకు ఆసక్తి సహజమే కదా… ఆల్రెడీ షో లాంచింగుకు టైం వచ్చేసింది… ఎంట్రీ తాలూకు షూటింగులు అయిపోయాయి… ఎప్పటిలాగే నాగార్జున కోసం డాన్సులు, అనగా పిచ్చి గెంతుల ఎంట్రీ షూట్స్ కూడా అయిపోయాయి… కానీ ఎవరు కంటెస్టెంట్లు..? ఇదుగో, కింద ఓ ఫోటో ఇస్తున్నా… […]
టీవీ సీరియల్లో హఠాత్తుగా మాయం… బిగ్‌బాస్ హౌజులోకి పయనం…
ఈ బిగ్‌బాస్ షో ద్వారా స్టార్ మాటీవీ వాడికి వచ్చే రేటింగ్స్, యాడ్స్, పాపులారిటీ మాటేమిటో గానీ… అందులో పాల్గొనే వాళ్లకు వచ్చే పబ్లిసిటీ మైలేజీ, ఇతరత్రా డబ్బు ఫాయిదాల మాటేమిటో గానీ… ఒక్కసారిగా కొన్ని వేరే ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ అవుతాయి… సపోజ్, యాంకర్‌గా చేసే దీపిక పిల్లి హఠాత్తుగా బిగ్‌బాస్ హౌజులోకి వెళ్లిపోతే పెద్ద ఫరక్ పడదు… ప్రస్తుతం ఆమె రెగ్యులర్‌గా చేస్తున్న షోలు ఏమీ లేవు… కానీ మంగళంపల్లి శ్రీసత్యను తీసుకొండి… జీతెలుగులో త్రినయని […]
తీసేవాడికి చూసేవాడు లోకువ… కక్కుర్తి కార్తీకదీపం కథ ప్రేక్షకులకు అర్థమైంది…
మనం చాలాసార్లు చెప్పుకున్నాం… కార్తీకదీపం తెలుగు నిర్మాతల కక్కుర్తి యవ్వారం గురించి… ఆ మలయాళ ఒరిజినల్‌కూ దీనికీ అసలు సంబంధమే లేకుండా పోయింది… ఇష్టారాజ్యంగా కథను, కథనాన్ని మార్చేస్తూ, కొత్త పాత్రల్ని తెస్తూ, కొన్ని తొలగిస్తూ… ఏది తోస్తే అది తెలుగు ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు… ఆ నల్ల పిల్ల ఏకంగా రంగుమారి తెల్ల స్త్రీ అయిపోయింది అంటేనే అర్థం చేసుకొండి… ఏ ప్రాంతీయ భాషలోనూ ఏ టీవీ సీరియల్‌కు లేనంతగా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు… […]
- « Previous Page
- 1
- …
- 20
- 21
- 22
- 23
- 24
- …
- 41
- Next Page »