గోరంట్ల మాధవ్ ఉదంతం మనమిక్కడ సమీక్షించుకోవడం లేదు… తన భాష, తన వ్యవహారశైలి, తన నడత, తన వ్యక్తిత్వం జగన్‌కు ముద్దేమో గానీ ప్రజలకు కాదు… ఆ అశ్లీల వీడియో ఫేకే కావచ్చుగాక… కావాలనే టీడీపీ వాళ్లు దీన్ని రచ్చరచ్చ చేస్తుండవచ్చుగాక… లేక ఆ వీడియో నిజమైందే కావచ్చుగాక… టీడీపీ క్యాంపు నుంచే ఈ ప్రసారం ప్రారంభమై ఉండవచ్చుగాక… సజ్జల, రోజా, వనిత, ఆ జిల్లా ఎస్పీల వింత వ్యాఖ్యానాలు, సమర్థనలతో అధికార పార్టీ పరువు మరింత […]
ఇంద్రజకు జబర్దస్త్ జడ్జి అర్హత వచ్చేసినట్టే… బూతు కల్చర్ ఎక్కేసింది…
నాగబాబు వెళ్లిపోయిన తరువాత ఈటీవీ జబర్దస్త్‌కు రోజా అల్టిమేట్ జడ్జి అయిపోయింది… ప్రోగ్రాం ఆమె గుప్పిట్లోకి వచ్చేసింది… మనోతోపాటు అప్పుడప్పుడూ ఎవరెవరో గెస్టు జడ్జిలుగా వచ్చివెళ్తున్నా రోజాయే సూపర్ జడ్జిగా చెలాయించింది… నిజానికి ఆమె పక్కన కోజడ్జిగా ఎవరూ సరిగ్గా కుదురుకోలేకపోయారు… తరువాత మంత్రి అయ్యాక ఆమె మానేయాల్సి వచ్చింది… సీన్ కట్ చేస్తే… అప్పటి నుంచీ జబర్దస్త్‌కు ఓ అక్కరకొచ్చే జడ్జి దొరకలేదు… నిజానికి అక్కడ చేసేదేమీ లేదు… కమెడియన్లు స్కిట్ చేస్తారు, మధ్యమధ్య పగులబడి […]
ఆ స్వర జతుల నడుమ… జబర్దస్త్ తరహా రోత స్కిట్లు దేనికి..? ఆ డాన్సులెందుకు..?!
కాస్త తాపీగా చదవాల్సిన స్టోరీ ఇది… ఓ క్రమపద్ధతిలో… టీవీల్లో తెలుగు సినిమా పాట స్థానమెంత..? ఎంత అని అడుగుతారేమిటండీ…? ఆ పాటలు, పాటలకు తగిన గెంతులు, చివరకు సీరియళ్లలోనూ అవే పాటలు… అసలు పాటల్లేకుండా తెలుగు టీవీ ఎక్కడిది..? ఆ పాటలో ఏముంది..? ఆ పాట సందర్భమేమిటి..? ఔచిత్యమేమిటి..? అనేది ఎవడికీ అక్కర్లేదు… అది ఏ షో అయినా సరే… బ్యాక్ గ్రౌండ్ నుంచి పాట వినిపిస్తూ ఉండాలి… జడ్జీలు, కంటెస్టెంట్లు, కమెడియన్లు, ఆర్టిస్టులు, సింగర్స్… […]
టీవీ ప్రేక్షకుల్ని ఈటీవీ, మల్లెమాల పిచ్చోళ్లను చేసి, వెక్కిరించడమే ఇది…!!
ఖచ్చితంగా టీవీ ప్రేక్షకులంటే ఈటీవీ, మల్లెమాల సంస్థలకు చిన్నచూపు… వెక్కిరింపు… టీవీ సీరియళ్లు, సినిమాలు తీసే వాళ్లలో ఉండే ఓ రకమైన తేలికభావన… తాజాగా ఉదాహరణ చెప్పుకోవాలంటే… అదే జబర్దస్త్ షో… ఈమధ్య రేటింగులు తగ్గి, కమెడియన్లందరూ బూతులు తిడుతూ వెళ్లిపోతున్నారు కదా… ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు… అన్నీ బాగున్నప్పుడు… జబర్దస్త్ షోలో కాస్త పేరున్న, మెరిట్ ఉన్న కమెడియన్లు కనిపించేవాళ్లు… అక్కడ ముష్టి పెత్తనాలు, బాండెడ్ లేబర్… (బాండ్స్ […]
చివరకు సుధీర్‌ను బకరా చేశారా..? లేక మల్లెమాలతో ఓ గేమ్ ప్లే చేస్తున్నారా…?!
మల్లెమాల మీద నాగబాబు వీరాభిమాని ఆర్పీ కూతలు… కౌంటర్‌గా ఇతర కమెడియన్ల ఎదురుకూతలు… పరస్పరం వాతలు… కొద్దిరోజులుగా ఇదే తంతు కదా… ఈటీవీ, మల్లెమాల, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ ప్రోగ్రామ్ ఎట్సెట్రా ఉమ్మడిగా ఇజ్జత్ తీసుకుంటున్నాయి… అసలే ఈటీవీలో సినిమా ప్రమోషన్ల కక్కుర్తి కారణంగా మిగతా రియాలిటీ షోల రేటింగ్స్ పాతాళంలోకి వెళ్లిపోయాయి… ఇక ఈ కామెడీ షోలు కూడా ఢమాల్ అంటే, అసలే మూడో ప్లేసులో కొట్టుకుంటున్న ఈటీవీ జెమిని కిందకు, అంటే […]
చివరకు రోహిణి కూడా జంప్… శ్యామప్రసాదుడా ఇదేమి దురవస్థ నీకు..?!
చివరకు ఇంద్రజ, రష్మి, ఆటో రాంప్రసాద్ మాత్రమే మిగులుతారా జబర్దస్త్‌లో..? అవకాశమొస్తే ఇమ్మూ, నూకరాజు కూడా జంపేనా..? మల్లెమాల షెడ్డంతా ఖాళీ అయిపోయి బోసిపోవాల్సిందేనా..? మాటీవీ వాళ్ల ఓ తాజా ప్రోమో చూస్తే అదే డౌటొచ్చింది… ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీకి పోటీగా మాటీవీలో కూడా ఆదివారం మధ్యాహ్నం ఓ స్పెషల్ షో వేస్తున్నారు కదా… ఈసారి ఆ షో పేరు ‘‘అంటే సుందరానికీ’’… ఎలాగూ సుధీర్ వచ్చాడు కదాని… తననే సెంటర్ పాయింట్‌గా సుదీర్ఘ […]
సో వాట్..? సుడిగాలి సుధీర్ లైఫ్ లాంగ్ కట్టు బానిసలా కాళ్లు పట్టాలా..?!
కిరాక్ ఆర్పీ అనబడే నాగబాబు వీరాభిమాని చెడామడా బూతులు తిట్టేస్తున్నాడు మల్లెమాల కంపెనీని… శ్యాంప్రసాదరెడ్డిని… అదేదో చానెల్… సంబరం చేసుకుంటోంది… భలే కంట్రవర్సీ దొరికిందిలే అనుకుని డాన్స్ చేస్తోంది… ఆర్పీని ఖండించడానికి హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్… మళ్లీ ఆర్పీ రీకౌంటర్… ఈలోపు ఇంకెవరో షేకింగ్ శేషు అట ఆర్పీ మీద ఓ ట్యాంకర్ బురద గుమ్మరించాడు… సదరు శేషును, ఇంకెవరో పద్మశ్రీ అట… కలిపి సర్ఫ్ ఎక్సెల్ పెట్టేశాడు ఆర్పీ… మధ్యలో ఇంకో గుండు కేరక్టర్ […]
కిరాక్ ఆర్పీ ఎపిసోడ్… ఈటీవీని, మల్లెమాలను ఇంకాస్త డౌన్ చేసింది…
రాజకీయ పార్టీల్లో ఓ సంప్రదాయం ఉంటుంది… ఎవరైనా ఎవరినైనా తిడితే, వెంటనే సంబంధిత కులం నాయకులతో కౌంటర్ విమర్శలు చేయించడం..! ఈమధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో, టీవీ సర్కిళ్లలో కూడా ఈ ధోరణి తెగపెరిగిపోతోంది… చివరకు మల్లెమాల వంటి ప్రొఫెషనల్ టీవీ ఎంటర్టెయిన్మెంట్ కంపెనీలు కూడా ఈ బురదలో కాలేస్తున్న తీరు విచిత్రంగా కనిపిస్తోంది… నిన్నా మొన్నా ఆర్పీ అనబడే కమెడియన్ మీద బొచ్చెడు వార్తలు, ట్యూబ్ వీడియోలు కనిపిస్తున్నాయి… విషయం ఏమిటంటే..? ఈ ఆర్పీ అనబడే […]
ఇదేంది శ్రీముఖీ… మరీ ఇట్లయిపోయినవ్… అదేం డ్రెస్సు, అదేం స్టయిల్…
ఆదివారం… రాత్రి 9.30 గంటలు దాటింది… ఒక్కసారి నాలుగు ప్రధాన తెలుగు చానెళ్లను ఓసారి చూద్దాం… సండే ప్రైమ్ టైమ్ కదా, ఎవరి ప్రోగ్రాం ఏమిటో, ఎవరి టేస్టేమిటో చూద్దాం… ఫస్ట్, జీతెలుగు… సరిగమప అని సంగీత పోటీ… సారీ, సినిమా పాటల పోటీ… నలుగురు పెద్ద పేర్లున్న జడ్జిలు… యాంకర్ శ్రీముఖి వచ్చింది స్టేజీ మీదకు… ఆమె డ్రెస్సు చూసి కాస్త వెగటు పుట్టిన మాట వాస్తవం… ఈరోజుల్లో ఆమె డ్రెస్సు పెద్దగా వెగటు కేటగిరీలోకి […]
సుడిగాలి సుధీర్… డాన్స్‌లో అదే ఎనర్జీ, హోస్టింగు… ఈటీవీ తప్పుచేసింది…
మధ్యాహ్నం మాటీవీలో పార్టీ చేద్దాం పుష్ప అనే ప్రోగ్రాం వచ్చింది… నో డౌట్… అది ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్స్‌ను కొట్టేయడం కోసం ఉద్దేశించిన ప్రోగ్రాం… వీటికి ఫలానా కేరక్టర్ అనేమీ ఉండదు… తమ టీవీ ప్రోగ్రామ్స్‌లో కనిపించే కమెడియన్లను కూర్చోబెట్టి, అప్పటికప్పుడు తోచిన ఏవో డాన్సులు, పాటలు, కామెడీ స్కిట్స్ గట్రా చేయించడమే… జస్ట్, ఎంటర్టెయిన్ చేయడం… మాటీవీ షోలో సుడిగాలి సుధీర్ సెంటర్ పాయింట్… అబ్బురంగా ఓ డాన్స్ ఎపిసోడ్ చేశాడు… […]
వాగ్దేవి… వావ్ దేవి… గాదిలి వేణుగానం కానడ పలికే… అలై పొంగెనే…
ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ షో ఫస్ట్ సీజన్లో సింగర్ వాగ్దేవి విజేతగా నిలిచిందనీ, ఫినాలేకు చీఫ్ గెస్టుగా వచ్చిన చిరంజీవి చేతులు మీదుగా ట్రోఫీ అందుకుందనీ రెండుమూడు రోజులుగా కొన్ని సైట్లలో, యూట్యూబ్ చానెళ్లలో వార్తలు వస్తూనే ఉన్నాయి… బహుమతి ప్రదానం సందర్భంగా వాగ్దేవి తండ్రి ఎలా ఎమోషనల్ అయ్యాడో, ఏమని మాట్లాడాడో కూడా రాసేశాయి… అయితే హఠాత్తుగా ఎన్టీవీ, దిశ వంటి సైట్లలో ఆ వార్తను తీసేశారు… ముందే […]
నిజమేనా..? చిరంజీవి మరీ అలా బిహేవ్ చేశాడా..? ప్రోమో చూస్తేనేమో…!!
ఏమో మరి… తాజా ప్రోమో చూస్తే అలా ఏమీ అనిపించలేదు… ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలేకు వెళ్లిన చిరంజీవి అక్కడి హోస్ట్ శ్రీరాంచంద్ర ఏదో ప్రొడక్ట్ పేరు కరెక్టుగా ఉచ్చరించక, టేక్ అడిగితే, కోపంతో చిరంజీవి విసురుగా ఆ షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు అని వార్తలు… ఎడాపెడా రాసేశారు చాలామంది… కరెక్ట్ కావద్దని ఏమీ లేదు… తనూ మనిషే కదా… రాగద్వేషాలు, కోపతాపాలు ఉండకూడదని ఏముంది..? కానీ..? అది తన సొంత బావమరిది, తన కేవీపీ […]
సరైన టాక్ లేకపోతే… టీవీల్లో ఉచితంగా చూడటానికీ ప్రేక్షకుడి విముఖత…
ఓ భిన్నమైన ధోరణి కనిపిస్తోంది తెలుగు సినిమాలకు సంబంధించి… కొన్ని సినిమాలనేమో బీభత్సంగా చూసేస్తున్నారు… థియేటర్లలోనే కాదు, ఓటీటీల్లో, టీవీల్లోనూ ఆ జోష్ కనిపిస్తుంది… ఉదాహరణకు కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ వంటివి… అఖండ కూడా థియేటర్లలో హిట్టే… నచ్చకపోతే ఓ మోస్తరుగా కూడా ఆదరణ చూపించడం లేదు, పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు… వాటి జోలికే పోవడం లేదు… ఉదాహరణ ఆచార్య… హిందీ సినిమాల విషయానికొస్తే కంగనా నటించిన థాకడ్ హిస్టారిక్ డిజాస్టర్, 100 కోట్లకు నాలుగైదు కోట్ల రికవరీ […]
తొలిసారిగా కార్తీకదీపం ఢమాల్… పిచ్చి ప్రయోగాలతో సత్తెనాశ్…
సాఫీగా నడిచే వ్యవహారాల్లో అనవసరంగా వేలు పెట్టి కెలకొద్దు… కెలికితే అది కార్తీకదీపం సీరియల్ అవుతుంది… నిజం… ఎన్నాళ్లుగానో ఎప్పుడూ తెలుగు టీవీ టాప్ ప్రోగ్రాముల జాబితాలో నంబర్ వన్ ప్లేసులో కనిపించేది… సదరు దర్శకరత్నం దాన్ని పీకీ పీకీ, ఇటూఅటూ ఎటెటో తిప్పి, ప్రాణంగా నిలిచిన పాత్రల్ని చంపిపాతరేసి… కొత్తవాళ్లను తీసుకొచ్చి ఓ సీక్వెల్ తరహా ప్రయోగం మొదలుపెట్టాడు… అది ఎదురుతన్నింది… మొదటిసారిగా కార్తీకదీపం సీరియల్ తన నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది… ఒకప్పుడు 17, […]
నానాటికీ ఈటీవీ నగుబాట… నాలుగో స్థానం వైపు ఉరుకులాట… ఫాఫం..!!
జాలిపడాల్సిన అవసరమేమీ లేదంటారా కొందరు..? ఏమో… ఒకింత జాలిపడాలనే అనిపిస్తుంది ఈటీవీ తాజా పరిస్థితి చూస్తుంటే..! ఈనాడు తాజా పాత్రికేయ నాణ్యత ప్రమాణాల్ని చూస్తుంటే ఎలా బాధ కలుగుతుందో, ఈటీవీ తాజా స్థితి కూడా అంతే… ఈనాడు కాస్త నయం… రంగు, రుచి, చిక్కదనం, వాసన ఏమీలేని చప్పిడి పథ్యం తిండిలా ఉన్నా సరే, కొత్తగా నష్టం ఏమీ ఉండదు… తినడానికి సయించదు… కానీ ఈటీవీ ఘోరం… బూతును నమ్ముకుని, దాన్ని ఇంటింటికీ వ్యాప్తిచేయడం… ఒక్కసారి దిగువన […]
బాలయ్యకు పెద్ద పీట వేస్తే బావ ఊరుకుంటాడా..? ఫినాలేకు చిరంజీవి..!!
తెలుగు ఇండియన్ ఐడల్ షో అసలు నిర్మాతలు ఎవరో గానీ… బాలయ్యకు క్లోజ్… ఆహా ఓటీటీలోనే అన్‌స్టాపబుల్ అని ఓ చాట్ షో వచ్చింది… అది బాలయ్యలోని ఓ భిన్నమైన ఫన్ యాంగిల్‌ను ప్రొజెక్ట్ చేసింది… తెలుగు టీవీలు, ఓటీటీల్లో వందల చాట్ షోలు రావచ్చుగాక… బాలయ్య షో యూనిక్… ఫ్యాన్స్‌ను ఈడ్చి తన్నే బాలయ్య కాదు, మరో కొత్త సరదా బాలయ్య కనిపించాడు… తెలుగు ఇండియన్ ఐడల్ షో కూడా అంతే… ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే […]
ప్రాంక్, ఫేక్, స్టెంట్… ఇజ్జత్ పూర్తిగా పోగొట్టుకున్న ఈటీవీ, మల్లెమాల…
హైపర్ ఆది అరెస్టు… అని ప్రముఖ సైట్లు ఎడాపెడా రాసేశాయి… ఏమిటయ్యా అంటే..? హైపర్ ఆది కారుతో ఒకడిని ఢీకొట్టాడట, వాడు చావుబతుకుల్లో ఉన్నాడట, శ్రీదేవి డ్రామా కంపెనీ షో మధ్యలో పోలీసులు ప్రవేశించి, ఆదిని అరెస్టు చేశారట… ఇదీ వార్త… నిజం ఏమిటయ్యా అంటే… అది ఈటీవీ వాడు అతి తెలివితో ప్రసారం చేసుకున్న ఓ పిచ్చి ప్రోమో… దిగజారిపోయిన మల్లెమాల క్రియేటివిటీకి ఓ సూచిక… అయితే అది ఫుల్లు ఎదురుతన్ని ఈటీవీ, మల్లెమాల ఇజ్జత్ […]
ఛిఛీ… చివరకు అంతటి సుమ కూడా ఇలా తయారైందేమిటి ఖర్మ..?!
జయమ్మ పంచాయితీ అనే సినిమా డిజాస్టర్ అయిపోయాక, వెటరన్ యాంకర్ సుమ బుర్ర బ్లాంక్ అయిపోయిందో, దారే తప్పిందో… తను హోస్ట్ చేసే క్యాష్ లేటెస్ట్ ప్రోమో చూస్తే ఆ డౌటే వచ్చింది… గతంలో కాస్త చూడబుల్‌గా ఉండేది ఈ షో… పెద్దగా వినోదం, మన్నూమశానం ఏమీ లేకపోయినా తన స్పాంటేనిటీ, ఫన్నీ యాంకరింగుతో నెట్టుకొస్తోంది సుమ… తరువాత వరుసగా సినిమా ప్రమోషన్లకు వేదికగా మారింది… చివరకు ఎలా తయారైందంటే… వచ్చే ఎపిసోడ్ కోసం కమెడియన్లను ఎంచుకుంది… […]
బలంగా దెబ్బ కొట్టి.., అయ్యో, నొప్పిగా ఉందా అని ‘ఏడ్చినట్టుంది’…
ఆటో రాంప్రసాద్ ఏడ్చేస్తున్నాడు… కొత్తగా జడ్జిగా వచ్చిన సదా కన్నీళ్లు ఒత్తుకుంటోంది… ఇంద్రజ కళ్లు కారిపోతున్నాయి… రష్మికి దుఖం ఆగడం లేదు… రోహిణి కళ్లు తుడుచుకుంటోంది… కార్తీక్ శోకరసంలో జీవించేస్తున్నాడు……… ఏమిటిదంతా అంటారా..? ఈటీవీ ఎక్సట్రా జబర్దస్త్‌లో ఓ సీన్… ఎందుకీ శోకాలు అంటారా..? ఆ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోయాడట… గెటప్ సీను రావడం లేదట… ఆటో రాంప్రసాద్ ఒంటరివాడయ్యాడట… దాంతో అందరూ తలుచుకుని, కుమిలి కుమిలి ఏడుస్తున్నారు… ఓ స్కిట్ చేశారు దానిపైనే… […]
సుస్మిత, అఖిల్, గణేష్ మాస్టర్ ఔట్… పాపీ ఇన్…! ఈటీవీలో ఏదో జరుగుతోంది..!!
ఖచ్చితంగా ఈటీవీలో ఏదో జరుగుతోంది… దాంతోపాటు మల్లెమాల కంపెనీలోనూ ఏదో నడుస్తోంది… ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో, ఎవరు ఉంటున్నారో ఎవరికీ అర్థమయ్యే పరిస్థితి లేదు… వారం వారం ఏదో మార్పు… ఎవరికీ స్థిరత్వం లేదు అక్కడ… నాణ్యత మటాష్… అందరిలోనూ ఏదో అస్థిర భావన… కమెడియన్లు, యాంకర్లు, జడ్జిలు… అందరిదీ ఇదే స్థితి… తాజాగా ఢీలో మార్పులు ఇంట్రస్టింగుగా ఉన్నాయి… ఒకవైపు బిగ్‌బాస్ హౌజులో అఖిల్ సార్థక్ అంటే, ఇక్కడ ఢీషోలో మెంటార్‌గా కనిపించేవాడు… సరే, […]
- « Previous Page
- 1
- …
- 22
- 23
- 24
- 25
- 26
- …
- 41
- Next Page »