తిరుపతి లడ్డూ వివాదంపై ప్రజాశాంతి పార్టీ చీప్ కేఏపాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు… తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని, తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు…
740 మంది క్యాథలిక్స్ కోసం వాటికన్ ప్రత్యేక దేశంగా ఉందని… కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతి యూనియన్ టెర్రిటరీగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు…. లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు…
.
Ads
ఆహా… పాల్… సకల హిందూ సమాజం నిన్ను ప్రశంసిస్తోంది… సోకాల్డ్ కషాయ, సారీ, కాషాయ ప్రముఖులకన్నా నువ్వు బెటర్… వందలు, వేల మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు ఎట్సెట్రా ఎట్సెట్రా హిందూ పరిరక్షణ ఫోజురాయుళ్లకన్నా నువ్వు వేల రెట్లు బెటర్… మరీ ముఖ్యంగా జియ్యర్లు, స్వరూపులకన్నా వేలకు వేల రెట్లు బెటర్…
నిజమే కదా… ప్రతి ఒక్కడూ హిందూ గుళ్లతో ఆడుకునేవాడే… ఆ భక్తుల సొమ్మును దోచుకునేవాడే… ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించేవాడే… జగన్ అయితేనేం, కేసీయార్ అయితేనేం, రేవంత్ అయితేనేం, చంద్రబాబు అయితేనేం… అందరూ దేవుళ్ల ద్రోహులే కదా… ఎస్, మోడీ మరీ ఎక్కువ… మోహన్ భగవత్ అంతకన్నా ఎక్కువ…
.
హిందూ గుళ్లపై మాత్రమే ఈ సర్కారు పెత్తనం దేనికి..? సుప్రీంకోర్టు కూడా ఠాట్, చంద్రబాబూ నువ్వు చేస్తోంది తప్పు అంటోంది తప్ప అసలు శాశ్వత రెమెడీ ఏం ఆలోచిస్తోంది గనుక..? పైగా శబరిమల, శనిశింగాపూర్ వంటి గుళ్లపై అపరిపక్వ అంచనాలు, తీర్పులు… ఇది నాస్తిక, ఆస్తిక ఘర్షణ కూడా కాదు… ఆయా మత సంస్థల్ని ఆయా మతాలే చూసుకోనివ్వండి…
లడ్డూ దగ్గర నుంచి, దర్శనాలు, కాటేజీలు, వసతి దాకా… ప్రతిచోటా దోపిడీయే కదా… అచ్చంగా ఓ ప్యూర్ గుడిలా ఎందుకు ఉండకూడదు తిరుమల… అదే కాదు… మధుర, అయోధ్య, వారణాసి, ఉజ్జయిని, ఛార్ ధామ్, వైష్ణో, యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, శ్రీశైలం, చిదంబరం… ప్రతిదీ… సర్కారు పెత్తనం దేనికి..? సోకాల్డ్ సెక్యులర్ వ్యవస్థలో మత సంస్థలపై దాష్టీకాలు దేనికి..?
.
కేఏపాల్… రాజకీయాల్లో జోెకర్‌గా కనిపించవచ్చుగాక… తన చేష్టలు, తన మాటలతో నవ్వుపెట్టించేలా వ్యవహరించవచ్చుగాక… కానీ భలే పాయింట్ కదా… ఏకంగా ఈ దేశ అపెక్స్ కోర్టు దాకా వెళ్లాడు… ఈ పని ఎవడికి చేతనైంది..? ఏ హిందూ ఛాంపియన్‌కు చేతనైంది..? ఇదే మోడీ ఈ దిశగా ఎందుకు ఆలోెచనలు చేయలేకపోయాడు..?
నిజమే కదా… కేవలం 740 మంది క్యాథలిక్కుల కోసం వాటికన్ ఓ ప్రత్యేక దేశం అయినప్పుడు… కోట్లాది మంది దర్శించుకునే ఒక తిరుమల ‘స్వయంపాలిత ప్రాంతం’ ఎందుకు కాకూడదు..? తుచ్ఛమైన రాజకీయాలకు పునరావాసం, అక్రమార్జనలకు ఎందుకు అడ్డా కావాలి..? ఒక జగన్, ఒక చంద్రబాబు ఎందుకు రాజకీయాలకు ఆలవాలంగా మార్చుకోవాలి..? అన్యమతస్తులకు ఎందుకు ఆశ్రయంగా మారాలి…
.
ఎస్, భూమనలు, చెవిరెడ్డిలు, సుబ్బారెడ్డిల ఇనుప చెరల నుంచి ఒక తిరుమల ఎందుకు విముక్తం కాకూడదు..!! ఇదే చంద్రబాబు ఓ టీవీ5 నాయుడికి పగ్గాలు ఇస్తాడనే వార్తలే భక్తజనాన్ని భయపెడుతున్నవేళ… కేఏపాల్… నువ్వు సూపర్ ఫాదరూ..!! సగటు వెంకన్న భక్తుడి కానుకల్ని అడ్డంగా దోచుకునే వ్యవస్థ ఇకనైనా మారి, ఓ పవిత్ర ప్రాంగణంగా మారేందుకు సోకాల్డ్ సుప్రీంకోర్టు పూనుకుంటుందా..?!
Share this Article