కౌన్ బనేగా కరోడ్ పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్న మోహిత శర్మ ఈమే… ఐపీఎస్ ఆఫీసర్… నిజం, ఆ షోకు వచ్చేవాళ్లలో చాలామందికి చాలా అంశాల మీద చాలా జ్ఞానం ఉంటుంది… రావడానికి ప్రయత్నిస్తూ ఓడిపోతున్న వాళ్లకూ అంతే… కాకపోతే ఆ హాట్ సీటు మీదకు రావడానికి జ్ఞానమే కాదు, అదృష్టం కూడా కావాలి… డెస్టినీ నడిపించాల్సిందే అక్కడి దాకా… అంతెందుకు బోలెడు మంది ప్రాథమిక స్థాయిలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు… కొందరు అక్కడి దాకా వచ్చి, హాట్ సీటు మీదకు చేరలేరు…
సీటు మీద కూర్చున్నా సరే… చాలామంది తక్కువ మొత్తాలతోనే తిరుగు పయనం కడతారు… జవాబులు తెలిసీ తడబడేవాళ్లు, టైమ్‌కు లైఫ్ లైన్ సరిగ్గా వాడుకోలేనివాళ్లు, సరిగ్గా ఆట విడిచిపెట్టే సమయానికే ఏదో గొట్టు ప్రశ్న తగిలేవాళ్లు… అందుకే ఆ షో అంత పాపులర్… అఫ్ కోర్స్ హోస్ట్ చేసేవాడూ సరైనోడు కావాలి… అమితాబ్ సక్సెస్… మిగతా హోస్టులందరూ ఫెయిల్… అసలు అమితాబ్ ని అన్నిరకాల దివాలా కష్టాల నుంచి గట్టెక్కించింది కూడా ఈ షోయే…
విషయానికి వస్తే… ఈ కోటి గెలిచిన మోహితకు కోటి రూపాయలు ఇప్పించిన ప్రశ్న ఏమిటో… ఏడు కోట్లు దక్కనివ్వని ప్రశ్న ఏమిటో చెప్పుకుందాం ఓసారి…
సోమవారం ఏ లైఫ్ లైనూ అవసరం లేకుండానే 3.2 లక్షల దాకా నెట్టుకొచ్చింది… నిన్నటి ఎపిసోడ్‌లో ఒకే ఒక లైఫ్ లైన్ వాడింది… మంగళవారం అనేక భిన్నమైన అంశాలపై ప్రశ్నలకు ఆమె జవాబులు ఇచ్చే తీరు చూసి అమితాబ్ కూడా బాగా ఇంప్రెసయ్యాడు… చివరకు కోటి రూపాయల ప్రశ్న వచ్చింది… దానికి ‘AskTheExpert’ సాయం తీసుకుని, గెలిచింది… ఆ ప్రశ్న…
“Which of these explosives was first patented in 1898 by German chemist Georg Friedrich Henning and first used in World War II?”
The options were – HMX, RDX, TNT and PETN.
జర్మన్ కెమిస్ట్ జార్జ్ ఫ్రెడిరిచ్ హెన్నింగ్ రెండో ప్రపంచయుద్ధంలో వాడిన ఏ పేలుడు పదార్థానికి 1898లో పేటెంట్ తీసుకున్నాడు…
ఆప్షన్లు… HMX, RDX, TNT, PETN.
.
ఆన్సర్ ఆర్డీఎక్స్…
https://twitter.com/SonyTV/
మరి ఏడో కోట్ల ప్రశ్న..? ఆమెకు చాయిస్ లేకపోయినా సరే, ఆ ప్రశ్నను కూడా రివీల్ చేస్తారు కదా… ఆ ప్రశ్న ఏమిటంటే..?
“Launched in 1817, which of these ships built by the Wadia Group in Bombay is the oldest British warship still afloat?”
The options were HMS Minden, HMS Cornwallis, HMS Trincomalee and HMS Meanee
వాడియా గ్రూపుతో బాంబేలో నిర్మించబడి, 1817లో ప్రారంభించబడి, ఈరోజుకూ ఉపయోగంలో ఉన్న బ్రిటిష్ యుద్ధనౌక పేరు ఏమిటి..?
ఆప్షన్లు… HMS Minden, HMS Cornwallis, HMS Trincomalee, HMS Meanee
.
ఆన్సర్ … హెచ్ఎంఎస్ ట్రింకోమలి
అది కూడా ఆమె చెప్పేసి ఉంటే… కథ వేరే ఉండేది… కానీ… రాసిపెట్టి ఉండాలిగా…!!
Share this Article