Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దృశ్యం-3 … వెంకీ మామ లక్కీ… భలే తప్పించుకున్నాడు రీమేక్ నుంచి…

May 21, 2026 by M S R

.

హీరో వెంకటేశ్ అదృష్టం బాగుంది… రెమ్యునరేషన్ దగ్గర ఏమైనా బెడిసికొట్టిందో, అసలు ఈ సినిమాకు తెలుగులో రీమేక్ అవసరమా అని నిర్మాతలు అనుకున్నారో, మోహన్‌లాల్‌కు తెలుగులో కూడా స్ట్రెయిట్ మార్కెట్ బాగానే ఉంది కదానే భావనల్లో ఉన్నారో గానీ… దృశ్యం3 సినిమాకు తెలుగులో రీమేక్ లేదు, నేరుగా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేశారు…

అదీ ప్రమోషన్ లేదు, ఎవరికీ సరైన కమ్యూనికేషన్ లేదు… తెలుగు ప్రేక్షకులే కదా, చూడక చస్తారా అన్నట్టుగా… పోనీ, హైదరాబాద్ మీడియా మీట్లు, బరువైన వందలాది కవర్లు, సిండికేట్లకు నానా ప్రలోభాలు వద్దనుకుంటే కనీసం సోషల్ మీడియాలో డిఫరెంట్ ప్రచారం అయినా చేసుకోవాలి కదా…

Ads

సరే, దృశ్యం అనబడే థ్రిల్లింగ్, గ్రిప్పింగ్ కథ రెండు భాగాలు సూపర్ హిట్, వెంకీ కూడా లక్కీ… కానీ మూడో పార్ట్ ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది నిశ్శబ్దంగా… కానీ ఆ రెండు భాగాలకు ఇది ఓ సాగదీత… ఆ టైటిల్ బ్రాండ్‌ను డబ్బు చేసుకునే సంకల్పం తప్ప… ఆ పటుత్వం లేదు, ఆ థ్రిల్లూ లేదు… ఫాఫం మోహన్‌లాల్…

‘దృశ్యం 3’ కథ మళ్లీ అదే పాత కేసు కారణంగా జార్జ్‌కుట్టి కుటుంబం ఎలా ప్రమాదంలో పడింది, కుటుంబానికి బలమైన స్తంభంలా నిలిచే జార్జ్‌కుట్టి తన కుమార్తెలను రక్షించడానికి, కుటుంబాన్ని కలిసికట్టుగా ఉంచడానికి మరోసారి ఎలా రంగంలోకి దిగాడు అనే అంశాల చుట్టూ తిరుగుతుంది…

మోహన్‌లాల్, జార్జ్‌కుట్టి పాత్రలో మరోసారి శ్రమ లేకుండా ఒదిగిపోయాడు… తనకు వంక పెట్టడానికి ఏముంటుంది..? నటరత్నం…! మీనా గత రెండు పార్టుల్లో ఉంది కాబట్టి ఇక్కడా ఉంది, నిజానికి ఆ పాత్రలో ఎవరైనా సరే… మీనా స్పెషాలిటీ ఏమీ లేదు…

ఇక్కడ ప్రధాన సమస్య నటనలో లేదు, స్క్రిప్ట్ రచనలోనే ఉంది… మీనా, ఇద్దరు కుమార్తెలు తమ పాత్రలకు కావలసినంత మేరకు ఏదో న్యాయం చేశామనిపించారు, కానీ వారి నుండి చెప్పుకోదగ్గ భావోద్వేగ సన్నివేశాలు గానీ, ప్రత్యేకంగా ఆకట్టుకునే నటన గానీ ఎక్కడా కనిపించవు…

‘దృశ్యం 3’ సినిమా హత్య, జార్జ్‌కుట్టి కుటుంబం ఎదుర్కొన్న బాధాకరమైన సంఘటనల రీక్యాప్ (గత కథనం) తో ప్రారంభమవుతుంది… అయితే, ఆ రీక్యాప్ ముగిసిన తర్వాత, ఇంటర్వెల్ వరకు సాగే డ్రామా అంతగా ఆకట్టుకోదు, ప్రేక్షకులను కథలో లీనం చేయలేకపోతుంది… మొదటి భాగం ప్రధానంగా ‘దృశ్యం’ హిట్ అయిన తర్వాత జార్జ్‌కుట్టి చిత్ర నిర్మాణ ప్రయాణం, ప్రొడక్షన్ డీల్‌కు సంబంధించిన కొన్ని సమస్యలు,  సినిమా యూట్యూబ్‌లో లీక్ కావడం వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది… దురదృష్టవశాత్తూ, ఈ కథనం కానీ, దీని చుట్టూ వచ్చే ఘర్షణలు కానీ ఎలాంటి ఆసక్తిని కలిగించవు…

మధ్యమధ్యలో, దర్శకుడు జార్జ్‌కుట్టి కుమార్తెల భావోద్వేగ కోణాన్ని, వారి భవిష్యత్తు గురించి ఆ తండ్రి పడే నిరంతర భయాన్ని చూపించే ప్రయత్నం చేశాడు… కానీ ఈ సన్నివేశాలు అక్కడక్కడా వస్తూ, కథనంలో ఎలాంటి బలమైన ఇంపాక్ట్ లేదా ఉత్కంఠ లేకుండా కేవలం జార్జ్‌కుట్టి ఊహల ఆధారంగానే సాగుతాయి…

మొత్తంగా, మొదటి భాగం జార్జ్‌కుట్టి చిత్ర నిర్మాణ సమస్యలు, తన కుమార్తెల పట్ల అతని భయాలు, ఒక కుమార్తె వివాహానికి సంబంధించిన సమస్యల చుట్టూ నడుస్తుంది… ఈ డ్రామా చాలా వరకు సాదాసీదాగా ఉంటుంది… ఇంటర్వెల్‌లో ఒక ట్విస్ట్ ఉన్నప్పటికీ, అంతకుముందు వచ్చే డ్రామాలో తగినంత పట్టు, వేగం లేకపోవడం వల్ల ఆ ట్విస్ట్ పెద్దగా ప్రభావం చూపదు… మొత్తానికి, మొదటి భాగం జస్ట్ ఓకే అనిపిస్తుంది…..

రెండో భాగం ప్రారంభ సన్నివేశాలు కూడా మొదటి భాగంలో ఎదురైన బోర్ కొట్టించే విధానాన్ని కొనసాగిస్తాయి. అయితే, మిడ్‌పాయింట్ నుండి క్లైమాక్స్ వరకు, ఎలాంటి పెద్ద షాకింగ్ ట్విస్టులు లేదా మలుపులు లేకపోయినా, సినిమా కాస్త ఆకట్టుకునేలా మారుతుంది…

స్థూలంగా…  జార్జ్‌ కుట్టి కుటుంబానికి సంబంధించిన భావోద్వేగ కోణం ఇందులో పూర్తిగా లోపించింది… ట్విస్టులు, సస్పెన్స్ విషయానికి వస్తే, గుర్తుంచుకోదగ్గ అంశాలు ఏవీ లేవు..క్లైమాక్స్‌లో దర్శకుడు ఒక ఆలోచనతో ప్రయోగం చేశారు, దాన్నే సినిమా ప్రధాన ట్విస్ట్‌గా భావిస్తే, మొత్తం సినిమాలో ఉన్న ఏకైక చెప్పుకోదగ్గ ట్విస్ట్ అదే అవుతుంది… అది కూడా కేవలం ‘ఫరవాలేదు’ అనేలా మాత్రమే వర్కవుట్ అయింది…

మొత్తంగా చూసుకుంటే, ‘దృశ్యం 3’ అనేది పూర్తిగా అనవసరమైన, బలవంతంగా తీసిన సీక్వెల్‌లా అనిపిస్తుంది… ఇది అసలు సినిమా సృష్టించిన ప్రమాణాలకు, అంచనాలకు దరిదాపుల్లో కూడా నిలవదు….. అన్నింటికంటే ముఖ్యంగా, ప్రతి కథకూ ఒక పరిమితి, ముగింపు ఉంటుందని ఈ మూడవ భాగం మనకు గుర్తు చేస్తుంది… దర్శకుడు, మోహన్‌లాల్ ఇద్దరూ ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిద్దాం…

ఈ సినిమాలో ప్రధానలోపం డబ్బింగ్ క్వాలిటీ… వెరీ పూర్… చివరకు నెట్‌‌ప్లిక్స్ వంటి ఓటీటీల కోసం కూడా డబ్బింగ్ ప్రమాణాలు నాణ్యంగా ఉండేలా చూసుకుంటున్న ఈ రోజుల్లో, ఓ థియేటర్ సినిమాకు డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు లేకపోవడం అంటే… తెలుగు ప్రేక్షకుల పట్ల చిన్నచూపే… ఎలా ఉన్నా చూస్తారులే అనే పిచ్చి భ్రమ…

మొత్తంగా… పరుగులు తీస్తూ థియేటర్లలో చూడాల్సిన పనిలేదు… నిలువు దోపిడీ అక్కర్లేదు… టీవీలో వచ్చినప్పుడు చూడొచ్చు… ఓటీటీలో చూడొచ్చు…. ష్, చూడకపోయినా పెద్ద నష్టం లేదు, ఫరక్ పడదు, అంత సీనూ లేదు…!!

    సర్, దర్శకుడు గారూ… ప్లీజ్, నాలుగో భాగం ఆలోచించకండి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం విష్ణుప్రియ..! చివరకు ఆ చీప్ జబర్దస్త్ షోలోనూ సెటైర్లు..!!
  • హక్కుల బాలగోపాల్ స్మృతి… ఒక వాస్తవిక గణితం…
  • అమ్మ కుర్చీ..! శూన్య నేత్రాలు… శుష్క నిరీక్షణలు… ఇప్పటి అమ్మ…!!
  • మాయదారి సంత..! రేయ్, ఎవుర్రా మీరంతా..? యాణ్నుంచి వచ్చార్రా..!!
  • భారతీరాజా గొప్ప దర్శకుడే… కానీ కొన్ని వివాదాలు కూడా…
  • సర్కారు ఉంటేనేం, పోతేనేం… డీఎంకే లిక్కర్ వసూళ్లపై విజయ్ నజర్..!
  • తెలుగు వెండితెరపై 30 ఏళ్ల క్రితమే ‘హక్కుల కాక్రోచ్‌లు…
  • వినకుండానే నామినేషన్ రద్దా..? రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన తప్పేంటంటే..?
  • నత్వానీకి, మీనాక్షికి వేర్వేరు న్యాయాలు… డబుల్ స్టాండర్డ్స్..! సీట్ చోరీ…!
  • ఆ సీఎంకు ముందే ఎలా తెలుసు..? ఇదంతా ముందస్తు ప్లానేనా..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions