Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆల్రెడీ చచ్చిపోయిన హీరో ఓ విలన్‌ను సైలెంటుగా లేపేస్తాడు…

April 27, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. మరో ఎర్ర సినిమా . 1991 జనవరిలో వచ్చిన ఈ ఎర్ర మందారం సినిమాకు అయిదు నంది అవార్డులు వచ్చాయి .‌ఉత్తమ నటుడిగా రాజేంద్రప్రసాద్ , ఉత్తమ చిత్రం , ఉత్తమ గేయ రచయితగా యాలో యాలో ఉయ్యాలా పాటను వ్రాసిన జాలాదికి , ఉత్తమ విలనుగా దేవరాజ్ , ఉత్తమ ఎడిటరుగా గౌతం రాజు .

అంతే కాదు . తమిళం లోకి Puthiya Parasakthi అనే టైటిలుతో రీమేక్ చేయబడింది . సెల్వ , సుకన్య , నెపోలియన్ ప్రధాన పాత్రల్లో నటించారు . బలరామ అనే టైటిలుతో కన్నడంలోకి రీమేక్ అయింది . రాక్ లైన్ వెంకటేష్ , ప్రేమ లీడ్ రోల్సులో నటించారు . తెలుగులో కూడా నిర్మాతలకు కాస్తో కూస్తో లాభాలే వచ్చాయి .

Ads

ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో యం వి యస్ హరనాధరావు వ్రాసిన “లేడి చంపిన పులి నెత్తురు” కధ ప్రజా నాట్యమండలి ప్రసిధ్ధులు పోకూరి బాబూరావుకి బాగా నచ్చింది . సినిమా తీద్దామని హరనాధరావుని సంప్రదిస్తే సినిమా కొరకు ఆయనా , సంజీవి , బాబూరావు చాలా మార్పులు చేసి స్క్రీన్ ప్లేని బిర్రుగా తయారు చేసుకున్నారు . దర్శకత్వ బాధ్యతలు ముత్యాల సుబ్బయ్య గారికి అప్పచెప్పారు .

కధలో చాలా ఎర్ర సినిమాల లాగానే ఓ మోతుబరి రావణుడు కం కీచకుడు కం దోపిడీదారుడు ఉంటాడు . అతని వద్ద రాజేంద్రప్రసాద్ నమ్మినబంటులాగా పనిచేస్తుంటాడు . ఆ గ్రామం సర్పంచ్ పోస్ట్ SC లకు రిజర్వ్ చేయబడుతుంది . నమ్మినబంటు అయిన రాజేంద్రప్రసాదుని గ్రామ ప్రెసిడెంటుని చేస్తాడు .

జవహర్ రోజ్గార్ యోజన పథకం కింద వచ్చిన నిధులను నొక్కేయటానికి దొర ప్రయత్నిస్తే రాజేంద్రప్రసాద్ అడ్డం పడతాడు . దానితో ఘర్షణ ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత తెలుగు గంగ ప్రాజెక్ట్ కొరకు బలహీన వర్గాల భూములను సేకరిస్తానికి ప్రభుత్వ ప్రకటనలో తమ భూముల్ని ఇన్నాళ్ళు దొర అనుభవించాడని తెలుసుకొని ఎదురు తిరుగుతాడు .

చేయని హత్యను పైనేసి ఆరేళ్ళు జైలుకు పంపుతాడు . జైలు నుంచి తిరిగొచ్చిన రాజేంద్రప్రసాదుకు దొరకు ఘర్షణ కొనసాగుతూ ఉంటుంది . ఘర్షణలో రాజేంద్రప్రసాదుని చంపి “ఈరి గాడు” అని పోలీసుల చేత రికార్డు చేయించి దహనం చేపిస్తాడు .

ఇక్కడ నుండే ఊహించని మలుపును ప్రవేశ పెట్టారు రచయితలు . పగ తీర్చుకోవటానికి రాజేంద్రప్రసాద్ భార్య యమున , కొడుకు డిసైడ్ అయిపోతారు . యమున మీద కన్నేసిన దొరకు లొంగినట్లు నటించి తోట బంగళాలో తల్లీకొడుకులు దొరను చంపేస్తారు . వచ్చిన పోలీసులకు రాజేంద్రప్రసాదే వచ్చి ఈ హత్యను చేసాడని రివర్స్ గేం ఆడతారు . ఏం చేయలేక అలాగే రికార్డు చేసుకుని పోలీసులు వెళ్ళిపోవటంతో సినిమా ముగుస్తుంది .

ముందుగా మెచ్చుకోవలసింది రాజేంద్రప్రసాద్ , యమున , దేవరాజులను . హాస్య పాత్రలకు చిరునామా అయిన రాజేంద్రప్రసాద్ సీరియస్ పాత్రలో రాణించాడు . ఈ ముగ్గురిలో ఇద్దరికి నంది అవార్డులు వచ్చాయి . యమునకు మిస్సయింది .

పిల్లాడిగా పోకూరి బాబూరావు సోదరుడి కొడుకు కిరణ్ బాగా నటించాడు . తర్వాత పవర్ఫుల్ పాత్ర మా గుంటూరు జయలలితది . రంగస్థలంలో అనసూయ పాత్రలాగా ఉంటుంది కాస్త . ఇతర పాత్రల్లో నర్రా , సంజీవి , పి యల్ నారాయణ , సాక్షి రంగారావు , శైలజ , కాకరాల తదితరులు నటించారు . ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో జాలాది , సిరివెన్నెల , అదృష్ట దీపక్ వ్రాసిన పాటలను బాలసుబ్రమణ్యం , శైలజ , చిత్ర , వందేమాతరం శ్రీనివాసులు గొప్పగా పాడారు . యాలో యాలో ఉయ్యాలా పాటకు జాలాదికి నంది అవార్డ్ కూడా వచ్చింది . కాదు కాదంటావా దొర మాట కాదంటావా , ఏంది బుల్లెమ్మ బిర్రున బిగుసుకుపోయేవు , దండాలయా జేజేలు పాటలు బాగా చిత్రీకరించబడ్డాయి . ఎర్ర సినిమాలకు కూడా ఎంత ప్రశాంత , ఆహ్లాద , సందర్భోచిత బేక్ గ్రౌండ్ స్కోరుని ఇవ్వొచ్చో నేటి తరం ఢాం ఢాం దర్శకులు ఈ సినిమాను చూసి నేర్చుకోవాలి .

ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాలలో ఔట్ డోర్ షూటింగ్ చేసారు . తప్పక చూడవలసిన సినిమా . పాతికేళ్ళ కింద వరకూ సామాజిక , ఆర్థిక , రాజకీయ దోపిడీలకు వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు వచ్చాయి . తర్వాత తర్వాత జనంలో మార్పులు వచ్చాయి . నా ఇల్లే వైకుంఠం నా బొందే కైలాసం బాపత్తు పెరిగిపోయారు . ఎంతగా అంటే తమకు అన్యాయం జరిగినా జరిగిందని చెప్పే పరిస్థితి కూడా లేదు .

నా ఈ గోడు ఎప్పుడూ ఉండేదే అనుకోండి . ఎక్కడో ఓ రౌండబౌట్ టర్న్ తీసుకుంటుంది . మూడు రోజుల కింద మహారాష్ట్రలో ఓ సాధారణ మహిళ మంత్రిని , పోలీసులని , ప్రదర్శకులను నిలదీయలా ! టైం రావాలి . పాపం పండాలి . వేయి గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానతో రామార్పణం . Let us wait . ఈ సినిమా యూట్యూబులో ఉంది .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ – ఒక థ్రిల్లింగ్ ‘మెగా’ సీరియల్!
  • పల్స్ పోలియో! ఏటా ‘చుక్కల’ ప్రయాసకు కూడా పాకిస్థానే కారణం..!
  • అన్నీ వదిలేసి.., హిమాలయ సన్యాస జీవనం అంత సులభమా?
  • నిజమే – పాస్‌పోర్టు జాతీయతను నిర్ధారించదు! ఇదీ వాస్తవ స్థితి!
  • RAAKA – రష్మిక నెగెటివ్ షేడ్స్ – రొమాన్స్ కాదుట, ఘర్షణ !
  • BRS – నైరాశ్యం వీడని పార్టీ కేడర్! ఫాయిదా లేని KTR ప్రయాస!!
  • ఆశ్చర్యమేమీ లేదు- పాక్ క్రికెటర్లతో ఉగ్రవాదుల చెట్టాపట్టాల్!
  • పాకిస్థాన్! … అరబ్ భ్రమల నుండి సింధు, సంస్కృత మూలాల వైపు…
  • ‘కమ్మ’ అంటే తెలుసా? – ‘ఇడుపు కాయితం’ అసలు అర్థమేమంటే?
  • గంగ చంద్రముఖిలా..! కాషాయ రాంచందర్‌ కాస్తా పింక్ హరీష్‌లా…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions