.
తెలంగాణ స్టేట్ విముక్తి వేరు- హైదరాబాద్ రాజ్యం / సంస్థానం విముక్తి వేరు… శుష్క మేధస్సుల బారిన పడి చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు… విలీనం, విమోచనం, విద్రోహం గట్రా పదాల గారడీ నడుమ సమాధి అవుతున్న నిజాల్ని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం…
సెప్టెంబరు 17… హైదరాబాద్ రాజ్యంతోపాటు అందులో భాగంగా ఉన్న భౌగోళిక తెలంగాణ కూడా విముక్తి పొందింది… దాన్ని విమోచనం అనండి, అంతిమంగా ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది కాబట్టి విలీనం అనండి… కానీ అసలు విముక్తి ఎప్పుడు జరిగింది..?
Ads
దిక్కుమాలిన భాషాప్రయుక్త రాష్ట్రాల పేరిట… తెలంగాణను ఆంధ్రాతో కలిపిన కుట్ర కొన్ని దశాబ్దాలపాటు రాజ్యమేలాక 2014లో అసలు సిసలు విముక్తిని పొందింది… అది అసలైన విమోచనం… మన పొడ గిట్టని, తెలంగాణ భాష, సంస్కృతి, జనం అంటే తీవ్రంగా వ్యతిరేకించి, అసహ్యించుకున్న ఆంధ్రా భావజాలం నుంచి, ఆక్రమణ నుంచి, ఆ పాలకుల పాలన నుంచి విముక్తి పొందడం..!
మరి విద్రోహం మాటేమిటి..? అదొక అబ్సర్డ్ పదం! ఇక్కడ సర్దార్ పటేల్ యాక్షన్‌ను అర్థం చేసుకోవాలి… సాయుధ పోరాటం సక్సెసై ఓ ఎర్ర రాజ్యం స్థాపించే భ్రమల్లో రష్యా, చైనా బానిస పార్టీలు ఉండిపోయి, ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనమయ్యాక కూడా పోరాడాయి… వందలాదిగా ఆ కమ్యూనిస్టులను ఏరేశాక చివరకు రిట్రీట్ ప్రకటించి, చేతులెత్తేశారు…
చుట్టూ తన ప్రాంతాలు, నడుమ ఓ ఎర్ర రాజ్యాన్ని యూనియన్ పాలకులు ఎందుకు అంగీకరిస్తారు..? కాంగ్రెస్ కూడా రాజకీయ పార్టీయే కదా… అందుకే ఆదిలోనే నిర్దాక్షిణ్యంగా తుంచేసింది… ఎస్, నెహ్రూ కాదు, సర్దార్ పటేల్ మాత్రమే ఈ క్రెడిట్‌కు అర్హుడు… ఎందుకంటే… అప్పటికే నెహ్రూ అనాలోచిత విధానాలతో కశ్మీర్ చేజారింది… పాకిస్థాన్ కోరలు చాస్తోంది… ఆక్రమిస్తోంది…
అటు చైనా పట్ల, ఇటు పాకిస్థాన్ పట్ల నెహ్రూ అండ్ కో ఆలోచనవిధానం అట్టర్ ఫ్లాప్… ఈ స్థితిలో కశ్మీర్ వంటి మరో రావణకాష్టం దేశం నడిబొడ్డున ఉండటం సర్దార్‌కు ఇష్టం లేదు… అప్పటికే ఐరాస దాకా వెళ్లింది హైాదరాబాద్ నిజాం ప్రభుత్వం, స్టేట్‌వ్యాప్తంగా మతమౌఢ్యులు హిందూ సమాజంపై పీడనకు దిగారు… సో, మరో పాకిస్థాన్‌ను దేశం గరిమనాభిలో క్రియేట్ చేయడం ఇష్టం లేక సర్దార్ ఆపరేషన్ పోలో అన్నాడు… వారం రోజుల్లో నిజాం మేకపోతు గాంభీర్యం దెబ్బతిని, సలాం చేసి, నడుం వంచి, దాసోహం అన్నాడు…
ఒక మతమౌఢ్య లేదా ఒక పొరుగు దేశాల బానిస రాజ్యాలు ఏర్పడకుండా… పటేల్ కాపాడాడు… ఇక్కడ బీజేపీ స్టాండ్ క్లియర్… విమోచనం… ఎర్ర దాస్యం నుంచి, మత మౌఢ్యం నుంచి విమోచనం… ఈ పార్టీకి మజ్లిస్ ఎదుట సాగిలపడాల్సిన అవసరం లేదు… అందుకే ధైర్యంగా విమోచన దినం జరుపుతోంది…
కానీ ఒక తెలుగుదేశం కావచ్చు, అప్పట్లో ఉద్దరించింది కదా… ఒక బీఆర్ఎస్ కావచ్చు, ఇది మరీ దిక్కుమాలిన భావజాలం… ఒక కాంగ్రెస్ కావచ్చు, అవకాశవాదం… ఎవరికీ ఓ స్టాండ్ లేదు… ఒకరు ప్రజాపాలన దినం అంటారు… ప్రజాపాలనకు విమోచనదినమే దేనికి..? నేను ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గను, దోస్తీకి తప్ప అంటాడు రేవంత్ రెడ్డి గంభీరంగా…
మజ్లిస్‌కూ, కాంగ్రెస్‌కూ జాతీయ స్థాయిలో ఏ అవగాహనా లేదు, కానీ రేవంత్ మజ్లిస్ ఎదుట దాసోహం అనే వైఖరే ప్రదర్శిస్తాడు… బీఆర్ఎస్ మరీ దరిద్రం… జాతీయ సమైక్యత దినం అట… అది సెప్టెంబరు 17నే ఎందుకు..? మజ్లిస్‌తో వైరం ఇష్టం లేదు కాబట్టి… అసలు మజ్లిస్‌కు హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడం ఇష్టం లేదు కాబట్టి, విమోచనదినం జరిపితే మజ్లిస్‌కు కోపం వస్తుంది కాబట్టి ఈ సిద్ధాంత దరిద్రాలు…
ఒక మహారాష్ట్ర, ఒక కర్నాటక రాష్ట్రాలకు ఉన్న ఆత్మాభిమానం తెలంగాణకు ఎందుకు ఉండకూడదు..? ఒక కాంగ్రెస్, ఒక బీఆర్ఎస్ ఎందుకు సాగిలపడాలి, పాత బస్తీ దాటని ఆ ఆరు సీట్ల పార్టీ ఎదుట… ఎవడు కుర్చీ ఎక్కినా మన దగ్గరకు రావల్సిందే, సలాం కొట్టాల్సిందే అంటాడు అక్బరుద్దీన్… అవును, మేం గులాంలమే అని చెప్పుకోవడమా బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ వ్యవహార ధోరణి..!
Share this Article