.
ఇప్పుడు ట్రెండ్ వేరు… మామూలు సూపర్ హీరోయిజం సరిపోదు… దేవుడిని జతచేయాలి, అవసరమైతే కథానాయకుడినే దేవుడిని చేయాలి… దేవుడు ఆవహించాలి లేదా తనే దిగిరావాలి… కాంతార నుంచి దేశాన్ని ఊపేస్తున్న ట్రెండ్ కదా… చాన్నాళ్లుగా ఓ హిట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సూర్య అదే ట్రెండ్ ఆశ్రయించాడు… కమర్షియల్ మాస్ సూర్య కనిపించడమే వీరభద్రుడు (కరుప్పు) సినిమా విశేషం…
అందరి దృష్టీ దీనిపై ఎందుకు ఉందంటే..? సీఎం విజయ్ ఇష్టసఖి త్రిష ఇందులో కథానాయిక… సూర్యతో రెండు దశాబ్దాల తరువాత జతకట్టడం..! కాకపోతే మరీ రొటీన్ కమర్షియల్ సినిమాల్లోని టెంప్లేట్ ప్రకారం అంత రొమాన్స్ ఏమీ లేదు… బతికించాడు దర్శకుడు… ఇంతకీ సినిమా ఎలా ఉందంటారా..?
Ads
చాలా కాలంగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సూర్య, ఈసారి ఒక వైవిధ్యమైన ‘ఫాంటసీ సోషల్ డ్రామా’తో మన ముందుకు వచ్చాడు… ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘వీరభద్రుడు’ (తమిళంలో కరుప్పు), అటు దైవత్వాన్ని, ఇటు కోర్టు గదుల్లోని అవినీతిని ముడిపెట్టిన ప్రయత్నం…
క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన ఓ తండ్రీకూతుళ్ల కష్టాలు, వారి నగలు దోపిడీకి గురవ్వడం, ఆపై వాటిని తిరిగి పొందే క్రమంలో కోర్టుల చుట్టూ తిరగడం వంటి ఎమోషనల్ పాయింట్‌తో కథ మొదలవుతుంది… ఈ సామాన్యుల పోరాటంలోకి వీరభద్రుడు (సూర్య) ఎలా ప్రవేశించాడు..? వ్యవస్థను ఎలా ప్రశ్నించాడు..? క్లైమాక్స్‌లో ఆయన చూపిన ‘రుద్రరూపం’ దేనికి దారితీసింది..? అనదే మిగతా సినిమా…
సూర్య ‘వన్‌మ్యాన్ షో‘…: నో డౌట్… ఇది సూర్య సినిమా… చాలా కాలంగా హిట్ లేకపోయినా, సూర్య తన నటనలో వాడి తగ్గలేదని నిరూపించుకున్నాడు… లాయర్ పాత్రలో హుందాతనాన్ని చూపిస్తూనే, క్లైమాక్స్‌లో ‘కాంతార‘ తరహాలో పూనకం వచ్చినట్లు తను చేసిన నటన థియేటర్లో విజిల్స్ వేయిస్తుంది…. సూర్య ఫ్యాన్స్‌కు ఇది ఐ-ఫీస్ట్…
20 ఏళ్ల తర్వాత సూర్య–త్రిష…: ‘మౌనం పేసియాదే’, ‘ఆరు’ చిత్రాల తర్వాత దాదాపు రెండు దశాబ్దాలకు ఈ క్రేజీ జోడీ మళ్ళీ కలిసింది… అయితే ఇక్కడ రొటీన్ డ్యూయెట్లు, రొమాన్స్ ఆశించకండి… వీరిద్దరి మధ్య బాండింగ్ మెచ్యూర్డ్‌గా, కథకు అవసరమైనంత మేరకే సాగుతుంది… త్రిష స్క్రీన్ టైమ్ తక్కువే అయినా, సెకండ్ హాఫ్‌లో కీలక పాత్ర పోషించింది…
దర్శకుడే విలన్…: ఈ సినిమాకు మరో విశేషం ఏమిటంటే, దర్శకుడు ఆర్.జె. బాలాజీ స్వయంగా ప్రతినాయకుడి (బాలకృష్ణ) పాత్ర పోషించడం… విలనిజాన్ని ఒక హీరో తరహా ఎలివేషన్లతో చూపించడం కొత్తగా ఉంది… సూర్య వర్సెస్ బాలాజీ మధ్య సాగే మైండ్ గేమ్స్ పర్వాలేదనిపిస్తాయి…
వ్యవస్థపై సెటైర్లు…: సామాన్యుడు కోర్టు మెట్లు ఎక్కితే ఎదురయ్యే నరకాన్ని, లాయర్ల మాఫియాను దర్శకుడు బాగా ఎత్తిచూపారు…
లోపాలు – ఎక్కడ మిస్ అయింది?
-
రెండు వేర్వేరు సినిమాలు…: ఫస్ట్ హాఫ్ ఒక సీరియస్ కోర్టు డ్రామాలా ఉంటే, సెకండ్ హాఫ్ హఠాత్తుగా ఒక ఫాంటసీ మాస్ మసాలా సినిమాగా మారిపోతుంది… ఈ రెండు షేడ్స్ సరిగ్గా మిక్స్ అవ్వకపోవడంతో ప్రేక్షకుడు కొంత గందరగోళానికి గురవుతాడు…
-
వీక్ కామెడీ…: ఆర్.జె. బాలాజీ సినిమాల్లో ఉండే సహజమైన హాస్యం ఇందులో మిస్ అయింది… కొన్ని చోట్ల కామెడీ కృత్రిమంగా అనిపిస్తుంది…
-
డబ్బింగ్ లోపాలు…: పాటలు అనువాదంలో తమ సోల్‌ను కోల్పోయాయి… తెలుగు డైలాగుల్లో అక్కడక్కడా తమిళ వాసనలు రావడం మన ఆడియన్స్‌కు ఇబ్బంది కలిగించే అంశం… సూర్య డైలాగ్ డెలివరీ కూడా అక్కడక్కడా ఇబ్బందికరమే…
ముచ్చటగా మూడు ముక్కల్లో…
-
ఎవరి కోసం….?: సూర్య నటనను, విభిన్నమైన ఫాంటసీ ఎలిమెంట్లను ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది…
-
స్పెషల్ ఏంటి?…: సూర్య-త్రిష కాంబో అండ్ ఆ క్లైమాక్స్ గాడ్ మోడ్ సీన్….
-
ఫైనల్ వర్డిక్ట్…: ‘వీరభద్రుడు’ ఒక విలక్షణమైన ప్రయత్నం…. మేకింగ్‌లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, సూర్య కోసం ఒకసారి చూడదగ్గ చిత్రం…
Share this Article