Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మమతకు దెబ్బ మీద దెబ్బ… డెస్టినీ ఎదురుతంతే… అంతే…

September 18, 2026 by M S R

.

“ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి” అన్న పెద్దల మాట రాజకీయాల్లో అక్షరాలా నిజమవుతుంటుంది… కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు; పరిస్థితులు మారితే శత్రువులు మిత్రులవుతారు, నిన్నటి అగ్రనేతలు నేడు కొత్త సమీకరణాలను వెతుక్కోవాల్సి వస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని ప్రతిష్టాత్మక నందిగ్రామ్ ఉప ఎన్నిక వేళ జరుగుతున్న పరిణామాలు ఈ సత్యానికి సరిగ్గా సరిపోతాయి…

మమత ఏకఛ్చత్రాధిపత్యం నుంచి, దుష్పపరిపాలన నుంచి, క్షుద్ర రాజకీయాల నుంచి బెంగాల్ బయటపడింది… అంతకుముందు కాంగ్రెస్‌ను తొక్కింది, తరువాత సీపీఎంను… కొన్నేళ్లు బీజేపీని… అసలు ఆ పార్టీల ఊసే వినబడకూడదన్నంత కసిగా అణిచేసింది… కానీ ఇప్పుడు..? 

ప్రజల్లో ఛీత్కారాలు, కోడిగుడ్లతో దాడులు, పార్టీ నుంచి వలసలు, అసలు తన పార్టీ పేరు- పార్టీ గుర్తు కూడా తనకు దక్కుతుందా లేదానే డౌట్… డెస్టినీ ఒక్కసారిగా ఎదురుతన్నింది… చివరకు ప్రతిష్ఠాత్మకమైన నందిగ్రామ్‌లో తన అభ్యర్థిని నిలబెట్టలేక, చేతులెత్తేసి… ఏ కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా చేయాలని చూసిందో, అదే కాంగ్రెస్ అభ్యర్థికి బేషరతు మద్దతు ప్రకటించాల్సిన దురవస్థ ఆమెది…

Ads

మమత

ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు కనీసం ఒక్క సీటు ఇవ్వడానికి కూడా ససేమిరా అన్నది మమతా బెనర్జీ… బెంగాల్‌లో నందిగ్రామ్ చాలా ప్రతిష్ఠాత్మకమైన సీటు… హత్యకు గురైన సువేందు పీఏ చంద్రనాథ్ రథ్ తల్లి హసిరాణి రథ్‌ను బీజేపీ ఇక్కడ నిలబెట్టింది… దీంతో నందిగ్రామ్ పోరు రాజకీయంకన్నా ఉద్వేగపూరితంగా మారింది… 

సెంటిమెంట్… ఇక్కడ మమత తన అభ్యర్థిగా సంచితా ప్రధాన్‌ను ప్రకటించింది, నామినేషన్ కూడా వేసింది… హఠాత్తుగా ఆమె సీఎం సువేందుకు కలిసి తరువాత, నామినేషన్ ఉపసంహరించుకుంది… సువేందు ప్లాన్… మమతకు తలబొప్పి కట్టింది… అసలే ఎన్నికల కమిషన్ ఈసారి పార్టీ గుర్తు, పేరును ఫ్రీజ్ చేసింది, న్యాయవివాదం ఉన్నందున…

వేరే దిక్కులేక ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడిన మిలన్ ప్రధాన్‌కు మమత మద్దతు ప్రకటించింది… బీజేపీ మీద పోటీలో పూర్తిగా చేతులెత్తేయలేక..! మమత రాను రాను చాలా చేదు అనుభవాల్సి రుచిచూడాల్సి రావచ్చు…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మమతకు దెబ్బ మీద దెబ్బ… డెస్టినీ ఎదురుతంతే… అంతే…
  • ఫస్ట్ కెప్టెన్ ఝాన్సీ! సరైన ఫలితమే! కానీ యాదృచ్ఛికమేనా?!
  • మీనాక్షి నటరాజన్! వదలక వెంటాడుతున్న ఆ రెండు కేసులూ !!
  • తెలంగాణ అమరుల కథలు వేర్వేరు- ఏ సోయీ లేని పార్టీల ప్రముఖులు…
  • ఇవేం కక్కుర్తి పనులురా బాబూ..! వీసా కోసం 13 ఏళ్ల బాలికతో పెళ్లి ?
  • ‘రాముడి’పై ఇదేం కొత్త లొల్లి… పాత వీడియోను పట్టుకుని రచ్చ!
  • శ్రీచక్రం మధ్యలో సమంత..! తంత్రమా? అపచారమా? ఏది నిజం!!
  • అంతటి గండరగండడు కూడా ఆ డైలాగ్ దగ్గర ఇరుక్కుపోయాడు!
  • రిపోర్టర్ చాకచక్యం! నిజాం నవాబు మరణవార్త అలా బయటికొచ్చింది!
  • ఇరాన్ వార్ సైడ్ ఎఫెక్ట్స్ – సౌదీకి చుక్కలు చూపిస్తున్న హుతీలు !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions