.
Pardha Saradhi Potluri … బలూచిస్తాన్, PoJK లని భారత్ విజయవంతంగా విడగొట్టగలదు ప్రస్తుత ఆర్ధిక, సైనిక, రాజకీయ బలంతో!
భారత ఆర్ధిక, సైనిక బలాలని ఇప్పటికిప్పుడు బలహీనపరచడం కష్టం! కానీ రాజకీయ అస్థిరతని కృత్రిమంగా సృష్టించవచ్చు!
మోడీ, అజిత్ దోవల్, జై శంకర్ కాంబినేషన్ విచ్చిన్నం చేయగలిగితే బీజేపీ రాజకీయ భవిష్యత్ నిర్ణయించగలగవచ్చు అనే ఒక సిద్ధాంతం బలంగా విశ్వసిస్తున్నారు దేశంలో ఉన్న ప్రత్యర్థులు.., చైనా, అమెరికాలు కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నాయి!
Ads
మోడీ నిర్ణయం తీసుకోవడంలో ఆచి తూచి వ్యవహారిస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది అమలు అయ్యేవరకూ కఠినంగా వ్యవహరిస్తారు.
ఏదన్నా నిర్ణయం తీసుకునే ముందు, అది విదేశాల విషయంలో అయితే జై శంకర్ తో, అజిత్ దోవల్ తో సుదీర్ఘంగా చర్చిస్తారు. మనం అజిత్ దోవల్ ని ఒక గూఢచారిగా, అనుభవం ఉన్న అధికారిగా చూస్తాము, కానీ జై శంకర్ ని ఒక డిప్లొమాట్ గా చూస్తాము కానీ అది నిజం కాదు!
ఏ దేశ గూఢచార సంస్థ అయిన సరే ఆయా దేశాలలో ఉండే తమ రాయబార కార్యాలయాల ద్వారానే ప్రధానంగా ఆపరేషన్స్ నిర్వహిస్తాయి. అంబాసడర్, రాయబార కార్యాలయంలో పనిచేసే ఇతర సిబ్బందికి ఆయా దేశాల చట్టాల నుండి రక్షణ ఉంటుంది కాబట్టి ఏ దేశం కూడా రాయబార సిబ్బందిని అరెస్ట్ చేయదు. కాకపొతే గూఢచర్యానికి పాల్పడినట్లు గుర్తించిన రాయబార కార్యాలయం సిబ్బందిని దేశం విడిచిపెట్టి పోవాలసిందిగా కోరుతాయి!
జై శంకర్ పలు దేశాలలో రాయబారిగా పనిచేసినా RAW తో కలిసే పనిచేశారు! మోడీ ఏరికోరి జై శంకర్ ని విదేశాంగ మంత్రిగా నియమించడం అనేది వ్యూహత్మకంగా చేసిందే!
రష్యా, చైనా, అమెరికా దేశాలలో రాయబారిగా పనిచేసిన అనుభవం ఉంది జై శంకర్ కి కాబట్టి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తో పాటు పరిచయాలు కూడా ఉంటాయి. అజిత్ దోవల్ తో జై శంకర్ కలవడం వలన చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది.
విదేశీ వ్యవహారాల విషయంలో అజిత్ దోవల్ కి జైశంకర్ కి మంచి పట్టు దొరికింది. నిర్ణయం తీసుకోవాలి అంటే మోడీకి వివరంగా చెప్పాలి. మన దేశానికి ప్రయోజనకరం అనిపిస్తే వెంటనే మోడీ ఒప్పుకుంటారు. విషయం ఏదైనా సరే మోడీ, జైశంకర్ , అజిత్ దోవల్ ముగ్గురూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. యూరోప్ కావొచ్చు, రష్యా నుండి ఆయిల్ కొనుగోలు కావొచ్చు, బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి రాజకీయ ఆశ్రయం కావొచ్చు, ఇలా ప్రతీ విషయంలోనూ ఈ ముగ్గురి నిర్ణయాలు ఉన్నాయి.

బయటికి యూరోప్, అమెరికా దేశాలు జైశంకర్ ని పొగుడుతున్నా లోపలలోపల రగిలి పోతున్న మాట వాస్తవం! విదేశాల నుండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అజిత్ దోవల్ ఇస్తే దానిని ఆధారం చేసుకొని జైశంకర్ అంతర్జాతీయ ప్రెస్ కాన్ఫరెన్స్ లో విలేఖరులు అడిగిన ప్రశ్నలకి ధీటుగా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. భారత విదేశాంగ విధానంలో ఏవన్నా మార్పులు వచ్చాయి అని చెప్పుకోవాల్సివస్తే అది జైశంకర్ కి ముందు జైశంకర్ తరువాత అని చెప్పుకోవాల్సిందే!
యూరోప్ కి కానీ, అమెరికాకి కానీ ఒక రాజకీయ నాయకుడు భారత విదేశాంగ మంత్రిగా ఉండాలని కోరుకుంటాయి, ఎందుకంటే రాజకీయ నాయకుడు విదేశాంగ మంత్రిగా ఉంటే ఒప్పందాల మీద సంతకాలు పెట్టి, ఫైల్స్ మార్చుకొని షేక్ హ్యాండ్ ఇస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చి మమ అనిపించేస్తారు! అంతర్జాతీయ వేదికల మీద విలేఖరుల సమావేశంలో ముక్తసరిగా సమాధానాలు ఇస్తారు!
అదే ఒక అనుభవమున్న డిప్లొమాట్ విదేశాంగ మంత్రి అయితే? తడుముకోవాల్సిన అవసరం ఉండదు! యూరోప్, ఆస్ట్రేలియా, అమెరికన్ జర్నలిస్టులకి జైశంకర్ ఇచ్చిన సమాధానాలు మునుపెన్నడూ వాళ్ళు వినివుండరు! విదేశీ జర్నలిస్టులు పదే పదే జైశంకర్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నా ఇప్పటి వరకూ జైశంకర్ తడుముకోలేదు సరికదా చాలా డిప్లొమాటిక్ గా చురకలు వేస్తూ వస్తున్నారు! ఇంటర్నేషనల్ జర్నలిస్టులకి జైశంకర్ ఎప్పటికీ కొరకరాని కొయ్యే!
రష్యా నుండి ఆయిల్ కొనుగోలు విషయంలో 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాము కానీ ఫ్యూ మిలియన్ ( 744 మిలియన్ ) యూరోప్ ప్రజలని అడిగి తీసుకోలేమని సమాధానం ఇచ్చారు జైశంకర్ . ఇలాంటి సమాధానం ఒక రాజకియ నాయకుడి నుండి రాదు, డిప్లొమాట్ నుండి మాత్రమే వస్తుంది. అజిత్ దోవల్ ఫీడ్ బ్యాక్ ఉందని వాళ్లకి తెలుసు!
మోడీ రాజీనామా చేస్తే చాలు! బీజేపీ ప్రభుత్వం ఉండకూడదని కోరుకోవట్లేదు వాళ్ళు. ఎందుకని?
మోడీ రాజీనామా చేస్తే అజిత్ దోవల్ కూడా రాజీనామా చేస్తారు. 2024 లో మోడీ మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమయంలోనే వయసు మీద పడుతున్నది కాబట్టి నాకు బాధ్యతలు అప్పచెప్పవద్దని అజిత్ దోవల్ మోడీని అభ్యర్థించగా, దానికి మోడీ తిరస్కరిస్తూ మీరు NSA గా ఉండాల్సిందే అని ఒప్పించి తిరిగి బాధ్యతలు అప్పచెప్పారు.
మోడీ రాజీనామా చేస్తే అజిత్ దోవల్ రాజీనామా చేస్తారు కాబట్టి ప్రధానమంత్రి, NSA ల స్థానాల్లో కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి దూకుడు తగ్గిపోతుంది తాత్కాలికంగా!
2014 నుండి పదవిలో ఉంటున్నారు కాబట్టి చాలా విషయాలలో టూకీగా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు మోడీకి… వెంటనే తన నిర్ణయం చెప్పేస్తారు… ఎందుకంటే అప్పటికే చాలా సార్లు చర్చలు జరిగిఉంటాయి కాబట్టి.
కొత్త ప్రధాని, NSA వస్తే అర్ధం చేసుకోవడానికి కనీసం రెండేళ్లు పడుతుంది మళ్ళీ పాతవాటిని అదే ఊపులో కొనసాగించడానికి! కనీసం ఒక సంవత్సరం చాలు ప్రత్యర్థులకి దేశంలో పరిస్థితులని తలక్రిందులు చేయడానికి!
కాక్రోచ్ జనతా పార్టీ వెనుక పెద్ద కుట్రే దాగి ఉంది!
BJP Vs CJP…
కాక్రోచ్ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ మీద సెటైర్ వేసినట్లుగా ఉందని అందరూ అనుకుంటున్నారు కానీ అసలు విషయం వేరే ఉంది!
కాక్రోచ్ అనే పేరు సెటైరికల్ కాదు!
అణు బాంబు పేలిన తరువాత రేడియేషన్ విడుదల అవుతుందని మనందరికీ తెలుసు! రేడియేషన్ ని తట్టుకొని బ్రతకగల కీటకాలలో బొద్దింక ప్రధమ స్థానంలో ఉంటుంది! రేడియేషన్ ని తట్టుకొని మరీ బ్రతుకుతుంది బొద్దింక!
అంటే మీరు (బీజేపీ ) ఎంత అణిచివేతకి పాల్పడ్డా బ్రతికే ఉంటుంది కాక్రోచ్ జనతా పార్టీ అని సందేశం ఇవ్వడానికే ఆ పేరు పెట్టారు! Gen Z ని ఏదో విధంగా రెచ్చగొట్టే ఉద్దేశ్యంతోనే కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేశాడు జార్జ్ సోరోస్!
ఆపరేషన్ గ్రేటర్ బాంగ్లాదేశ్!
గ్రేటర్ బాంగ్లాదేశ్ కోసం జార్జ్ సోరోస్, CIA, చైనా సంయుక్తంగా పనిచేసాయి!
బలూచిస్తాన్, PoJK, ఖైబర్ ఫక్తున్వాలని ఆపడానికి గ్రేటర్ బాంగ్లాదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటు వాదం రెచ్చగొట్టడం ద్వారా భారత్ ని అదుపులో వుంచుతూ, మోడీ మీద ఒత్తిడి పెంచి రాజీనామా చేయించాలని ప్లాన్!
కాక్రోచ్ జనతా పార్టీ ని 2025 డిసెంబర్ లోనే ప్రకటించి, ముందు వెస్ట్ బెంగాల్ లో అలజడి సృష్టించి, క్రమంగా ఈశాన్య రాష్ట్రలకి విస్తరించాలని ప్లాన్!
మమత గెలవగానే విజయోత్సవం పేరుతో దాడులు చేసి రెచ్చగొట్టి, ఆపై అల్లర్లని దేశమంతా విస్తరించాలి!
మూలాలు వెస్ట్ బెంగాల్ లో, బాంగ్లాదేశ్ లలో ఉన్నాయి……
అజిత్ దోవల్ వ్యూహం!
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు!!
RNరవి కొత్త గవర్నర్‌గా వెస్ట్ బెంగాల్ కి నియామకం !
RN రవి 1976 బ్యాచ్ IPS ఆఫీసర్ (కేరళ కేడర్ ). అజిత్ దోవల్ కూడా కేరళ కేడర్ IPS ఆఫీసర్!
RN రవి ముందు ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టి కౌంటర్ ఇన్సర్జెన్సీలో ప్రావీణ్యం సంపాదించారు!
అటు తరువాత CBI లో పనిచేసారు.
తరువాత ఇంటెలిజెన్స్ బ్యూరో ( IB ) స్పెషల్ డైరెక్టర్ గా, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ( NSA ) కి డిప్యుటీగా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు.
గవర్నర్ గా బాధ్యతలు :
2019 నుండి 2021 వరకూ నాగాలాండ్ గవర్నర్, 2021 నుండి 2026 వరకూ తమిళనాడు గవర్నర్, మార్చి 12,2026 న వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.
వెస్ట్ బెంగాల్ శాసన సభకు ఎన్నికలు జరుగుతున్న వేళ RN రవిని గవర్నర్ గా నియమించడం వెనుక వ్యూహం ఉంది.
RN రవి కౌంటర్ ఇన్సర్జెన్సీలో స్పెషలిస్ట్!
అంటే విదేశాల నుండి మన దేశంలోకి చొరబడడానికి ప్రయత్నించే వాళ్ళని అడ్డుకోవడం, అరెస్ట్ చేయడంలో స్పెషలిస్ట్.
ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కి బాంగ్లాదేశ్ తో సరిహద్దు ఉన్న ప్రాంతాలని పరిశీలిద్దాం :
మొత్తం 10 జిల్లాలు వెస్ట్ బెంగాల్ తో బాంగ్లాదేశ్ కి సరిహద్దులు కలిగి ఉన్నాయి. అవి ఉత్తర 24 పరగణా , దక్షిణ 24 పరగణా , ఉత్తర దినాజ్ పూర్ , దక్షిణ దినాజ్ పూర్ , నదియా , మాల్డా , మూర్షీదా బాద్ , డార్జీలింగ్ , కూచ్ బెహర్ , జల్పాయ్ గురి .
సరిహద్దు చెక్ పోస్టులు
1.కూచ్ బేహార్ జిల్లాతో బాంగ్లాదేశ్ కి 549 km సరిహద్దు ఉంది.
2.ఉత్తర 24 పరగణా జిల్లాలో మేజర్ క్రాస్ పాయింట్ ఉంది బాంగ్లాదేశ్ తో. అటు ఇటు రాకపోకలు జరుగుతుంటాయి ముఖ్యంగా పెట్రపోల్ క్రాస్ పాయింట్ దగ్గర. ఇక్కడ అవినీతి ఎక్కువ. డబ్బులు తీసుకొని వదిలేస్తుంటారు.
సమస్య ఎక్కువగా ఎక్కడ ఉంది?
ముర్షీదా బాద్ జిల్లా సరిహద్దుల దగ్గర… ఈ సరిహద్దుల నుండి ప్రజలు బాంగ్లాదేశ్ లోకి వెళ్లడం, రావడం ఎక్కువగా జరుగుతున్నది.
ఈ విషయాన్ని RN రవి తాను కౌంటర్ ఇన్సర్జన్సీ మీద పని చేస్తున్నప్పుడే కేంద్ర హోమ్ శాఖకి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ముర్షీదాబాద్ జిల్లాలో జరిగే అక్రమ చొరబాట్ల గురుంచి రాసారు. జిల్లా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పూర్తిగా అవినీతిలో మునిగిపోయి ఉందని. BSF చెక్ పోస్టులు పెట్టినా ఉపయోగం ఉండదని ఆ జిల్లా మొత్తం సరిహద్దుని మూసివేసి కంచె నిర్మిస్తే కానీ సమస్య పరిష్కారం కాదని చెప్పారు!
ఏప్రిల్ 23, 29 లలో రెండు విడతలగా వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలు జరిగాయి కానీ ఒక నెల ముందు గవర్నర్ గా RN రవి నియామకం జరిగింది!
అంతకు ముందే కౌంటర్ ఇన్సర్జెన్సీ లో పని చేసినపుడు కేంద్ర హోమ్ శాఖకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న అంశాలతో పాటు కొత్తగా మరిన్ని కీలకమైన విషయాలని తెలియచేస్తూ కొత్త నివేదిక ఇచ్చారు రవి .
RN రవి ఇచ్చిన నివేదికలో మమత భవిష్యత్ వ్యూహం ఏమిటో వివరంగా తెలియచేసారు.
మమత భారత దేశ ప్రధాని అవాలని కోరుకోవట్లేదు!
మమత గ్రేటర్ బాంగ్లాదేశ్ కి ప్రధాని అవ్వాలనే వ్యూహంతో పనిచేస్తూ వచ్చింది!
To be Contd…
Share this Article