Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ విఫల పైరవీ కథ … ‘నీట్‌గా పరీక్షలు అసాధ్యం… లీకులు నిజం…

May 22, 2026 by M S R

.

Murali Buddha …. ఓ విఫల పైరవీ కథ … నీట్ గా పరీక్ష అసాధ్యం…
వృద్ధులైన తల్లి తండ్రులు, వారిని చూసుకోవాల్సి ఉంది… మా అన్నను ఎలాగైనా హైదరాబాద్ బదిలీ అయ్యేట్టు చూడు అనడిగాడు ఆయన… పాతికేళ్ల పరిచయంలో తొలిసారి అడిగిన పని అది … 2004-05 ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది . ఇలాంటివి నావల్ల కాదు, పైగా నాకు టీడీపీ వాళ్ళు పరిచయం కానీ కాంగ్రెస్ వాళ్ళు అంతగా తెలియదన్నాను…

ఎలాగైనా కాస్త ప్రయత్నించి చూడు అన్నాడు…. టెన్త్ బోర్డులో అతను అధికారి … ఆ పోస్ట్ హైదరాబాద్‌లోనే ఉంది… అక్కడికి బదిలీ కావాలి తనకు….
మీ అన్న వయసు ఎంత అంటే 57 అని చెప్పాడు, ఇంకో ఏడాదిలో రిటైర్ అవుతారు…. పైకి చెప్పలేదు కానీ 57 ఏళ్ళ వయసు వ్యక్తికి హఠాత్తుగా తల్లి తండ్రులు గుర్తుకు వచ్చి హైదరాబాద్‌కు బదిలీ ప్రయత్నం అంటే నమ్మబుద్ది కాలేదు …

Ads

నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శ్రీమతి నేదురుమల్లి రాజ్యలక్ష్మి అప్పుడు విద్యాశాఖ మంత్రి … రజా హుసేన్ అప్పుడు మంత్రికి osd … నాకు పరిచయం లేదు … జూలూరి గౌరీ శంకర్ అప్పుడు ఎడ్యుకేషన్ బీట్ చూసే రిపోర్టర్ . నాకు బాగా పరిచయం . కవి కావడంతో అతనికి జూలూరితో మంచి పరిచయం . జూలూరును వెంట తీసుకువెళ్లి రజా హుసేన్‌ను కలిసి విషయం చెబితే, తను పెద్దగా ఆసక్తి చూపినట్టు కనిపించలేదు … కానీ చూద్దాం అన్నారు . పని కాలేదు . 57 ఏళ్ళ వయసులో తల్లి తండ్రుల కోసం బదిలీ అంటే మంత్రి నమ్మలేదు . అంతా ఇలానే చెబుతారు అని పక్కన పెట్టారు అని విషయం చెప్పారు …

కొద్ది రోజుల తరువాత తెలిసింది . తల్లి తండ్రుల వద్ద ఉండాలి అని బదిలీ కోరింది అబద్దం . మరి ఎందుకు అంటే ?
గుంటూరులో కార్పొరేట్ విద్యా సంస్థలు చాలా బలమైనవి . బోర్డును వాస్తవానికి నడిపేది వీళ్ళే … ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పేపర్ లీక్ ఆపలేరు . బోర్డు నుంచి లీక్ కావచ్చు . ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్‌లలో భద్రపరుస్తారు . అక్కడా లీక్ కావచ్చు . స్థలం, వ్యక్తులు మారవచ్చు కానీ లీక్ ఖాయం .

తనకు సంబంధం లేకపోయినా అప్పటికే రెండుసార్లు సస్పెండ్ అయ్యాడు . ఒకసారి పరీక్షల ముందే తీవ్ర అనారోగ్యం అని ఆస్పత్రిలో చేరాడు . ఇంకో ఏడాదిలో రిటైర్ అయ్యే ముందు ఈ బాధ ఎందుకు అని బదిలీ కోసం తీవ్రంగా ప్రయత్నం . దీనికోసమే కానీ తల్లి తండ్రుల వద్ద ఉండాలని కాదు అని …. లీక్ ఆపలేరా అని అడిగితే – కార్పొరేట్ విద్యాసంస్థల పలుకుబడి మాములుగా ఉండదు అని సమాధానం వచ్చింది … కొన్నిసార్లు వార్తలు వస్తాయి, కొన్నిసార్లు రావు కానీ లీక్ కామన్ అని సమాధానం …

Neet పేపర్ మళ్ళీ లీక్ అయింది . గతంలో లీక్‌పై చర్యలు లేవు . ఇప్పటి దానిపైనా ఉండదు . భవిష్యత్తు లీక్‌పై చర్యలు ఉండవు . మనం విలువల గురించి ఎక్కువగా మాట్లాడుతాం . ఆచరించే ఉద్దేశం ఉండదు .
అంటే చర్యలు ఉండవా ?

ఎందుకు ఉండవు . ఉంటాయి . పేపర్ లీక్ అయిందనే విషయం ఎక్కడి నుంచి, ఎలా బయట పడిందో చూసి … మరోసారి అలా బయట పడకుండా చూస్తారు … లీక్ అయిన విషయం బయటకు రావచ్చు రాకపోవచ్చు కానీ లీక్ అనివార్యం …

నేను టెన్త్ పరీక్షలు సికింద్రాబాద్ కళాసిగూడ గవర్నమెంట్ స్కూల్ సెంటర్ లో రాశా . పరీక్షలకు గంట ముందు వెళతాం . హఠాత్తుగా ఒకడు ప్రత్యక్షం అయి ముఖ్యమైన ప్రశ్నలు రాసుకోండి అని ఐదారు ప్రశ్నలు చెప్పి వెళ్లి పోయేవాడు . పరీక్షలో అవన్నీ వచ్చేవి . ఒక రోజు కాదు మూడు నాలుగు రోజులు ఇలానే …
ఏ ప్రశ్నలు వస్తాయో వీడికి ఎలా తెలుసు అని బోలెడు ఆశ్చర్యం …

కాలం గడిచాక అర్థం అయింది . వాడు ఆ స్కూల్ స్టూడెంట్ . వాడికి ఇంకో చోట సెంటర్ పడింది . కానీ చదివిన స్కూల్ లో పలుకుబడి ఉంది . గంట ముందు ఎవరో టీచర్ పరీక్షా పేపర్ చూసి వీడికి ప్రశ్నలు చెబితే రాసుకొని మానవత్వంతో , బయట ఉన్నవారికి చెప్పి వెళ్లి పోయేవాడు . లీకేజీని ఆపలేరు . మీడియాలో రాకుండా ఆపగలరు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక దశలో ఒకేచోట 50 వేల మంది లైంగిక కార్మికులు!!
  • Nabha Natesh – విరిగిపడి, తేరుకుని, తిరిగి తెరపై ‘మెరుపు కలల’ వైపు!!
  • BRS దాచిపెట్టే వైఫల్యాల్లో మరొకటి – మేడిగడ్డలాగే ‘కన్నెపల్లి’ కూడా!!
  • STOCK MARKET HUMOUR – Sorry, I haven’t verified the Data
  • ట్రంప్ – రెడ్ కార్డ్..! ఫిఫా పోటీల్లోనూ తనే ‘సుప్రీం రెఫరీ!!
  • TGRPDCL @ రైతు డిస్కమ్ – రేవంత్ రెడ్డి సర్కారు భలే ప్లాన్ !!
  • రొనాల్డో శకం ముగిసింది – ఫుట్‌బాల్ సామ్రాట్ కన్నీటి వీడ్కోలు!!
  • Telangana’s Spiritual Renaissance – Revanth Vision for Grandeur
  • బాగా నచ్చిన వార్త ! ఒక కప్పు కింద ఆరుగురు అత్తలు- 20 మంది కోడళ్లు!!
  • తెలంగాణకు నూతన ఆధ్యాత్మిక శోభ – రేవంత్ రెడ్డి భక్తి పర్యాటకం!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions