Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

NEET – ప్లస్ టూ మార్కులకు వెయిటేజీ- లేదా 70% వస్తే నీట్ అర్హత?

July 2, 2026 by M S R

.

Veerendranath Yandamoori పోస్టు… ‘‘ఈరోజు “టైమ్స్ ఆఫ్ ఇండియా” లో వచ్చిన కథనం ప్రకారం, ఇంటర్మీడియట్ మార్కులకు కూడా NEET వంటి జాతీయ ప్రవేశ పరీక్షల్లో ప్రాధాన్యం ఇవ్వటంపై రూపొందిన నివేదిక… నిన్న సాయంత్రం… ప్రధానమంత్రి కార్యాలయానికి చేరిందట. ఇదొక మంచి పరిణామం.

వారం రోజుల క్రితం ఇదే అంశంపై నేను ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టాను.

Ads

“ప్రస్తుతం IAS పరీక్షలో Prelims ఉత్తీర్ణులైనవారికే Mains రాసే అర్హత ఉంటుంది. అదే విధంగా, NEET పరీక్షకు కూడా ఇంటర్మీడియట్‌లో కనీసం 70% మార్కులు సాధించినవారికే అవకాశం ఇస్తే, లక్షలాది మంది అభ్యర్థుల రద్దీ తగ్గుతుంది. నిజంగా సంసిద్ధమైన విద్యార్థుల మధ్యే పోటీ జరుగుతుంది. పరీక్ష నిర్వహణ కూడా మరింత సమర్థవంతంగా ఉంటుంది. ఇందులో నష్టం ఏమిటి?” అన్న ప్రశ్నకి AI ఈ విధంగా సమాధానం ఇచ్చింది:

“… అవును… దీనిపై కొన్ని సహేతుకమైన అభ్యంతరాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల బోర్డుల మూల్యాంకన విధానాలు వేర్వేరుగా ఉండటం వల్ల అందరికీ సమాన న్యాయం జరిగేలా వ్యవస్థను రూపొందించడం ఒక సవాలే. అయినప్పటికీ, ఈ అంశాన్ని ప్రభుత్వం కనీసం ఆలోచన స్థాయికి తీసుకెళ్లడం, అన్ని కోణాల నుంచి పరిశీలించడం హర్షణీయమైన పరిణామం”…

వారం రోజుల క్రితం ప్రతిపాదన చేసిన అంశం ప్రధాన మంత్రి పరిశీలనలోకి రావడం సంతోషంగా ఉంది. మంచి ఆలోచన ఒక విధానం (పాలసీ)గా రూపుదిద్దుకునే దిశగా అడుగులు పడటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడే ప్రతి ఆలోచననూ ప్రభుత్వం పరిగణనలోకి (మైనస్ పాయింట్లు కూడా ఆలోచిస్తూ) తీసుకోవడం నిజంగా స్వాగతించదగిన పరిణామం.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!
  • ఇప్పటి ప్రపంచాన్ని ఏడు దశాబ్దాల క్రితమే ఊహించారు ఈ రచయితలు!
  • నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!
  • దొరహంకారం !! చావు డప్పుల బాటకు శుద్ధి !! ఇది మరింత అవమానకరం !!
  • శాసనసభకు స్పీకరే సుప్రీమ్ – చాలామందికి తెలియని ఓ ఇంట్రస్టింగ్ కేసు !!
  • నువ్వు చూడకపోవడమా..? ‘ఆమె’ కనిపించకపోవడమా..? ఏది బ్రహ్మచర్యం !!
  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!
  • ముంతాజ్ పేరు మార్చుకుంది ! వైసీపీ ‘స్వరం’ మారింది ! అంతా మాయ !!
  • ఇదేమైనా అట్లాస్ సైకిలా..? 40 రోజులకు ఓ వార్‌షిప్ నిర్మించడానికి !!
  • ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions