.
Mani Kumar Maddipatla …. వైద్యవ్యవస్థలోనే అవస్థలు
ఎంబీబీఎస్‌పై క్రేజ్, ప్రభుత్వ – ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల విషయంలో పెద్ద తేడా ఉన్నంత కాలం ఎంట్రన్స్ టెస్టును దేనికది రాష్ట్రాలు, కొన్ని కాలేజీలు, లేదంటే ఒకటే పరీక్షగా కేంద్రం నిర్వహించినా ఈ లోపాలను అధిగమించడం కష్టం అన్నది నా దృఢ అభిప్రాయం. పేపర్ గతంలో లీకైంది. ఈ ఏడాది లీకైంది. ఇకముందూ లీకవుతుంది.
ఇవాల్టి వేడి రేపు ఉండదు. నాలుగు నెలల తరవాత ఎవరూ పట్టించుకోరు. మరో కొత్త సమస్య, దాని చుట్టూ రాజకీయాలు ఉంటాయి.
రాజకీయులకు ఎన్నికల్లో గెలుపు – అధికార యావ తప్ప మరొకటి ఈ మధ్య రోజుల్లో ఉండటం లేదు.
Ads
మెజారిటీ అధికారులు వృత్తిధర్మాన్ని ఎన్నడో మర్చిపోయారు. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అంతే..
ప్రజలు – సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నారు. బతకడమే కష్టంగా ఉంది. ఇక అన్నింటినీ పట్టించుకునే తీరిక ఏది.
- పుణెలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (ఏఎఫ్ ఎంసీ) లో మెడిసిన్ కోర్సు యావత్తు ఉచితం. ఒక్క పైసా ఖర్చు ఉండదు. మొదటి ఏడా లోపు సెలవుల్లో ఇంటికి ఒకర్ని ఇచ్చి పంపుతారు. తదుపరి సంవత్సరాల్లో టికెట్ చేతిలో పెట్టి పంపుతారు. కోర్సు పూర్తి కాగానే జాబ్ ఇస్తారు. షార్ట్ సర్వీస్ కమిషన్ అయితే ఏడేళ్ళు, పర్మినెంట్ కమిషన్ అయితే సర్వీస్ పూర్తికాలం పనిచేయాలి. ఈ లోపు మానుకుంటే అక్షరాలా రూ.71 లక్షలు కట్టాలి. కోర్సులో చేరిన ఏడు రోజుల తరవాత విరమించుకున్నా ఆ మొత్తం కట్టాల్సిందే.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరిన విద్యార్థికి తెలుగు రాష్ట్రాల్లో ఫీజు ఏటా పదివేలకు మించదు. తదుపరి ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న నిబంధన పెడితే, మారుమూల గ్రామంలో పనిచేయాలంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎందుకంటే సైన్యంలో డాక్టర్లు మంచు పర్వతాల మీద కూడా పనిచేస్తారు.
ఉదాహరణకు సీటు తెచ్చుకుంటే చాలు, ఫీజు కట్టకుండా చదువుకోండి. కనీసం అయిదేళ్ళు పనిచేసిన తరవాత సర్టిఫికెట్ తీసుకోండి అంటే ఊరుకుంటారా?
ఇప్పుడున్న నీట్ కాకుండా దేనికదిగా ఎయిమ్స్, జిప్మర్, రెండు సీఎంసీలు, ఎంజీఐఎంఎస్ తదితరాలకు వేర్వేరుగా పరీక్షలు పెడితే మంచిదేనంటారా? అన్ని పరీక్షలు రాసేందుకు మీరు సిద్ధమేనా? వాటన్నింటికీ ఫీజులు కట్టేందుకు పేరెంట్స్ రెడీనా?
అప్పడు మాత్రం రాష్ట్రాల్లో పేపర్లు బైట అమ్ముకోలేదా? వ్యాపమ్ సంగతి మర్చిపోయారా?
ఒకే పరీక్ష కావడంతో ఈ తలనెప్పి కేంద్రంపై పడింది అంతే కదా?
పొలోమని కాలేజీలు పెట్టడమే తప్ప అందులో ఫ్యాకల్టీ ఉందా అని ఎవరైనా చూస్తున్నారా? ప్రాక్టికల్స్‌కు శవాలు దొరకని పరిస్థితి ఉందని ఎంతమందికి తెలుసు?
అసలు మెడిసిన్ తరవాత గ్రామాల్లో జాబ్ చేసేందుకు ఎంతమంది సంసిద్ధంగా ఉంటున్నారు.
అలా ఉంటే గ్రామీణ వైద్యశాలల్లో డాక్టర్ల కొరత ఎందుకు ఉంటోంది.
అసలు సీట్ల భర్తీ నుంచి ఆరంభమైన ఈ సమస్యను ఎవరు తీర్చాలి.
జూనియర్ డాక్టర్లకు అసలు ప్రభుత్వాలు స్టయిపెండ్ సరిగ్గా చెల్లిస్తున్నాయా.
ప్రైవేటు కాలేజీలు అసలు ఆ ఊసెత్తుతున్నాయా.
హౌస్ సర్జన్ సమయంలోనే 24 నుంచి 36 గంటల సేపు ఏకకాలం డ్యూటీలు ఎందుకు వేస్తున్నట్టు?
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత మాటేమిటి
నోట్: నీట్ ప్రహసనాన్ని తదుపరి తతంగాన్ని నేనే ఏమాత్రం సమర్థించటం లేదు.
ఎందుకంటే, నేనూ ఇద్దరు పిల్లలకు తండ్రినే. పరీక్షలపై అవగాహన లేని వ్యక్తిని కాను.
సమస్యను ఆమూలాగ్రం తెలుసుకుంటే, అవగాహన చేసుకుంటే పరిష్కారం దొరుకుతుందని బలంగా భావించే వ్యక్తిని.
తాత్కాలిక చర్యలతో ఈ సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదని కూడా నమ్మతున్నాను….
Share this Article