Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సూపర్ హిట్ పాటలతో… ఈ కథానాయకుడు బ్లాక్ బస్టర్ అప్పట్లో…

March 3, 2025 by M S R

.
Subramanyam Dogiparthi ……… ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా నీతీ లేదు నిజాయితీ లేదు అనే రంగుల్లో పాటకు మా నరసరావుపేట వెంకటేశ్వర పిక్చర్ పేలస్ జనం ఈలలతో , డాన్సులతో దద్దరిల్లటం ఈరోజుకీ నాకు గుర్తే .

ఈ పాట కోసమే నాలుగయిదుసార్లు చూసా ఈ సినిమాను . జనాన్ని ఒక ఊపు ఊపిన మరో పాట వినవయ్యా రామయ్య ఏమయ్యా భీమయ్యా మన మంచే గెలిచిందయ్యా పాట . ఈ తప్పెట్ల పాటలో జయలలిత బ్రహ్మాండంగా నృత్యించింది .

సంగీత దర్శకుడు టి వి రాజుని ప్రత్యేకంగా అభినందించాలి . పాటలన్నీ వీర హిట్ . ముత్యాల జల్లు కురిసె రతనాల మెరుపు మెరిసే వాన జల్లు పాటలో జయలలిత నిజంగానే జనం మీద తన రతనాల అందాన్ని కురిపించింది .

Ads

మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడోయి , వయసు మళ్ళిన బుల్లోడా కొంటె చూపుల కుర్రోడా , పళ్ళ పాట బాగుంటాయి . ఇల్లరికం అల్లుళ్ళు పద్మనాభం , రాజబాబుల పాట రావేలా దయ లేదా బాలా ఇంటికి రారాదా పాట పేరడీతో ఇప్పటికీ జనం పాడుకుంటూ ఉంటారు .

ఈ సినిమా కధను తయారుచేసిన ముళ్ళపూడి వెంకట రమణను , మాటలు పేల్చిన భమిడిపాటి రాధాకృష్ణను అభినందించాలి . అంతకుముందు పెద్ద మనుషులు , దేశద్రోహులు వంటి ఇలాంటి సినిమాలు ఉన్నా , ఈ సినిమాలో కధ పరుగులెత్తుతుంది . తర్వాత కాలంలో వచ్చిన ఈ మార్కు ఎన్నో సినిమాలకు ఈ సినిమా శ్రీకారం చుట్టింది .

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై చనిపోవడం , MGR డైరెక్ట్ రాజకీయాల్లోకి రావాలనుకోవడం , నాగిరెడ్డి చక్రపాణిలను ఏదయినా సినిమా సజెస్ట్ చేయమంటే , ఈ కధానాయకుడు సినిమానే రీమేక్ చేద్దామని సజెస్ట్ చేయడం , MGR – జయలలితలు నటించి తమిళంలో కూడా ఓ ఊపు ఊపడం జరిగిపోయాయి .

ఆ తర్వాత హిందీలో రాజేష్ ఖన్నా – ముంతాజ్ లతో అప్నా దేశ్ అనే టైటిల్ తో రీమేక్ చేసారు . అక్కడా బాగా హిట్టయింది . NTR- జయలలితలు 12 సినిమాల్లో జోడీ కట్టారు . అన్ని సినిమాలలో వీరి జోడీ జనానికి కన్నుల పండుగ చేసినా , ఈ సినిమా బ్లాక్ బ్లస్టరుగా నిలిచింది .

నాగభూషణం సాఫ్ట్ & క్రూయెల్ విలనీ బాగా పేలింది . అయితే ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఇలాంటి విలనీలో లక్ష ఆకులు ఎక్కువ చదివారనుకోండి . అల్లు రామలింగయ్య , ధూళిపాళ , మిక్కిలినేని , టి జి కమలాదేవి , రావి కొండలరావు , రాధా కుమారి , కాకరాల , రమాప్రభ , నాగయ్య , ముక్కామల ,బేబీ పద్మిని , బేబీ రాణి ప్రభృతులు నటించారు .

ఈ సినిమాలో గమ్మత్తు ఏంటంటే CBI వాళ్ళు విలన్లను అరెస్ట్ చేస్తారు . పెద్ద పెద్ద ఘరానా విలన్లను తాకటానికి కూడా వణికిపోయే ఇప్పటి నిజ CBI ని చూస్తే , కించిత్ హాశ్చర్యము కలుగక మానదు .

మరో విశేషం … ఇంత గొప్ప బ్లాక్ బస్టర్లో NTR- జయలలితలకు డ్యూయెట్ లేకపోవడం . దడదడసాగే సినిమా ఆ సంగతిని కూడా జనానికి తెలియనీయదు . యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడండి . నేడే చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నెల రోజుల ముఖ్యమంత్రి … చరిత్ర క్షమించలేదు…
  • నేరగాడి ప్రేమ కథ… ఈ రోతగాడి జీవితంలో మరో ఇంట్రస్టింగ్ పార్శ్యం…
  • బెంగాల్ ఎన్నికలు..! నట్లు బోల్టులు టైట్ చేస్తున్న ఎన్నికల సంఘం…!
  • చిట్టిబాబు లీక్స్..! తనకూ ఓ పేజీ ఉంది టాలీవుడ్ చరిత్ర పుస్తకంలో..!!
  • కాళేశ్వరం తీర్పు… క్లీన్ చిట్ కాదు… కమిషన్ రూల్స్ పాటించలేదు అని…
  • Inter Caste Marriages… ‘కులాన్ని’ దాటేస్తున్న కొత్త తరం…
  • పొద్దున్నే పుట్టింది చందమామ… మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ…
  • వీడు ఓ ఎంపీ… మహిళా నేతలపై రోత వ్యాఖ్యలు… కిక్కుమనని విపక్షం…
  • ‘యాంటీ హిందూ’ లెన్స్‌కార్ట్‌… స్టాక్‌మార్కెట్ బాగానే శిక్షిస్తోంది…
  • సిక్సర్ల అభిషేకుడిని పడేసిన లైలా..! పాత ట్రాజెడీ మరిచి కొత్త బంధం…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions