.
రేవంత్ రెడ్డి మరో తెలివైన నిర్ణయం… కేసీయార్ హయాంలో అడ్డదిడ్డంగా, అరాచకంగా జరిగిన విద్యుత్తు కొనుగోళ్లు… భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై విచారణను సీబీఐ కోర్టులోకి వేశాడు… అనగా బీజేపీ కోర్టులోకి వేశాడు… రాజకీయంగానే కాదు, పాలనపరంగానూ ఎందుకు తెలివైన పనో ఓసారి చెప్పుకోవాలి… జాగ్రత్తగా ఆచితూచి తీసుకున్న నిర్ణయం…
కాళేశ్వరం అక్రమాలు, అవినీతిపై వేసిన ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలుపుదల చేసింది… దాని ఆధారంగా చర్యలు వద్దని ఆదేశించింది.,. కారణం, కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమే, కానీ విచారణ తీరులో రూల్స్ పాటించలేదు అని చెప్పింది… మరోవైపు సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన విజ్ఞప్తిని కేంద్రంలోని బీజేపీ పట్టించుకోలేదు…
Ads
బీజేపీకి కేసీయార్ కావాలి… అందుకే సైలెంటు… కిషన్ రెడ్డి, బండి సంజయ్ జస్ట్, ఇలా సీబీఐకి అప్పగించండి, అలా అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టేస్తాం అని వ్యూహాత్మకంగా సవాళ్లు విసిరి… తమ చేతికి వేస్తే ఇక తామే ప్రొటెక్ట్ చేయవచ్చునని వ్యూహం… తీరా ఏం జరిగింది…? నెలలు గడుస్తున్నా ఉలుకూ లేదు, పలుకూ లేదు… అంతా కేసీయార్‌తో రహస్య దోస్తీ ఇంపాక్ట్…
ఇన్నాళ్లూ విద్యుత్తు అక్రమాలపై ఏర్పాటైన కమిషన్ ఏం రిపోర్టు ఇచ్చిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటపెట్టలేదు… ఇక దీన్ని కూడా కోల్డ్ స్టోరేజీలో పారేసి, కేసీయార్‌ను క్షమించేసినట్టేనా అనే అభిప్రాయాలు వినిపించాయి… ఈ స్థితిలో పునరాలోచించి ఈ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలంటూ దీన్ని కూడా సీబీఐ కోర్టులోకి పంపించాడు రేవంత్ రెడ్డి…
మళ్లీ కిషన్ రెడ్డికి, బండి సంజయ్‌కు మాట పెగలని దురవస్థ… సమాధానం చెప్పలేరు… స్పందించలేరు… ఈ కమిషన్ నేపథ్యం ఏమిటంటే..? విద్యుత్తు కొనుగోళ్లతో పాటు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ప్లాంట్లలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది…
2024 మార్చి 14వ తేదీన కమిషన్స్ ఆఫ్ ఇన్క్వైరీ చట్టం ప్రకారం రిటైర్డ్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది… విచారణ జరగకుండానే తప్పులు జరిగినట్టు జస్టిస్ పత్రికలకు చెప్పాడంటూ కేసీయార్ కోర్టులను ఆశ్రయించాడు… తరువాత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 2024 జులైలో ఆయన విచారణ నుంచి తప్పుకోవటంతో జస్టిస్ మదన్ బి. లోకూర్‌ను కమిషన్‌గా నియమించారు…
2024 అక్టోబర్‌లో కమిషన్ మొత్తం 114 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.,.. కొన్ని తప్పులు చోటుచేసుకున్నాయనీ, కేసీయార్ బాధ్యత వహించాలని కమిషన్ అభిప్రాయపడినట్టు కూడా వార్తలొచ్చాయి… అనంతరం 2025 జనవరి 4వ తేదీన జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నివేదికపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది… నివేదికను పరిశీలించిన అడ్వకేట్ జనరల్ తన సూచనలు, అభిప్రాయాలను తెలియజేశారు… వాటన్నింటినీ చాలా ఆలస్యం తరువాత ఈ రోజు కేబినేట్ చర్చించింది…
ప్రధానంగా అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ కేసులో ఉన్నాయి గనుక నిష్పాక్షిక- విస్తృత దర్యాప్తు జరిపేందుకు సీబీఐ విచారణకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది… ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది…
అన్నట్టు మోడీ సాబ్… ఈనెల 10 న రాష్ట్రానికి వస్తున్నావు కదా… కాళేశ్వరం, కరెంటు అక్రమాలపై సీబీఐ దర్యాప్తుల మీద ఏమైనా స్పందించే చాన్సుందా..?
Share this Article