ఒరే బిగ్బాసోడా… ఆడ కంటెస్టెంట్ల మీద అంత కసి ఏమిట్రా నీకు..? వరుసగా ఏడోసారీ ఆడ ఆటగత్తెనే బయటికి పంపించేశావ్… ఈసారి పూజా మూర్తి మీద ఎలిమినేషన్ వేటు వేశావ్… ఎక్కడో ఏదో భారీగానే తేడా కొడుతున్నదిరోయ్… కావచ్చు, నిజమే కావచ్చు… ప్రేక్షకుల నిర్ణయాన్ని బట్టి, వాళ్ల తీర్పులను బట్టే ఇలా బయటికి పంపించేస్తున్నాం అంటావేమో…
అసలు ఎవరిని పంపించాలో, ఎవరిని రక్షించాలో అంతా స్క్రిప్టు… వాళ్లతో కుదిరిన ఒప్పందాల మేరకు జరుగుతూ ఉంటాయి… కానీ కనీసం ఆటలో థ్రిల్ కోసమైనా ఈ ఆడ, మగ బ్యాలెన్స్ చేయాలి కదరోయ్… మొన్నటి వారం నయని పావనిని పంపించేశారు… ఇప్పుడు పూజామూర్తిని… వీళ్లు ఒకటీరెండు వారాలు మాత్రమే హౌజులో ఉండాలని ఫిక్స్ చేసిన పక్షంలో మరి వాళ్లను మిడిల్ ఎంట్రీలుగా ప్రవేశపెట్టడం దేనికి..?
నయని పావనిదైతే మరీ ఘోరం, మొదటి వారంలోనే పంపించేశారు.,. హౌజులో అడుగుపెట్టిన మర్నాడే నామినేట్ జాబితాలోకి చేర్చేశారు… ఒకేరోజులో ఆమెను ఏం అంచనా వేసినట్టు..? ఇప్పుడు పూజా మూర్తి… నిజానికి ఆమె ఈ హౌజు సభ్యుల నడుమ ఇమడదు… ఇమడలేదు… సో, ఈమెనూ పంపిస్తారని అనుకుంటున్నదే… పంపించేశారు… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే… ఈమాత్రం భాగ్యానికి సర్ప్రైజ్ ఎంట్రీల పేరిట చాన్సులు ఎందుకు ఇచ్చినట్టు..? నిజానికి పూజా మూర్తి ఫస్ట్ లిస్టులో ఉన్నదట… కానీ వాళ్ల నాన్న చనిపోవడంతో లేటుగా వచ్చిందట… మరి రెండు వారాలకే ఎందుకు పంపించేశార్రా..? కనీస సానుభూతి కూడా లేనట్టుంది…
Ads
ఇలా మధ్యలో వచ్చిన ఆడవాళ్లలో అశ్విని మిగిలింది… ఆమెకు నాగార్జున వీకెండ్ షోలో క్లాస్ పీకాడు… ఏమో, వచ్చేవారం పంపించేస్తారేమో… మీ దుంపతెగ… అందరూ తక్కువ వోట్లు వేస్తే, ఉల్టా యవ్వారంగా రతికను తీసుకొస్తారట… లాస్ట్ శాటర్డే నాడు నాగార్జున చెప్పాడు… వారం గడిచిపోయింది… ఈరోజుకూ రతిక రానేలేదు…
పోనీ, అలా పంపించాలని అనుకుంటే తెలుగు ముక్క రాని యావర్ సంభాషణలకు సబ్ టైటిల్స్ వేసుకుంటూ బిగ్‌బాస్ గింజుకుంటున్నాడు… తను ఏం మాట్లాడతాడో తనకే తెలియదు… పైగా ఆట రాని పెత్తనాల పెత్తందారీ శివాాజీ గ్యాంగ్ తను… తనకుతోడు ఆ రైతు బిడ్డ కలర్ వేసుకున్న పల్లవి ప్రశాంత్ మరో గ్యాంగ్ మెంబర్… సరే, వాళ్లూ వోకే అనుకుందాం… బూతుల భోలేను పంపించేయవచ్చు కదా…
కావాలని కొన్ని సైట్లు మరీ పిచ్చి తిట్లు తిడుతూ శోభాశెట్టిని, ప్రియాంకను ఎలిమినేట్ చేయడానికి థాట్ పోలీసింగ్ చేస్తున్నారు… ఆయా కంటెస్టెంట్ల సోషల్ మీడియా బ్యాచులు సైట్లనూ మేనేజ్ చేయాలా ఏం..? లేకపోతే హౌజులో ఉంచరా..? వాళ్ల టెంపర్మెంట్, దూకుడు, చొరవ, యాక్టివ్నెస్ బాగానే ఉన్నాయి… నిజానికి బిగ్‌బాస్ తరహా గేమ్‌కు అలాంటోళ్లే కరెక్టు… ప్రస్తుతం కొత్తగా వచ్చినవాళ్లలో కూల్‌గా కనిపిస్తున్నది అర్జున్… యాక్టివ్…
సో, ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రేక్షకులు, అందుకే గత సీజన్‌ను తిరస్కరించినట్టుగానే ఈ సీజన్‌కు కూడా దూరమైపోయారు చాలామంది… మరి ఎందుకింత ఖర్చు..? ఈ ప్రశ్నకు బిగ్‌బాస్ టీం దగ్గర జవాబు లేదు… ఆ టీంలో కూడా అందరూ టేస్టీ తేజలే ఉన్నట్టున్నారు…
Share this Article