Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాని సినిమా అయితేనేం… పూర్ టీవీ వాచింగ్… బేబీ కూడా అంతే…

October 6, 2023 by M S R

బేబీ… దసరా… ఈ రెండు సినిమాలు గత వారం టీవీల్లో ప్రసారం అయ్యాయి… బేబీలో ప్రధాన పాత్ర పోషించిన వైష్ణవికి ఆ సినిమా హిట్ బాగా కలిసొచ్చింది… ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది… అఫ్ కోర్స్, సినిమాలో బాగా చేసింది… ఇద్దర మగ ప్రధాన పాత్రధారులకన్నా వైష్ణవి పాత్ర బాగా ఎలివేటైంది… సరే, ఆ పాత్రను తిట్టేవాళ్లున్నారు, బాగుందన్నవాళ్లూ ఉన్నారు…

ఈ సినిమాకు మంచి మౌత్ టాక్ లభించింది… పాజిటివ్ రివ్యూలు దక్కాయి… కమర్షియల్‌గా కూడా క్లిక్కయింది… ఐనా సరే, ఈ బేబీ సినిమాకు వచ్చిన టీవీ రేటింగ్స్ ఎంతో తెలుసా..? 4.78 మాత్రమే… (హైదరాబాద్ బార్క్)… సాధారణంగా ఈటీవీలో కొత్త సినిమాలు రావు… దీన్ని ప్రసారం చేసినా దానికి వచ్చిపడిన ఫాయిదా కూడా ఏమీ లేదు… సో, మౌత్ టాక్‌కూ, కమర్షియల్ హిట్‌కూ టీవీ రేటింగ్స్‌కు సంబంధమే లేదన్నమాట… పైగా ఈమధ్య పెద్ద పెద్ద స్టార్ల సినిమాలే టీవీ ప్రసారాల్లో బోల్తాకొట్టాయి… టీవీల్లో జనం సినిమాల్ని పెద్దగా చూడటం లేదు… అంతా ఓటీటీ మహిమ…

baby dasara

Ads

స్టార్ల సినిమాలు అనగానే ఇక్కడే మరో సినిమా గురించి చెప్పాలి… దసరా… అనుకున్నంత హిట్ కాకపోయినా సరే మంచి కలెక్షన్లనే రాబట్టింది… నాని రగ్గడ్ లుక్కు, మాస్ పాత్ర, తెలంగాణ బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ ఎట్సెట్రా సినిమాను కాస్త భిన్నంగా నిలబెట్టాయి… కానీ మితిమీరిన హింస సినిమా వాల్యూ పలుచబడేలా చేసింది…

దసరా సినిమాలో చెప్పుకోదగింది కీర్తి సురేష్ పాత్ర… అందులో ఆమె ఒదిగిపోయింది… మహానటి కదా, వంక పెట్టడానికి ఏముంది..? తన నటనతో ఆ పాత్ర సినిమాలో హైలైట్ అయ్యింది… డీగ్లామర్ లుక్కు, ఎమోషన్స్ పలికించిన తీరు, ప్రత్యేకించి ఓచోట చేసిన పెళ్లి బరాత్ డాన్స్… గుడ్… (అన్నట్టు బేబీ సినిమాలో దాదాపు అదే డాన్స్ అలాగే ఊరేగింపు సీన్‌లో చేస్తుంది వైష్ణవి… కాకపోతే కీర్తి డాన్స్ బాగా వైరల్ అయిపోయి రీల్స్, షార్ట్స్ లో బాగా హడావుడి చేసింది…)

నాని ఉన్నా సరే, కీర్తి సురేష్ ఇరగదీసినా సరే… బీభత్సమైన ప్రమోషన్, ప్రచారం జరిగినా సరే… ఈ సినిమాకు కూడా పెద్ద రేటింగ్స్ ఏమీ రాలేదు… జెమిని టీవీలో వచ్చింది… కేవలం 4.3 రేటింగ్స్ మాత్రమే… అంటే బేబీ సినిమాకన్నా తక్కువ… అఫ్‌కోర్స్, ఈటీవీ కాబట్టి జెమినికన్నా కాస్త రీచ్ ఎక్కువ కదా, అది రిఫ్లెక్టయింది… లేకపోతే రెండూ దాదాపు సేమ్ రేటింగ్సే… ఒకరకంగా చెప్పాలంటే కీర్తి డాన్స్ కన్నా వైష్ణవి డాన్స్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయన్నమాట…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విజయ్ వెనుక మాస్టర్ బుర్ర…! పళనిస్వామిపై పగ తీర్చుకున్నాడు..!!
  • మగవాదం..! ‘‘సుమతీ శతకం’’పై ఓ సైకలాజికల్ అనాలిసిస్…!!
  • ఐ-ప్యాకప్…! సోషల్ మాఫియాపై పార్టీల భ్రమలు ఎగిరిపోయాయ్…!!
  • ఎన్నో ఆత్రేయ పాటల్లో- పదాల్లో ఉర్దూ గజల్ స్థాయి అభివ్యక్తి..!
  • Next Telangana..! ఆశ సహజమే..! ఓసారి తమిళ ఫలితంతో పోలిస్తే..?!
  • శోభన్‌బాబును చంపేస్తే ప్రేక్షకులు ఊరుకుంటారా..? ఛఫో అనేశారు..!
  • తలైవా… Time to Lead…! నాడు జయలలిత గేటు ముందు విజయ్..!!
  • మంత్రి సీతక్క ఝలక్… బీఆర్ఎస్ దుష్ప్రచారంపై కోర్టు అక్షింతలు…
  • జనం సొమ్ము… నగలు, ఫ్యాషన్లు… వందల కోట్ల విలాస ప్రదర్శన…
  • మిన్మిని… ఓ మధుర స్వరం…! విషాదాలు, విషపు ఆంక్షలతో తెరమరుగు…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions