Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రేమ గుడ్డిదే కాదు, కుంటిది కూడా… రమణీ కల్యాణం మీద ఒట్టు…

May 24, 2026 by M S R

.

చిన్న సినిమాలు కొన్ని కథలపరంగా బాగుంటాయి… కానీ కథనపరంగా ట్రీట్‌మెంట్ సరిగ్గా లేక… పేలవంగా మారి, ప్రేక్షకులను విసిగిస్తాయి… అడ్డమైన, చెత్తా, పెడపోకడతల పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న సినిమాల పట్ల కాస్త పాజిటివ్ ధోరణి ఉండాలని అనుకున్నా, ఉండనివ్వని సినిమాలు కొన్ని ఉంటాయి… రమణీ కల్యాణం అనే సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది…

కథేంటంటే..? సంజన (దీప్షిక చంద్రన్) చిన్నప్పుడే కారు ప్రమాదంలో కళ్లు, కన్నవాళ్లని కోల్పోతుంది. అయినా అధైర్యపడకుండా నలుగురు అనాథ పిల్లలను చేరదీసి, పబ్‌లో పాటలు పాడుతూ వారిని పోషిస్తుంటుంది. మరోవైపు రాజ్ (సూర్య వశిష్ట) జాతీయ జట్టుకు ఎంపికైన రోజే ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న క్రికెటర్. జీవితంపై విరక్తితో ఉన్న రాజ్, పబ్‌లో సంజన పాట విని, ఆమె ఆత్మస్థైర్యానికి ముగ్ధుడై స్నేహం చేస్తాడు. అది కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే వీరి బంధం బలపడుతున్న సమయంలో రాజ్‌కు సంబంధించిన ఒక నిజం బయటపడుతుంది. ఆ తర్వాత ఏమైందనేదే మిగతా కథ.

Ads

మంచి ఐడియా.. వీక్ ట్రీట్‌మెంట్! పుస్తకాల్లో చదివినప్పుడు కన్నీళ్లు పెట్టించే కొన్ని కథలు, వెండితెరపైకి వచ్చేసరికి అంతే ఎమోషనల్‌గా పండటం చాలా ముఖ్యం. ‘రమణీ కల్యాణం’ విషయంలో కథ బాగున్నా, దాన్ని తెరపై డీల్ చేసిన విధానంలోనే లోపం కనిపిస్తుంది.

మిస్సయిన ఎమోషన్…: హీరోకి కాళ్లు లేవు, హీరోయిన్‌కి కళ్లు లేవు.. వినడానికి ఇది హృదయాన్ని హత్తుకునే పెథాస్ (బాధాకరమైన) కథే. కానీ ఇలాంటి సినిమాలకు ‘గీతాంజలి’ తరహా క్లాసిక్ ట్రీట్‌మెంట్ అవసరం. పాత్రలపై ప్రేక్షకుడికి దానంతట అదే ‘సింపతీ’ కలగాలి తప్ప, బలవంతంగా రుద్దినట్టు ఉండకూడదు. ఈ సినిమాలో ఎక్కువ సీన్లు పైపైనే సాగిపోతాయి.

ఊహకందే స్క్రీన్‌ప్లే…: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ ఏంటో అర్థమైపోతుంది. క్లైమాక్స్ అంతా పాత తరం త్యాగాల చుట్టూ తిరగడం వల్ల, ప్రేక్షకుడికి కొత్త అనుభూతి ఏమీ కలగదు.

ఎవరెలా చేశారంటే..? సూర్య వశిష్ట – దీప్షిక…: సూర్య చూడటానికి హీరో మెటీరియల్‌లా ఉన్నా, చక్రాల కుర్చీకే పరిమితం చేసేశారు ‘ఊపిరి’లో నాగార్జునలాగా…. దీప్షిక హుషారుగా నటించినా, ఆమె డైలాగ్ డెలివరీ మనసులోంచి వచ్చినట్టుగా ఆర్గానిక్‌గా అనిపించదు… కొంత ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది….

ఇతర నటులు….: ఎమోషన్ పండించాల్సిన పాత్రలో శ్రీనివాసరెడ్డి ఆపసోపాలు పడ్డాడు…. శ్యామల చాలా రోజుల తర్వాత ఒక లెంగ్తీ రోల్‌లో కనిపించింది…

సాంకేతిక విభాగం…: రామ్ జగదీష్ అందించిన సంభాషణలు, స్క్రీన్‌ప్లే ఈ కథకు పెద్ద మైనస్…. సీన్లు భారంగా సాగుతూ, సగం సినిమాకే ప్రేక్షకుడికి నీరసం తెప్పిస్తాయి….

కథగా, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాస్‌గా వినడానికి బాగున్న ‘రమణీ కల్యాణం’… వెండితెరపై మాత్రం స్ఫూర్తినించేలా మెరవలేకపోయింది… నేటి తరం ప్రేక్షకులకు నచ్చేలా కాకుండా, పాత పద్ధతిలోనే ఈ మెలోడ్రామాను సాగదీయడంతో థియేటర్ నుంచి వచ్చే ప్రేక్షకుడికే ‘సింపతీ’ అవసరమయ్యేలా ఉంది…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మళ్లీ కాల్పుల కలకలం…! ఇరాన్‌కు ట్రంప్ భౌతిక లక్ష్యమా..?
  • ఏపీ పెట్టుబడుల కథల్లో… లెక్కలకంటే ‘సంపాదన’ ప్రశ్నలే ఎక్కువ..!
  • ప్రేమ గుడ్డిదే కాదు, కుంటిది కూడా… రమణీ కల్యాణం మీద ఒట్టు…
  • ఐపీఎల్ చివరి దశలోనూ బుడ్డోడే మళ్లీ కీలకం… అదెలాగంటే…
  • కుర్చీ మడతపెట్టిన తాతకు ఎందరు ఫాలోయర్లు ఉన్నారో తెలుసా..?!
  • మిస్టర్ కూల్…! నిశ్శబ్దంగా ముగిసిన ఒక శకం… నిరాసక్తంగా…!!
  • భానుమతికి ఇలాంటి పాత్రలు పడాలి… ‘పెద్దరికం’తో రెచ్చిపోదా మరి…
  • పాపం కేటీయార్..! వారసపోరులో దూసుకుపోతున్న హరీష్ రావు..!!
  • Don … అనేక అరిష్టాలను దాటుకుని… ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్…
  • పత్రికా స్వేచ్ఛలో No-1 అట… మీడియా విలువల్లో మాత్రం జీరో…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions