Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

“కేంద్ర మంత్రి కూతురికి ఒక న్యాయం, నా మొగుడికి మరో న్యాయం?’’

June 9, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. తమిళ దర్శకుడు మణిరత్నం నుండి మరో మణి పూస 1992 లో వచ్చిన‌ ఈ రోజా సినిమా . ఓ మారుమూల గ్రామంలో పెళ్ళిచూపులతో మొదలుపెట్టి కాశ్మీర్ తీవ్రవాదుల దాకా తీసుకుని వెళ్ళే ఓ అద్భుతమైన దేశభక్తి పూరిత సినిమాను ప్రేక్షకులకు అందించారు మణిరత్నం . అంతేనా ! మరో సతీ సావిత్రి , సతీ సుమతి కధను చూపారు .

ఎలాంటి ఇంగ్లీషు చదువు చదువుకోని ఓ పల్లెటూరి పిల్ల అనుకోకుండా వివాహితురాలు కావటం , RAW లో క్రిప్టాలజిస్టుగా పనిచేస్తున్న భర్తతో అర్జెంటుగా శ్రీనగర్ వెళ్ళవలసి రావటం , అక్కడ భర్తను కాశ్మీర్ తీవ్రవాదులు కిడ్నాప్ చేయటం , ప్రభుత్వంతో సతీ సావిత్రి లాగా పోరాడి భర్తను విడుదల చేయించుకునేందుకు కరుడుగట్టిన తీవ్రవాది వాశిం ఖాన్‌ని విడుదల చేసేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించటం . ఎంత గొప్ప కధను వ్రాసారు మణిరత్నం !

Ads

ప్రభుత్వం తీవ్రవాదిని వదిలిపెట్టేలోపే హీరో అరవింద స్వామి తీవ్రవాదుల చెర నుండి బయటపడే సాహసం చేయటం , క్లైమాక్స్ తీవ్రవాది లియాఖత్ లో మానవుడు లేచి అరవింద స్వామి వెళ్ళిపోయేందుకు సహకరించటం మణిరత్నం చాలా బాగా చూపారు . బందీగా ఉన్న వాశిం ఖాన్‌ను అప్పచెప్పకుండా దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసాడు కూడా .

ఇలాంటి సెన్సిటివ్ సినిమాలు తీయటం కత్తి మీద సాము వంటిదే . మణిరత్నం ఈ రోజా సినిమానే కాదు ; ఇంత కన్నా సెన్సిటివ్ సినిమా బొంబాయిని ఎంతో జాగ్రత్తగా తీసి జనం మెప్పు పొందారు . ఈ రోజా సినిమాకు తమిళ వెర్షన్లో డబ్బుల , ప్రశంసల , అవార్డుల వర్షం కురిసింది . It deserves .

తెలుగులో కూడా గొప్ప విజయానికి ప్రధాన కారకులలో ఒకరు రాజశ్రీ . ఆయన వ్రాసిన సంభాషణలు కానీ పాటలు కానీ మనం డబ్బింగ్ సినిమా చూస్తున్నామనే భావనే రాదు . కొన్ని సన్నివేశాలలో డైలాగులను మరచిపోం కూడా . రక్షణ మంత్రితో దీనంగా , ధైర్యంగా తన భర్తయినా మంత్రి గారి కొడుకో కూతురయినా ఒకటే కదా అని మంత్రిని కన్విన్స్ చేసే సీన్ నాకు బాగా నచ్చిన సీన్లలో ఒకటి .

ఇంక సినిమా నడక . పల్లెటూళ్ళలో పెళ్ళిచూపులు , ఊరు ఊరంతా ఇన్వాల్వ్ కావటం మణిరత్నం బాగా చూపారు . ఊరి పెద్ద ముత్తయిదువులలో ఒకరిగా సి కె సరస్వతి నటనను ప్రేక్షకులు మరవలేరు . ఇలాంటి పాత్రే మరొకటి అరవింద స్వామి బాస్ , RAW చీఫ్ యస్ వి వెంకట రమణ . గొప్ప సంగీత దర్శకుడు , నటుడు ఆయన . కాసేపే కనిపించినా ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్ర .

మరో అందమైన పాత్ర . తీవ్రవాది లియాఖత్ చెల్లెలు పద్మిని . చాలా అందంగా పెద్ద పెద్ద కళ్ళతో అలరిస్తుంది . డైలాగులు ఉన్నాయో లేవో అసలు ! మరో గొప్ప పాత్ర జనకరాజుది . కాశ్మీర్లో ఆల్ ఇన్ వన్ పాత్ర . దిక్కూ మొక్కూ లేని అమాయక తెలుగు అమ్మాయికి చేదోడుగా ఉండే పాత్ర . సుత్తి వేలు డబ్బింగ్ చెప్పారు .

ఇలా అన్ని పాత్రల సృష్టి గొప్పగా ఉంటుంది . ఇంక హీరోహీరోయిన్లు . దళపతిలో అరంగేట్రం చేసిన అరవింద స్వామికి ఈ సినిమాలో మణిరత్నం గొప్ప పాత్రను ఇచ్చారు . బాగా సద్వినియోగం చేసుకున్నాడు . ముఖ్యంగా బందీగా ఉన్నా దేశం మీద చూపే భక్తి , గౌరవం బాగా చూపారు . (భారత్ మాతాకీ జై అని తన నోటి డైలాగ్, థియేటర్లలో పాట్రియాటిక్ ఎమోషన్, చప్పట్లు, ఈలలు… వావ్ మణిరత్నం)

ఇంక ఫొటోగ్రఫీ , లోకేషన్స్ . తమిళనాడులో ఎక్కడ తీసారో ఏమో కానీ జలపాతాలు , అక్కడ పాటలు ఫొటోగ్రఫీ డైరెక్టర్ సంతోష్ శివన్ అద్భుతంగా ఆవిష్కరించారు . ఈ లోకేషన్లో తీసిన పాట నాగమణి నాగమణి సందెకాడా ఏంది సద్దు మరచిపోలేం . ముసలి ముత్తయిదువులను సమీకరించి అదరగొట్టేసారు .

మరో మోస్ట్ రొమాంటిక్ సాంగ్ పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే . ఏం వ్రాసారు రాజశ్రీ !! హేట్సాఫ్ . అంతే సోగ్గా చిత్రీకరించాడు మణిరత్నం . సినిమా ప్రారంభంలోనే వచ్చే చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ . మరో శ్రావ్యమైన పాట .

నా చెలి రోజానే నాలో ఉన్నావే నిన్నే తలచేనే నేనే అంటూ సాగే విషాదగీతం కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది . మరో శ్రావ్యమైన పాట వినరా వినరా దేశం మనదేరా . A R రెహమాన్ అరంగేట్రం సినిమా అయినా గొప్ప సంగీతాన్ని అందించారు . తెలుగులో బాలసుబ్రమణ్యం , చిత్ర , మనో , సుజాత , మిన్ మినీ శ్రావ్యంగా పాడారు .

హీరోయిన్ పాత్రలో మధుబాల . ఇంకాస్త అందమైన అమ్మాయిని పెట్టి ఉంటే ఇంకా బాగుండేదేమో ! నటనపరంగా బాగానే చేసింది . ఇతర ప్రధాన పాత్రల్లో నాజర్ , పంకజ్ కపూర్ , వైష్ణవి అరవింద్ , సత్యప్రియ  ప్రభృతులు నటించారు .

An unmissable great patriotic , romantic , musical wonder . ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది మణిరత్నం కాశ్మీర్ ఉగ్రవాదులు పాకిస్థాన్ ఉగ్ర సంస్థల చేతిలో ఎలా మోసగించబడుతున్నారో , కాశ్మీర్ లోని అమాయక ముస్లిం యువకులు మత ప్రేరిత ఉగ్రవాదం లోకి లాగబడుతున్నారో వివరించారు . సినిమా యూట్యూబులో ఉంది . ఎన్ని సార్లయినా చూడతగ్గ చక్కటి సినిమా .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నమ్ముతారా..? 50 కోట్ల సబ్‌స్క్రయిబర్స్..! నెలకు 400 కోట్ల సంపాదన..!!
  • *నేపియర్…! ఇదీ పెంచాల్సిన సాగు… పెరగాల్సిన ఇంధనం..!!
  • నువ్వు ‘మగాడివిరా’ బుజ్జీ..! అందరి మనసులూ గెలుచుకున్నావ్..!!
  • ఇకపై కారుణ్య నియామకాలు అంత ఈజీ కాదు!
  • అసలే అక్క పురుషద్వేషి… చెల్లెలికీ ఆ రోగం అంటిస్తుంది… తర్వాత..?
  • అయోధ్యపై అఖిలేష్ కొత్త రచ్చ… ఆది నుంచీ యాంటీ- హిందూయే కదా…
  • పాపం త్రిష… ఆశ అడియాసేనా? విజయ్– సంగీత బంధంపై కొత్త ట్విస్ట్..!
  • C 295 … మేడ్ ఇన్ ఇండియా… తొలి స్వదేశీ సైనిక రవాణా విమానం…
  • చేసుకున్నవాడికి చేసుకున్నంత… నో బెయిల్, నో రిలీజ్… కటకటాల్లోనే…
  • బూతు, వెగటు, రోత, జుగుప్స… ఈ-తరం స్టాండప్ కామెడీ తీరు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions