Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మధుబాల, సుబ్బులక్ష్మి… సాయిపల్లవి చేజారిన రెండు అదృష్టాలు…

April 27, 2026 by M S R

.

కొందరికి అవకాశాలు ఒకటీరెండుసార్లే తలుపుతడతాయి… సరిగ్గా వాడుకుంటే, లక్ కరుణిస్తే జీవితాంతం అది పనిచేస్తుంది… మహానటి సావిత్రి బయోపిక్ చేయడం కీర్తి సురేష్ అదృష్టం… ప్రతిభ కూడా..! ఇలాంటి బయోపిక్స్ సాయిపల్లవికి పదే పదే తలుపు తడుతున్నా సరే, ఆమె అన్నీ అందుకుంటోందా..? కొన్నింటిని తనే కాలదన్నుకుంటోందా..?

భన్సాలీ ఎన్నాళ్లుగానో కలలు గంటున్న మధుబాల బయోపిక్‌కు సాయిపల్లవి పేరే వినిపించింది చాన్నాళ్లు… ఏమైందో ఏమో గానీ, ఆ ప్రాజెక్టులోకి ఆ పాత్రలోకి ప్రజెంట్ పాపులర్ ఫిమేల్ స్టార్ సారా అర్జున్ వచ్చేస్తోంది… సాయిపల్లవికి ఒకటి మిస్…

Ads

sara

 

ప్రఖ్యాత గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం కూడా సాయిపల్లవి పేరే కొన్నాళ్లుగా వినిపిస్తోంది… కానీ తాజా వార్తలు మాత్రం అదీ సాయిపల్లవి చేజారినట్టేనంటున్నాయి… కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్ ఆ పాత్రను ఎగరేసుకుపోయినట్టు సమాచారం… మరొకటి మిస్…

రుక్మిణి వసంత్

 

నిజానికి ఆమె చేసిన అమరన్ ఓ అమర సైనికుడు మేజర్ ముకుంద్ బయోపిక్… ఐనాసరే, సాయిపల్లవి చేసిన ఆయన భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రే హైలైటయింది… విరాటపర్వం సినిమా కూడా ఓ బయోపిక్… సినిమా నడవకపోయినా సరే, సాయిపల్లవికి మంచి పేరు తీసుకొచ్చింది…

amaran

మధుబాల, సుబ్బులక్ష్మి బయోపిక్స్ కోసం డేట్స్ అడ్జస్ట్ కావడం లేదో, ఇంకా ఏమైనా కారణాలున్నాయో తెలియదు గానీ… వాటిని చేజిక్కించుకుని ఉంటే… రామాయణం సీత పాత్రతోపాటు ఈ రెండు పాత్రలు కూడా ఆమెను ఎక్కడికో తీసుకుపోయేవి… సీత పాత్రకు భారీ కాల్షీట్లు ఇవ్వడంతో వేరే సినిమాలకు డేట్స్ లభ్యత లేనట్టుంది ఆమెకు…

సాయిపల్లవి

అలాగని ఆమె ఒక్క సీత పాత్రకే పరిమితం కావడం లేదు ఇప్పుడు… ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో తీసిన సినిమా ఏక్ దిన్ ఆమెకు బాలీవుడ్ డెబ్యూ… అది రిలీజుకు సిద్దంగా ఉంది… మణిరత్నం విజయ్ సేతుపతితో తీయబోయే ఓ ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమా ఒకటి ఆమె కోసం రెడీగా ప్రిప్రొడక్షన్ వర్క్‌లో ఉంది… అలాగే ధనుష్‌తో ఓ సినిమా ఒప్పుకుంది… గతంలో తనతో మారి-2 చేసింది ఆమె… (ఆమెతో అమరన్ తీసిన రాజకుమార్ పెరియస్వామి దీనికి దర్శకుడు)…

saipallavi

కల్కి సీక్వెల్‌ నుంచి దీపిక పడుకోన్‌ను తొలగించారు కదా, పోనీ, ఆమే వైదొలిగింది కదా… ఆ ప్లేసులో సాయిపల్లవిని తీసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి కొన్నాళ్లు… సినిమా టీమ్ ఏమీ ఖరారు చేయలేదు… ఏతావాతా ఆమె చేతిలో ఉన్న కొత్త ప్రాజెక్టులు రెండు మాత్రమే, ఒకటి ధనుష్, రెండు విజయ్ సేతుపతి… అంతే… (రామాయణం సీత గాకుండా…) సో, రెండు బయోపిక్స్, చేజారిన రెండు అదృష్టాలు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆల్రెడీ చచ్చిపోయిన హీరో ఓ విలన్‌ను సైలెంటుగా లేపేస్తాడు…
  • మధుబాల, సుబ్బులక్ష్మి… సాయిపల్లవి చేజారిన రెండు అదృష్టాలు…
  • అందరమూ సావిత్రులమే… ప్రాణాపాయంలోనూ సీసాలు వదలం… పదిలం…
  • ఐపీఎల్ అంపైరింగుకు పెద్ద మరక… తప్పుడు ఔట్ నిర్ణయంతో అభాసుపాలు…
  • లే, లేచి, ఒకే ఒఖ్కసారి నన్ను హన్నయ్యా అని పిలువమ్మా…
  • ఎస్.., ఈ వర్మ గారి ఆషురెడ్డి ఓ సాఫ్ట్‌వేర్‌ను నిండా ముంచిందట..!!
  • నాటి చీకటి రోజులు… నేడు వెలుగు రేఖలు… A Human Ruler…
  • అవును…TRS పార్టీ పేరు, రిజిస్ట్రేషన్‌పై కవిత క్లారిటీ ఇవ్వాలి…
  • నిజానికి ఈ ‘అరటి చెట్టు’ పిల్లల అల్లరి కథ కాదు… తండ్రుల కథ…
  • మల్లాది వారి ‘మహా బోల్డ్ రసిక సంసారపక్షం’ కథ… తేనెటీగ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions