Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ పాటలోని తాత్వికత, వైరాగ్యం… సినారె, వేటూరి పట్టుకోగలిగారా ?!

August 27, 2026 by M S R

.

మనం నిన్నామొన్నా రెడ్ లైట్ ఏరియాలు, వ్యభిచారుల వెతల గురించి… ఆ నేపథ్యంతో వచ్చిన హిందీ సినిమా ప్యాసా గురించి, అందులోని పాపులర్ ఏ కూచె ఏ నీలమ్ పాట గురించీ చెప్పుకున్నాం కదా… గొప్ప లిటరరీ టచ్ ఉన్న పాట…

ఐతే ఆ సినిమాకు తెలుగు రీమేక్ మల్లెపూవు (1978) సినిమా… హిట్… కాకపోతే ఒరిజినల్‌తో పోలిస్తే తెలుగు సినిమా బాపతు కమర్షియల్ వాసనల్ని దట్టించారు… డ్యూయెట్లు ఎట్సెట్రా… ఏమాటకామాట, ఆత్మను చెడగొట్టలేదు… లక్ష్మి గురించి చెప్పాలి… అంతటి శోభన్‌బాబు, జయసుధ కూడా ఆమె ఎదుట వెలవెలబోయారు…

Ads

ప్యాసా హిట్ కావడానికి కథకన్నా పాటల సాహిత్యమే ప్రధాన కారణం… సేమ్, మల్లెపూవు విజయానికీ అంతే… దాదాపు పది పాటలు… వీటూరి, వేటూరి, ఆరుద్ర, ఆత్రేయ కలాలు పోటీలుపడ్డాయి… సేమ్, ప్యాసాలోని ఏ కూచే ఏ నీలమ్ పాటలో కవి సాహిర్‌ లుధియాన్వీ కలం ధ్వనించిన లోతు, మార్మికత తలపించేలా మల్లెపూవులో *ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగే వారెవ్వరో* అనే పాటను వేటూరితో రాయించారు… వేటూరి లుధియాన్వీ ఆత్మను పట్టుకోలేకపోయాడు…

పైగా సినిమాలో ఇతర ప్రేమగీతాలు హిట్ కావడంతో ఈ విషాద గీతం పెద్దగా ఆదరణకు నోచుకోలేదు, విడిగా వింటే ఈ పాట కూడా చాలా బాగుంటుంది, ప్యాసా పాటతో పోల్చుకోకుండా ఉంటే…

నిజానికి ఇదే శోభన్ బాబు నటించిన మానవుడు- దానవుడు (1972) సినిమాలో కూడా సేమ్, ఇలాంటి అర్థమే ప్రధానంగా ధ్వనించే ఓ పాట ఉంటుంది… దీన్ని సినారెతో రాయించారు… అంటే మల్లెపూవుకన్నా ముందే… సినారె కూడా గొప్ప రచయితే… కానీ ఇక్కడా లుధియాన్వీ ఆత్మను సినారె పట్టుకోలేకపోయాడు… ఇదీ విడిగా వింటే బాగుంటుంది… జనాదరణ కూడా పొందలేదు… యూట్యూబ్‌లో ఈ వీడియోకు మరీ 20 వేల లోపు వీక్షణలు పాపం…

ప్యాసాలో గానీ, మల్లెపూవులో గానీ క్లైమాక్స్ సాంగ్ హైలైట్… అవి ప్యాసాలో “యే దునియా అగర్ మిల్ భీ జాయ్ క్యా హై…”, మల్లెపూవులో “బ్రతికినా చచ్చినట్టే ఈ సంఘంలో…”… రెండూ హిట్… 

రెండు చిత్రాలలోనూ హీరో ఒక ఆశయాలున్న, లోకంపట్ల నిస్సహాయతతో కూడిన అసహనం కలిగిన పేద కవి (ప్యాసాలో విజయ్ – గురుదత్; మల్లెపూవులో వేణు – శోభన్ బాబు). సమాజం కవిని లేదా కళాకారుడిని బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోదు, కానీ చనిపోయాక వాళ్ళ కవితలను /ప్రతిభను వ్యాపార వస్తువుగా వాడుకుంటుంది. ఈ కపట సమాజంపై తిరుగుబాటు చేసే తత్వమే రెండు క్లైమాక్స్‌ల ప్రధానాంశం…

https://www.youtube.com/watch?v=7Z6Lr0JYAro&list=RD7Z6Lr0JYAro&start_radio=1

హీరో అడ్రస్ లేకుండా పోయినప్పుడు లేదా మరణించాడని అందరూ భావించినప్పుడు, అతని కవితలతో పుస్తకం ప్రచురితమై అతను దేశవ్యాప్తంగా విపరీతమైన కీర్తిని సంపాదిస్తాడు. సరిగ్గా అదే సమయంలో అతను సభలోకి తిరిగి వస్తాడు.

రెండు క్లైమాక్స్‌లలోనూ హీరో బతికే ఉన్నాడనే నిజాన్ని నమ్మని, కీర్తి కోసం కక్కుర్తిపడే ప్రచురణకర్తలు/స్వార్థపరులు ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి హీరో జ్ఞాపకార్థం సత్కరిస్తుంటారు. సరిగ్గా ఆ అంబరాన్ని తాకే సమయంలో హీరో మైక్ ముందుకు వచ్చి పాడుతూ, ఆ జనాన్ని నిలదీస్తాడు.

ప్యాసా‘ చిత్రంలో సాహిర్ లుధియాన్వి రాసిన అసమానమైన సాహిత్య విలువలున్న పాటను గురుదత్ అద్భుతంగా వాడుకున్నారు… ప్యాసాలో విజయ్ (గురుదత్) ఒంటరిగా నలిగిపోతాడు. అతన్ని ప్రేమించిన వేశ్య గులాబో (వహీదా రెహమాన్), మోసగించిన మాజీ ప్రేయసి మీనా (మాలా సిన్హా) ఉంటారు. క్లైమాక్స్ అత్యంత విషాదకరంగా, నిరాశావాదంతో ముగుస్తుంది— విజయ్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడమే మంచిదని భావిస్తాడు…

ఇది పూర్తిగా ఒక తెలుగు కమర్షియల్, ఫ్యామిలీ, సెంటిమెంట్ హంగులతో కూడిన రీమేక్. ఇందులో శోభన్ బాబు అభినయం, లక్ష్మి, జయసుధ పాత్రల భావోద్వేగాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ క్లైమాక్స్ మరింత స్పష్టమైన సామాజిక చైతన్యాన్ని, ఎక్కువ నాటకీయతను సంతరించుకుంటుంది…

“ఈ ప్రపంచం నాకు దక్కినా నాకేంటి?” అంటూ యావత్ మానవ సమాజంలోని దగాకోరుతనాన్ని, ధనదాహాన్ని ప్రశ్నించే అస్తిత్వవాద (Existentialist) నిరాశ ప్యాసా క్లైమాక్స్ పాటలో కనిపిస్తుంది. ఇది ఒక ఒంటరి కవి ఆత్మఘోష…

“బ్రతికినా చచ్చినట్టే ఈ సంఘంలో… ఆత్రేయ రాసిన ఈ పాట మరింత ప్రత్యక్షంగా, ప్రజలను నేరుగా తట్టిలేపేలా ఉంటుంది. “బ్రతికివున్నప్పుడు కూడు గుడ్డ ఇవ్వని ఈ సమాధి సంఘం, చచ్చాక స్టేజీలెక్కి పూలదండలు వేస్తే ఒరిగేదేంటి?” అనే కోణంలో సాగుతుంది…

ప్యాసాలో హీరో ఆ జనసమూహం నుంచి, ఆ కపట ప్రపంచం నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోవడంతో సినిమా ముగుస్తుంది. తెలుగు సినిమా ప్రేక్షకులకు నచ్చేలా, కవి పడిన వేదనకు తగిన గుర్తింపు, కుటుంబం,  ప్రియురాలి సాన్నిధ్యంతో కథకు ఒక స్పష్టమైన ముగింపు ఇవ్వబడుతుంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నాయకులే కాదు – మీడియా కంపెనీలూ కండువాలు మార్చుకుంటయ్ !!
  • EPIC – బోల్డ్‌గా ఏదో చెప్పాలనుకుని- బోల్తాకొట్టిన కథాకథనాలు !!
  • వారమైనా కాలేదు – బిగ్‌బాస్ తిక్క ప్లానింగు – ఓ గట్టి కంటెస్టెంట్ ఔట్ !!
  • సినిమా బ్లాక్‌బస్టర్ ! హఠాత్తుగా కరోలీ బాబా ఇంటిపై పంచాయితీ !!
  • సర్దార్-2 … మిషన్ పెద్దదే… కానీ ఇంజన్‌లో దమ్ములేదు – ఇది కార్తి టాక్సిక్ !!
  • ‘‘పిరికి న్యాయమూర్తి అనిపించుకోవడంకంటే చావడానికే ఇష్టపడతాను’’
  • ప్రతి కథా ఇరుముడి కాలేదు – మారెమ్మలా తుస్సుమనొచ్చు కూడా!!
  • బిడ్డ అడిగిన బర్త్‌డే గిఫ్ట్ … బడ్జెట్ లెక్కలేసి బావురుమన్న తండ్రి!
  • లడఖ్ మారుతోంది ! ప్రకృతి వనరుల్నే ఇంధనంగా మార్చుకుంటూ !!
  • టీవీ ఆఫ్ కాలేదు – వింటోంది, చూస్తోంది, రికార్డ్ చేస్తోంది… అన్నీ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions