Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భన్సాలీకి ఆ ‘మధుబాల’ దొరికేసింది..! ఈ ఇరవయ్యేళ్ల పిల్ల మెప్పిస్తుందా..?!

April 24, 2026 by M S R

.

  • రష్మిక మంథాన… రుక్మిణి వసంత్… యామీ గౌతమ్… సాయిపల్లవి… దీపిక పడుకోన్… ప్రియాంక చోప్రా… ఆలియా భట్……. వీళ్లెవరూ కారు… ప్రస్తుతం జాతీయ స్థాయిలో బాగా నలుగుతున్న, వెలుగుతున్న పాపులర్ పేరు… సారా అర్జున్..! మూడు వేల కోట్ల వసూళ్ల దురంధర్‌ ఫ్రాంచైజీతో ఆమె కెరీర్ ప్రభ వెలిగిపోతుంటే… దానికి ఇప్పుడు మరో వెలుగు కిరీటం తోడవుతోంది… దాని పేరు మధుబాల బయోపిక్…

ఎన్నో ఏళ్లుగా ఈ బయోపిక్ వార్తల్లో ఉంది… అనేక అడ్డంకులు, బడ్జెట్ పరిమితులతో అడుగు కదల్లేదు… కథానాయికగా సాయిపల్లవి, కియారా అద్వానీ తదితరుల పేర్లనూ పరిశీలించారు… కానీ ఆమె డేట్స్ ఇప్పట్లో కష్టం… సో,  సంజయ్ లీలా భన్సాలీ తనే నిర్మాతగా రంగప్రవేశం చేయడంతో ఈ బయోపిక్‌కు కీలక మలుపు వచ్చింది… జూలైలో షూటింగ్ స్టార్ట్… ‘డార్లింగ్స్’ చిత్రంతో ప్రసిద్ధి చెందిన జస్మీత్ కెరీన్ ఇప్పుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు…

  • ఇప్పుడు ఆ బయోపిక్ కథానాయికగా సారా అర్జున్ పేరు ఖరారైంది… ఆమెకు దక్కిన అవకాశం మామూలుది కాదు… పైగా మధుబాలగా మెప్పించడం కూడా చిన్న టాస్క్ ఏమీ కాదు… అఫ్‌కోర్స్, భన్సాలీ సినిమా కాబట్టి ఎక్కడా తేడా రానివ్వడు… ఐతే అందరిలోనూ ఓ సందేహం… బలమైందే… ఇరవయ్యేళ్ల ఈ పిల్ల ఆ మధుబాలను ఆవాహన చేసుకోగలదా..? ఆ పాత్రకు ఈమె నప్పుతుందా..?

ఏముంది..? సావిత్రి పాత్రను కీర్తిసురేష్ మెప్పించలేదా..? దర్శక ప్రతిభ మీద ఆధారపడుతుంది… వయస్సు తక్కువ, మరీ రణబీర్‌కన్నా చాలా తక్కువ అనే విమర్శలు వచ్చినా సరే, దురంధర్‌లో యలీనా జమాలి పాత్రలో మెప్పించింది… ఇక మధుబాల వ్యక్తిగత జీవితంలో కీలక పాత్రలు పోషించిన దిలీప్ కుమార్, కిషోర్ కుమార్‌ల రెండు ముఖ్యమైన పురుష పాత్రల కోసం ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది… 

Ads

sara

కానీ మరో ప్రశ్న ఇంకా ఆసక్తికరం… అసలు మధుబాల జీవితంలో ఓ బయోపిక్ తీసేంత డ్రామా ఉందా..? 

సినిమా కథలా వినిపించే ఐదు పెద్ద ఎపిసోడ్లు ఆమె జీవితంలో నిజంగానే ఉన్నాయి… పేదరికం నుంచి స్టార్‌డమ్ వరకు… మధుబాల అసలు పేరు ముంతాజ్ జహాన్… ఢిల్లీలో పుట్టిన ఆమె కుటుంబం చాలా పేదది… అందుకే చిన్న వయసులోనే సినిమాల్లోకి రావాల్సి వచ్చింది…

బాలనటిగా ప్రారంభమైన కెరీర్… (సారా కెరీర్ కూడా బాలనటిగానే ప్రారంభం)… కొన్ని సంవత్సరాల్లోనే ఆమెను బాలీవుడ్‌లో అగ్రతారగా మార్చింది… 1949లో వచ్చిన Mahal సినిమా ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చింది… ఆ ఒక్క సినిమాతో మధుబాల దేశవ్యాప్తంగా స్టార్ అయిపోయింది…

బాలీవుడ్‌లో అత్యంత విషాద ప్రేమకథ … మధుబాల జీవితంలో అత్యంత నాటకీయమైన భాగం ఆమె ప్రేమకథ… ప్రముఖ నటుడు Dilip Kumarతో ఆమె ప్రేమలో పడింది… ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి… కానీ కుటుంబ వివాదాలు, కోర్టు కేసులు… చివరికి ఈ ప్రేమకథను చీల్చేశాయి… బాలీవుడ్ చరిత్రలో ఇప్పటికీ అత్యంత విషాదకరమైన ప్రేమకథల్లో ఒకటిగా దీనిని చెబుతారు…

మహాసినిమా… కానీ వ్యక్తిగత బాధ … 1960లో వచ్చిన Mughal-e-Azam భారతీయ సినీ చరిత్రలో క్లాసిక్‌గా నిలిచింది… ఈ సినిమాలో అనార్కలి పాత్రలో మధుబాల నటన ఇప్పటికీ గుర్తుండిపోతుంది…. కానీ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది… అయినా షూటింగ్ ఆపలేదు…

ప్రేమ కాదు… చివరికి వేరే పెళ్లి … తర్వాత ఆమె గాయకుడు-నటుడు Kishore Kumarను వివాహం చేసుకుంది…. కానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆమె సినిమా కెరీర్ కూడా దాదాపు ముగిసిపోయింది…. మధుబాల చిన్నప్పటి నుంచే గుండె సంబంధిత వ్యాధితో బాధపడేది… చివరికి 1969లో కేవలం 36 ఏళ్ల వయసులోనే ఆమె మరణించింది…. అందం, ఖ్యాతి, ప్రేమ, విషాదం… అన్నీ కలిసిన ఒక జీవితం అక్కడితో ముగిసింది…

మధుబాల జీవితంలో ఉన్నంత డ్రామా… ఆమె నటించిన సినిమాల్లో కూడా ఉండదు అని చాలామంది చెబుతారు…. బాలీవుడ్‌లో ఆమెను అప్పట్లో “అందానికి ప్రతీక”గా చూశారు… కానీ ఆమె నిజ జీవితంలో మాత్రం…

ప్రేమలో విఫలం,

తీవ్రమైన అనారోగ్యం,

చిన్న వయసులోనే మరణం,

అన్నీ ఎదుర్కొంది….

madhubala

అందుకే సినీ చరిత్రకారులు ఒక మాట చెబుతారు. “మధుబాల జీవితం ఒక సినిమా అయితే… అది ఖచ్చితంగా విషాదాంతంతో ముగిసే క్లాసిక్ అయి ఉండేది.” ఇదే కారణంగా ఆమెపై బయోపిక్ తీయాలనే ఆలోచన దశాబ్దాలుగా వస్తూనే ఉంది…

కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… అంతటి డ్రామా ఉన్న జీవితం మీద ఇప్పటివరకు పూర్తి స్థాయి పెద్ద బయోపిక్ మాత్రం తెరకెక్కలేదు…. ఇక ఇదిప్పుడు భారతీయ సినీ చరిత్రలో అత్యంత భావోద్వేగభరితమైన బయోపిక్‌లలో ఒకటిగా నిలిచే అవకాశముంది… అఫ్‌కోర్స్, క్రియేటివ్ ఫ్రీడం తీసుకుని దర్శకుడు కథను రక్తికట్టించగలిగేతేనే సుమా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భన్సాలీకి ఆ ‘మధుబాల’ దొరికేసింది..! ఈ ఇరవయ్యేళ్ల పిల్ల మెప్పిస్తుందా..?!
  • కథ బాగుండాలే గానీ… చిరంజీవి సినిమాను కూడా బీట్ చేయొచ్చు..!!
  • మన ఖరీదైన ఆతిథ్యం… విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్ ఓ టైంపాస్ టూర్…
  • ఏ ముత్యాలూ కడగబడలేదు… కాళేశ్వరం పిక్చర్ ఔర్ బహుత్ బాకీ హై…
  • సిద్ధరామయ్యపై క్షుద్రపూజలు, చేతబడి చేయించింది ఎవరు..?
  • జేడీ చక్రవర్తి చెప్పిన ఓ కథలో ఆ ముసలి గాడిద ఎవరై ఉంటారబ్బా..?!
  • … చివరకు అలాంటి పాకిస్థాన్ కూడా ఈమెకు సలాం కొట్టింది…
  • తోపులు కాదు, తుప్పాసులు… కోట్లకుకోట్లు పెట్టి కొన్నాను కదరా…
  • ఈమె నోరువిప్పితే… ట్రంపు ఫ్యామిలీ బజారున పడటం ఖాయమేనా…
  • ప్చ్, కష్టం బ్రో… భార్య వేసే ‘గూగ్లీ’ని ఏ భర్త కూడా సిక్స్ కొట్టలేడు..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions