Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కమలహాసన్ – నాగ్ అశ్విన్… సింగీతం ఎదుట రెండు ఆశ్చర్యార్థకాలు…

June 9, 2026 by M S R

.

నిన్నా మొన్నా కొన్ని వార్తలు, ఫోటోలు చూస్తుంటే ఆశ్చర్యం… అది సింగీతం శ్రీనివాసరావు తీసిన సింగ్ గీతం సినిమా ఫంక్షన్… ముందుగా ఈ సినిమా గురించి సంక్షిప్తంగా… సినిమాల్లో ప్రయోగాలకు పేరొందిన సింగీతం తన 94 ఏళ్ల వయస్సులో కూడా చేసిన మరో ప్రయోగం ఈ సినిమా… మ్యూజికల్ ఫాంటసీ…

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా పతాకాలపై ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం కాగా, ఈ సినిమాకు సంబంధించి దర్శకుడి తరువాత చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌…

Ads

  • సంగీత ప్రాధాన్యత…: ఈ సినిమాకు సంగీతమే వెన్నెముక… దేవి శ్రీ ప్రసాద్‌ ఏకంగా 200 పాటలకు పైగా స్వరపరిచి, అందులో బెస్ట్ ట్రాక్స్‌ను సినిమాకు వాడుకోవడం విశేషం…
  • ప్రమోషన్స్…: వైజాగ్ ఆర్కే బీచ్‌లో ‘ఆదిత్య 369’ సినిమాలోని ఫేమస్ టైమ్ మెషీన్‌ను ఏర్పాటు చేసి వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహించారు…
  • ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంపిక…: ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ అహల్యా బమ్రూను మేకర్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుర్తించి ఆడిషన్స్ చేసి ఎంపిక చేశారు…
  • అహల్యతో పాటు ఆయాన్, కొండేపూడి శాలిని కూడా ఇతర ప్రధాన పాత్రలు… ప్రధానంగా మ్యూజికల్ కామెడీ.,.
  • సింగ్ గీతం… సినిమా టైటిల్‌లో దర్శకుడు సింగీతం పేరు ధ్వనించాలి, మ్యూజికల్ ఫాంటసీ కాబట్టి సింగ్, గీతం కూడా ఆప్ట్… టైటిల్ కూర్పు వెనుక ఇంత ప్రయాస…

నాగ్ అశ్విన్

పైన ఫోటోలు చూశారు కదా… నాగ్ అశ్విన్ అక్కడ చెప్పులు విడిచి, ముందు వరుసలోనే కింద కూర్చోవడం, సింగీతం పక్కనే చెప్పుల్లేకుండా నిలబడటం… ఇదంతా సింగీతం పట్ల తన భక్తి, అభిమానం అంటాడు… గౌరవంతో కూడిన భక్తి వల్ల కలిగిన అభిమానం వరకూ వోకే, మంచిదే… కానీ ‘అతి ప్రదర్శన’ అంటారు దీన్ని… ఓవరాక్షన్… ఈ సినిమా నిర్మించిన ఉత్తమాభిరుచి తాలూకు క్రెడిట్ కాస్తా ఈ ఓవరాక్షన్ వల్ల కోల్పోవడం..!

నాగ్ అశ్విన్ కూడా ఇలాంటి ‘అతి’ చేస్తాడనేది ఎవరూ ఊహించలేదు… మరో ఆశ్చర్యం ఏమిటంటే..? కమలహాసన్ తన 20 ఏళ్ల వయస్సులో చేయలేకపోయిన కథ- సినిమా ఇది… ఇప్పుడు 70 ఏళ్ల వయస్సులో చెబుతున్నాడు… నిజానికి కమలహాసన్ కూడా సినిమాల్లో ప్రయోగశీలి… ఎన్నో ప్రయోగాలు- ఎన్నో సాహసాలు…

పైగా సింగీతంతో కమలహాసన్ కాంబినేషన్ కొత్తేమీ కాదు… ప్రయోగాలు కూడా కొత్త కాదు… పుష్పకవిమానం, విచిత్రసోదరులు కథలు, ప్రయోగాల గురించి తెలిసిందే… సొమ్మొకడికి సోకొకడిదిలో డాక్టర్, క్లబ్ డాన్సర్‌లా కమల్ హాసన్ చేశాడు, కామెడీ థ్రిల్లర్… అమావాస్య చంద్రుడులో అంధ పియానిస్ట్… మైఖేల్ మదనకామరాజులో నాలుగు పాత్రలు, అదీ కామెడీ మూవీయే…

2005లో ముంబై ఎక్స్‌ప్రెస్ సినిమాను పూర్తిగా డిజిటల్ కెమెరాతో ప్రయోగాత్మకంగా షూట్ చేశారు… అంతెందుకు..? 1994లోనే కమలహాసన్ సింగీతం దర్శకత్వంలో ఆడవాళ్లకు మాత్రమే సినిమాను స్వయంగా నిర్మించాడు కూడా…

మరి ఈ కథను ఎందుకు నచ్చలేదో, తనే ఎందుకు నిర్మించలేదో అర్థం కాదు… సింగీతం మీద తనకు ఇన్ని దశాబ్దాలుగా అంత గురి ఉండి కూడా అంగీకరించలేదు… సరే, ఇవన్నీ ఎలా ఉన్నా సరే, ఈ వయస్సులో కూడా సినిమా మీద ప్రేమ తగ్గకుండా ఓ ప్రయోగానికి సాహసించిన సింగీతంకు అభినందనలు…! తనతోపాటు ఈ సినిమాకు దాదాపు 150- 200 దాకా ట్యూన్లు కట్టి సినిమాను స్వరరంజకం చేయడానికి కష్టపడిన దేవిశ్రీ ప్రసాద్‌కు కూడా అభినందనలు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్‌రెడ్డి కాళ్లల్లో కిషన్‌రెడ్డి కట్టెలు… తుమ్మడిహెట్టికి ప్లాన్-బి… ఇలా..!!
  • కమలహాసన్ – నాగ్ అశ్విన్… సింగీతం ఎదుట రెండు ఆశ్చర్యార్థకాలు…
  • ది డోపమైన్ ట్రాప్ … అవినీతి వైపు మనిషి పరుగులు దేనికి..?
  • TMC బండి నొగలు విరుగుతున్నయ్… ‘కర్మ’ ఎదురుతంతోంది…
  • అసలు హిట్లర్ ఎవరు..? BRS రచ్చకు శ్రీధర్‌బాబు భలే కౌంటర్…!
  • బొద్దింకలు అడిగాయని… ధర్మేంద్ర ప్రధాన్‌‌ను తప్పించడం పెద్ద పరీక్షే..!!
  • బండి ‘ఫ్లెక్సీలు’ సరే… తనను పదే పదే గోకి, గిల్లి, గిచ్చి, రక్కి రెచ్చగొట్టింది ఎవరు..?
  • మానెక్ షా … మనసున్న ఓ చిత్రమైన కేరక్టర్ … చదవాల్సిన ఓ కథ …
  • ప్రధాని మోదీ వెనుక కనిపిస్తున్నది ఏమిటి..? గేమ్ ఛేంజర్..!
  • … కుండ బద్ధలు కొట్టేయడంలో రేవంత్ రెడ్డి తరువాతే ఎవరైనా..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions