. మా అమ్మాయి బ్రాహ్మణిని తన సినిమాలో తీసుకోవడానికి మణిరత్నం అడిగాడని బాలయ్య నిన్న ఏదో చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చాడు… తన కొత్త సినిమా డాకూ మహారాజ్ సినిమా ప్రమోషన్ మీట్లలో బిజీగా ఉంటూ, ఓ విలేఖరి ఇద్దరు బిడ్డల్లో ఎవరికి మీ ఎక్కువ గారాబం అనే అసందర్భ ప్రశ్నకు… బాలయ్య ఈ జవాబు చెప్పాడు… ఇద్దరూ గారాబమే అంటూనే బ్రాహ్మణి సినిమా ఆఫర్ చెబుతూ… ఆమే నో చెప్పింది అన్నాడు… బ్రాహ్మణి అంటే కాస్త భయమనీ అన్నాడు […]
జై ఎన్టీయార్ నినాదాలు ఇప్పిస్తే… సినిమాకు హైప్ పెరుగుతుందా మాస్టారూ…
నిజానికి ఇందులో జూనియర్ ఎన్టీయార్‌ను తప్పుపట్టడానికి ఏమీ లేదు… కాకపోతే ఇలాంటి వివాదాలు అంతిమంగా తనకే చెడ్డపేరు తీసుకొస్తాయి… జరిగిందేమిటంటే..? దేవర సినిమా ట్రెయిలర్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబైలో ఏర్పాటు చేశారు… ఆర్ఆర్ఆర్ తరువాత రాబోయే జూనియర్ సినిమా ఇది, పాన్ ఇండియా రేంజ్… తనకూ బాగా హోప్స్ ఉన్నాయి… శ్రీదేవి బిడ్డ జాన్వి తనతో నటిస్తుండటం ఓ ప్లస్ పాయింట్ కాగా… సైఫ్ ఆలీ ఖాన్ మరో ప్లస్ పాయింట్… హిందీలో సినిమా సక్సెస్ కోసం […]
అనిరుధ్… చివరకు నువ్వు కూడా… ఆ శ్రీలంక పాటను ఎత్తేశావా..?
మనికె మగే హితే… అని ఆమధ్య, అంటే రెండుమూడేళ్ల క్రితం ఓ శ్రీలంక గాయని పాడిన పాట ఇండియాలోనూ ఓ ఊపు ఊపేసింది… 25 కోట్ల యూట్యూబ్ వ్యూస్ ఒరిజినల్ వీడియోకు… దాన్ని అనుకరించి ఇండియాలో పలు భాషల్లో వీడియోలు చేశారు… అవీ హిట్… సరే, ఇప్పుడు ఆ పాట విశేషాలు చెప్పుకోవడం కాదిక్కడ మనం… కానీ… అరె, ఒక థమన్, ఒక డీఎస్పీయే కాదు… మన దేశీయ సంగీత దర్శకుల కన్నెండుకు పడలేదబ్బా […]
అదే బ్లడ్డు… అదే బ్రీడు… నందమూరి వారి కొత్త మొలక… న్యూ ఎన్టీయార్..!!
బాలయ్య సుప్రీం ఇగోయిస్టిక్ మాటల్లోనే చెప్పాలంటే… మరి ఆ బ్లడ్డు, ఆ బ్రీడు… మరి సాక్షాత్తూ నందమూరి పిల్లల్లోనే… చాలామంది అనామకులుగానే మిగిలిపోయారు కదా… రాజకీయాల్లో పురంధేశ్వరి, బాలయ్య కొంచెం కొంచెం ఫేమ్… నటులుగా బాలయ్య, తరువాత తరంలో జూనియర్ ఎన్టీయార్… అంతే కదా, సంక్షిప్తంగా ఎన్టీయార్ అని పిలవగల నందమూరి తారకరత్న మొత్తం కుటుంబమంతా అండగా నిలబడినా క్లిక్ కాలేదు… అంతకుముందు హరికృష్ణ మరీ కాస్త నిలబడ్డాడు ఫీల్డులో… అంతేకదా… మొన్నీమధ్య చైతన్య కృష్ణ బరిలోకి […]
టీడీపీకి ఇక మిగిలిన ఏకైక దిక్కనుకున్న జూనియర్ పేరే లేదెక్కడా…!
నిజమే… ఒక మిత్రుడు తన పోస్టులో విశ్లేషించినట్టు… జగన్ భీకరంగా దంచి కొడుతున్న దెబ్బలతో తెలుగుదేశం సతమతమవుతున్న రోజులు… అసలు ఈ పార్టీని బతకనిస్తాడా జగన్ అనుకుంటున్న కాలమది… లోకేష్ చంద్రబాబు వారసత్వాన్ని కొనసాగించలేడనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో నిండిపోతున్న దినాలు… బాలయ్య ఒక పార్టీ పగ్గాల్ని చేపట్టి రథాన్ని నడిపించలేడు… మరెవరు ఈ పార్టీ ఉనికి కాపాడేది అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తేది… ఆ స్థితిలో ఎక్కడికి వెళ్లినా ఓ కోరిక గట్టిగానో, చిన్నగానో వినిపించేది… […]
భళి దేవరా భళి… సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఏం తక్కువ మరి..?
తెలుగు హీరో అంటే ఎవడు..? వాడు సూర్యుడికన్నా ప్రచండుడు… ప్రచండామారుతం… పేలిన అగ్నిపర్వతం… అంటుకున్న దావానలం… ఇసుక తుఫాన్… అణు విస్ఫోటనం … ఆకాశంకన్నా ఎత్తు… సముద్రంకన్నా లోతు… వాడు దేవుడికన్నా మిన్న… హమ్మయ్య, నేనింకా చెప్పలేను… తెలుగు పాటల రచయితలు మాత్రమే సమర్థులు… పైన చెప్పినదానికన్నా బాగా బాగా రాస్తారు.,. కూస్తారు… మనం చూస్తాం, ఈలలు వేస్తాం, చప్పట్లు కొడతాం, థియేటర్ల హుండీల్లో వందల కోట్ల దక్షిణలు వేస్తాం… అప్పట్లో గుర్తుంది కదా… పవన్ కల్యాణ్ […]
ఎన్టీయార్ ఘాట్ మీద బాలయ్య పెత్తనం ఏమిటి..? జూనియర్‌పై ఏమిటీ ద్వేషం..?!
తండ్రి ఎన్టీయార్ సమాధి దగ్గర నివాళ్లు అర్పించడానికి వచ్చిన ఆయన కొడుకు బాలకృష్ణ అక్కడున్న జూనియర్ ఎన్టీయార్ ఫ్లెక్సీలు తీసేయాల్సిందిగా తన అనుచరగణాన్ని ఆదేశించాడు… అక్కడ మీడియాతో ఏదేదో మాట్లాడి తండ్రిని యాది చేసుకున్నాడు గానీ, తన మాటల్లో ఎప్పటిలాగే సగమే అర్థమయ్యాయి… కానీ జూనియర్ ఫ్లెక్సీలు తీసేయాలంటున్న వీడియో మాత్రం బాగా వైరల్ అయ్యింది… ఇక్కడ కొన్ని అంశాలు బాలయ్య అర్థం చేసుకోవాల్సినవి… 1) అక్కడ జూనియర్ ఎన్టీయార్ ఫ్లెక్సీలు ఉంటే ఎవరికొచ్చిన నష్టమేమిటి..? ఒక […]