Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కడుపు పంటలు కాదు… కన్న పిల్లలే కాటేసే విలన్లు… ఈ కథా అదే…

April 25, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. మరో ఉమ్మడి కుటుంబం కధాంశం . స్వార్ధపరులయిన కుటుంబ సభ్యుల్ని , ఆ కుటుంబాన్ని సరయిన మార్గం లోకి తెచ్చిన చిన్న కొడుకు , చిన్న కోడలి కధే 1991 ఫిబ్రవరిలో వచ్చిన ఈ తల్లిదండ్రులు సినిమా . ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ చాలా సీనియర్ ప్రొడక్షన్ హౌస్ . NTR తో ఒక్క సినిమా కూడా తీయలేదు ఈ నిర్మాత ఏ వి సుబ్బారావు . బాలకృష్ణతో తీసిన రెండో సినిమా ఇది .

కధను నేసిన పరుచూరి బ్రదర్సే డైలాగులను కూడా వ్రాసారు . పరుచూరి వెంకటేశ్వరరావు గారు నటించారు కూడా . స్వార్ధపరులయిన ఇద్దరు కొడుకులు , కోడళ్ళు , కూతురు తమ కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న విలన్ సత్యనారాయణ , అతని కొడుకు స్టంట్ మాస్టర్ విజయన్ తో కలిసి తల్లిదండ్రులనే మోసం చేస్తారు .

Ads

వాళ్ళ మోసాన్ని నిలవరించే క్రమంలో తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది . కుటుంబ అయోమయ పరిస్థితుల వలన తండ్రి చనిపోతాడు . ఈ అస్తవ్యస్తం అయిన కుటుంబాన్ని సరయిన మార్గంలో పెట్టుకుంటారు చిన్న కొడుకు బాలకృష్ణ , కోడలు విజయశాంతి . ఇలాంటి కధాంశంతో చాలా సినిమాలు వచ్చాయి . ఆల్మోస్ట్ అన్నీ సక్సెస్ అయ్యాయి కూడా . ఈ సినిమా కూడా బాగానే ఆడింది . 26 సెంటర్లలో యాభై రోజులు ఆడింది .

ఈ సినిమాలో విశేషం ఏమిటంటే అయిదు పాటలూ హీరోహీరోయిన్లు బాలకృష్ణ , విజయశాంతి మీదే చిత్రీకరించబడ్డాయి . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి , సిరివెన్నెల వ్రాసిన పాటలను బాలసుబ్రమణ్యం , చిత్ర , శైలజ , సుజాత శ్రావ్యంగా పాడారు . సుందరం , రఘురాం డాన్సుల్ని బాగా కంపోజ్ చేసారు .

కృష్ణా నవనంద కిషోరా , చామంతి పువ్వంటి , చిటికేసే చింతామణి , పందిరి మంచం నీది డ్యూయెట్లు విజయశాంతి , బాలకృష్ణ మీద ఉంటాయి . హుషారుగా కూడా ఉంటాయి . పిల్లలు మాస్టర్ తరుణ్ , బేబీ సుజాత విజయశాంతిని తమ బాబాయిని పెళ్లి చేసుకోమని అడుగుతూ పాడే పాట వినవమ్మా వినవమ్మా బంగారు బొమ్మా పాట శ్రావ్యంగా ఉంటుంది .

విజయశాంతి , బాలకృష్ణ విజయ జంటలో వచ్చిన ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో గుమ్మడి , సత్యనారాయణ , జయంతి , వినోద్ , విద్యాసాగర్ , సుధ , కల్పనారాయ్ , నర్రా , జగ్గయ్య , పరుచూరి వెంకటేశ్వరరావు , తాతినేని రాజేశ్వరి , శ్రీలక్ష్మి , సాక్షి రంగారావు తదితరులు నటించారు . స్టంట్ మాస్టర్ విజయన్ సత్యనారాయణ కొడుకుగా నటించాడు . మాస్టర్ తరుణ్ ఎప్పటిలాగే చిచ్చర పిడుగు అనిపించుకున్నాడు .

స్క్రీన్ ప్లే , దర్శకత్వం తాతినేని రామారావు నిర్వహించారు . సంసారపక్షంగా తీసారు . రాజమండ్రి చుట్టుపక్కల ఔట్ డోర్ షూటింగ్ చేసారు . సినిమా యూట్యూబులో ఉంది . బాలకృష్ణ , విజయశాంతి అభిమానులు వాచ్ లిస్టులో వేసుకోవచ్చు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజకీయులు అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు..?
  • ఓ చేతిలో మొబైల్, మరో చేతిలో మైక్ ఉంటే… జర్నలిస్టేనా..?!
  • సత్యశ్రీ సోదరి ! నటి కాదు… నిన్నటి విక్రమ్ రాకెట్ ప్రాజెక్టులో సైంటిస్టు !!
  • బాలీవుడ్ పొగరు vs దక్షిణాది ప్రతిభ … సాయిపల్లవిపై వివక్ష వ్యాఖ్యలు
  • కదిలే రైలులో కంట్రాక్ట్ కిిల్లర్ ! ఢాం ఢాం ! మరో ‘మొగుడు’ ఖతం !!
  • వరల్డ్ కప్ ఫైనల్ కవరేజీలో… ఆ పత్రికలు అర్జెంటీనాలాగే ఓటమిపాలు!!
  • ఈ తేజస్విని మరణం – సమాజం ఎదుట కొన్ని కీలక ప్రశ్నలు !!
  • వాంగ్‌చుక్ ప్రతి అడుగు వెనుక ఆమె… నిజమైన సహచరి !!
  • నిజం చెప్పాలంటే., కొన్నిసీన్లలో మమ్ముట్టి ముందు రజనీ తేలిపోయాడు..!
  • పెళ్లి లేకపోతేనే శాంతి ! అవివాహిత తారల్లో ఈ ‘పంచదార’ చిలక కూడా !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions