Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ డ్యాష్ ప్రశ్నలేమిటో… ఆ షో ఏమిటో… ఈ హోస్టింగ్ అవసరమా తల్లీ…

April 2, 2024 by M S R

బూతులు, హాట్ సీన్లు, వెగటు కంటెంట్ ఉంటే తప్ప ఓటీటీలను ఎవడూ చూడరనే భ్రమ ఏదో ఆవహించినట్టుంది ఆహా యాజమాన్యానికి కూడా..! అసలే నడపలేక అమ్మకానికి పెట్టినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా వెగటు కంటెంట్ వైపు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాదు… ప్రత్యేకించి మెగా ఫ్యామిలీకి చెందిన నీహారిక హోస్టింగ్ చేసే చెఫ్ మంత్ర అనే కుకరీ షోలో రీసెంటు ఎపిసోడ్‌లో పరమ చెత్తా డైలాగులను పెట్టారు…

ఆహా కూడా మెగా క్యాంపుకు చెందినదే కదా… అదే ఫ్యామిలీకి చెందిన నీహారిక హోస్ట్ చేసే షోలో ఇలాంటి డైలాగులు పెట్టిన ఆ దర్శకుడెవడ్రా బాబూ అనిపించింది ప్రోమో చూస్తే..! అసలే అప్పట్లో డ్రగ్స్ కేసు, తరువాత విడాకుల వివాదం, చేతిలో సినిమాలేవీ లేవు, వెబ్ సీరీస్‌లు సొంతంగా తీస్తుందని చెబుతారు తప్ప అవీ పెద్దగా క్లిక్ కాలేదు, ఈ నేపథ్యంలో ఇంకా ఇలాంటి వెగటు షోలలో పార్టిసిపేట్ చేయడం అవసరమా అనిపించింది…

ఇది చెఫ్ మంత్ర మూడో సీజన్… మొదటి సీజన్‌కు శ్రీముఖి, రెండో సీజన్‌కు మంచు లక్ష్మి హోస్ట్ చేశారు… అంటే ఈ షోలలో పెద్దగా వంటలు, వాటి మెలకువలు, నైపుణ్యాలు తొక్కాతోలూ ఏమీ ఉండవు… ఎవరైనా సెలబ్రిటీ జంటను తీసుకురావడం, చిట్ చాట్, సరదా సంభాషణలు, కలిసి ఏదో వండటం… అంటే ఓ ఎపిసోడ్‌ను వండటం… అంతే… నిజానికి యూబ్యూబుల్లో వంటల వీడియోలు మహా ఫేమస్.., పచ్చిపులుసు చేయడం ఎలా అనే వీడియోకు కూడా లక్షల వ్యూస్ వస్తాయి… స్ట్రీట్  ఫుడ్ సరేసరి… కుమారీ ఆంటీ సెన్సేషన్ తెలిసిందే కదా…

Ads

కానీ టీవీల్లో ప్రసారమయ్యే వంటల పోటీలు, షోలు ఫ్లాప్… పెద్ద పెద్ద టీవీలే ఆ ప్రోగ్రాములు పెట్టి చేతులు కాల్చుకున్నాయి… సరే, ఆహా ఓటీటీ టీవీలకు దీటుగా రియాలిటీ షోలను ప్లాన్ చేసి, ఇంప్లిమెంట్ చేస్తోంది, గుడ్… బాలయ్య అన్‌స్టాపబుల్, దర్శకుడు అనిల్ రావిపూడి హోస్ట్ చేసిన కామెడీ సర్కస్ (సుధీర్ కూడా ఉంటాడు), సంగీత దర్శకుడు తమన్ ప్రధాన జడ్జిగా ఇండియన్ ఐడల్ తెలుగు వంటి షోలు సూపర్ హిట్… కానీ హీరో విష్వక్సేన్ ఫ్యామిలీ ధమాకా, యాంకర్ ప్రదీప్ సర్కార్ పెద్దగా క్లిక్ అయినట్టు లేవు…

ఇక ఆహా వెగటు కంటెంట్ విషయానికొస్తే… ఈమధ్య మిక్సప్ అనే సినిమా చేశారు… అసహజమైన కంటెంట్… బాగాలేదు… ఆమధ్య నవదీప్ హోస్టుగా డగ్ అవుట్ అనే రియాలిటీ షో ఒక సీజన్ చేశారు… అసలే నవదీప్, తనకు తగినట్టే ఓ రౌండ్… ఏదైనా సందర్భాన్ని తీసుకుని బోల్డ్‌నెస్ ధ్వనించే మాటలు చెప్పాలన్నమాట… ఇక ఇప్పుడు నీహారిక హోస్ట్ చేసే ఈ చెఫ్ మంత్ర తాజా ప్రోమో విషయానికొద్దాం…

గాయకులు రాహుల్ సిప్లిగంజ్, హేమచంద్ర గెస్టులు… ఇద్దరూ సరదా మనుషులే కదా… వాళ్లకు రాసిచ్చిన ప్రశ్నలు 1) మీరు ఒంటరిగా ఉన్నప్పుడు డ్యాష్ ఎవరితో చేయడానికి ఇష్టపడతారు..? ఇది రాహుల్‌కు… 2) మీరు డ్యాష్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకుంటారు..? ఇది హేమచంద్రకు… ఈ డ్యాష్‌లో ఏం నింపుకోవాలో ప్రేక్షకుడి ఇష్టం… ఇదెవడ్రా రాసింది అంటూ సరదా మనిషి రాహులే వికారంగా మొహం పెట్టి ఇబ్బందిపడ్డాడు, జవాబు చెప్పాలంటే భయమేస్తోంది, ఏం చెప్పాలిర భయ్ అని హేమచంద్రను అడుగుతాడు… మరో సందర్భంలో రాహుల్ చేతి సైగలతో నాకుడును చూపించడం… ప్చ్, ఏమీ బాగాలేదమ్మా తల్లీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions