Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర! – సూత్రధారి ఈ సెంథిల్ బాలాజీ..?

July 2, 2026 by M S R

.

వి.సెంథిల్ బాలాజీ… ఈ పేరు ప్రముఖంగా మళ్లీ తమిళ రాజకీయ తెరపైకి వచ్చింది… 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర బయటపడింది కదా… పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు, ఇద్దరిని అరెస్టు కూడా  చేశారు… తనకు 35 కోట్ల ఆఫర్ వచ్చిందని ఇళయరాజా అనే ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో కథ పాకానపడింది…

ఆఫర్ దేనికి..? స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానంలో తనకు వ్యతిరేకంగా వోటు వేయటానికి! తద్వారా విజయ్ ప్రభుత్వం అస్థిరతలోకి జారిపోయి, పడిపోతుందని! ఈ మొత్తం కుట్ర వెనుక ఉన్నది సెంథిల్ బాలాజీగా అనుమానిస్తున్నారు… ఎవరు ఈ సెంథిల్ బాలాజీ..?

Ads

తమిళ రాజకీయాల్లో పవర్ ఫుల్ లీడర్… పశ్చిమ తమిళనాడులో బలమైన నెట్‌వర్క్, డబ్బు, సాధనసంపత్తి… పార్టీలకు తను కావాలి, తనకు ఏ పార్టీ అయినా ఒకటే… ముందుగా జయలలిత కేబినెట్‌లో రవాణా మంత్రి… తరువాత టీటీవీ దినకరన్‌కు మద్దతు, కొన్నాళ్లకే స్టాలిన్ క్యాంపులో చేరాడు… ఈ కేబినెట్‌లో కూడా పవర్ ఫుల్ మంత్రి (విద్యుత్తు- ఎక్సయిజు)… కోయంబత్తూరు, ఈరోడ్, కరూర్ ఏరియాల్లో బలమైన రాజకీయ పట్టు తనది…

అన్నాడీఎంకే మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలకు డబ్బు (Cash for Jobs) స్కామ్ బయటపడింది… ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది… మంత్రిగా ఉండగానే 2023లో అరెస్టు చేసింది… ఐనా స్టాలిన్ తనను తొలగించలేదు… పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తొలగించాల్సి వచ్చింది…

ఈ కేసులో తను ఎన్నిసార్లు బెయిల్ ప్రయత్నాలు చేసినా బెయిల్ రాలేదు, 15 నెలలపాటు జైలులోనే ఉన్నాడు… మధ్యలో ఏదో ఆపరేషన్ కూడా జరిగింది… ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది… వెంటనే స్టాలిన్ తనను అదే పోర్ట్‌ఫోలియోతో మళ్లీ కేబినెట్‌లోకి తీసుకున్నాడు… అదీ తన పవర్… (సెంథిల్, తన సోదరుడు అశోక్, మరికొందరు నాయకులను కలిపి కరూర్ గ్యాంగ్‌గా వ్యవహరిస్తారు)…

ఇప్పటికే డీఎంకే తెర వెనుక యవ్వారాలన్నీ తనే చూస్తుంటాడు… ఈమధ్య స్టాలిన్ చెబుతున్నాడు కదా, విజయ్ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదు, అందరూ ఎన్నికలకు మళ్లీ రెడీ కావాలి అని కేడర్‌కు పిలుపు ఇస్తున్నాడు కదా… దీని వెనుక మంత్రాంగం అంతా సెంథిల్ బాలాజీయే చూస్తున్నాడని టాక్…

నిజానికి విజయ్ ప్రభుత్వం నిలబడిందే డీఎంకే కూటమిలో భాగస్వామ్య పార్టీలతో..! అదును చూసి, 15 మంది టీవీకే సభ్యులను కొన్నా సరే, డీఎంకేకు మెజారిటీ రాదు, ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు… కానీ విజయ్ సర్కారు కూలిపోతే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని..! అప్పుడు డీఎంకే కూటమిలో ఏయే పార్టీలు ఉంటాయో చెప్పలేం గానీ… నిజానికి ఒకవేళ నిజంగానే స్టాలిన్ విజయ్ ప్రభుత్వాన్ని కూలదోస్తే… వెంటనే దన్నుగా నిలబడటానికి అన్నాడీఎంకే రెడీగా ఉండనే ఉంది…

సో, స్టాలిన్ లెక్కలేమిటో ప్రస్తుతానికి ఓ అస్పష్టత… సెంథిల్ బాలాజీ స్కెచ్ ఏమిటో ఓ అస్పష్టత… ఓ తమిళ జర్నలిస్టు వ్యాఖ్య ఏమిటంటే..? *విజయ్ ప్రభుత్వం కూలిపోకపోతే, ఇదే బాలాజీ మళ్లీ ఇదే విజయ్ కేబినెట్‌లోకి మళ్లీ అదే విద్యుత్తు- ఎక్సయిజు మంత్రిగా చేరిపోయినా ఆశ్చర్యపడకూడదు* అన్నట్టు, తన మీద ఈడీ కేసు క్లోజ్ కాలేదు… ఈలోపు సెంథిల్‌నే ముందు పెట్టి, బీజేపీ రంగప్రవేశం చేస్తుందా..? చూడాలి!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వితండ- తొండి వాదన ! మళ్లీ మళ్లీ కేసీయార్ అదే శుష్కవాదం !
  • Sorry Vijay, You Failed – టీవీకే పార్టీ బ్లాక్ బస్టర్… జననాయకన్ డిజాస్టర్..!
  • రెండు చిత్రాలు – రెండు అపురూప జ్ఞాపకాలు… కాలం రాసిన కథలు…
  • తన్నీరు – పన్నీరు ! ఓ బోఫోర్స్ – ఓ రాఫెల్ – ఓ బ్రహ్మోస్ – ఓ తేజస్ !!
  • N E E T – అసలు ఏమిటి ఈ పరీక్ష ! ఎందుకింత ప్రాధాన్యం !?
  • అవును, పాటలు, సీన్లు, ట్రెయిలర్లు చెప్పేది అదే… ‘టాక్సిక్’ అని..!!
  • ఫాఫం పూజా హెగ్డే ! ‘జననాయకుడి’ కథలో ఎడాపెడా కట్ కట్ !!
  • మిస్టర్ పవన్ కల్యాణ్… కోడి చెరువు కబ్జాపై మాట మీద నిలబడతావా…
  • 52 లోనూ అదే 25 … నాటి ‘గాయం’- నేటికీ అదే ప్రాయం… ఆమే ఊర్మిళ !!
  • ఏదో ఓరోజు నిజం అబద్ధాన్ని చెప్పుతో కొడుతుంది ! ఎవరన్నారు? ఎవరిని?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions