Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అతిశయం, ఆభిజాత్యం… వాణిశ్రీకి సరిగ్గా నప్పే ప్రౌఢ పాత్ర…

May 9, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ప్రౌఢ వాణిశ్రీ సినిమా అత్త సొమ్ము అల్లుడి దానం . ఆమే షీరో సినిమాకు . Excellent entertainer . యస్ వరలక్ష్మి వంటి అత్తల్ని మరిపించిన అత్త వాణిశ్రీ . ఈ సినిమాకు కధను నేసిన , పదునైన మాటల్ని వ్రాసిన తనికెళ్ళ భరణిని ముందుగా అభినందించాలి . చాలా చిక్కటి కధ .

మితిమీరిన ఆత్మాభిమానం , స్వాతిశయం , డబ్బు యావ వంటి రుగ్మతలు కల భార్య దుర్గమ్మ (వాణిశ్రీ) నుంచి విడిపోయిన భర్త సత్యనారాయణ . తన మేనల్లుడి ద్వారా తన భార్య గర్వభంగం చేయదలచుకుంటాడు . సినిమా స్టోరీ అదే .

Ads

రామాయణంలో పిడకల వేటలాగా వాణిశ్రీకి ఓ దుష్ట సోదరుడు కోట శ్రీనివాసరావు . ఎలాగోలా ఏ అండా లేని చెల్లెలు ఆస్తిని కొట్టేయ్యాలని గోతి కాడ నక్కలాగా చూస్తూ ఉంటాడు . క్లైమాక్సులో విలన్లు అందరికీ బుధ్ధి చెప్పి , అత్త గర్వాన్ని అణిచి మేనమామ , అత్తని ఒక చోటకు అల్లుడు వినోద్ కుమార్ చేర్చడంతో సినిమా శుభాంతం అవుతోంది .

నటనపరంగా మొదటి ప్రైజ్ వాణిశ్రీకే . మూర్ఛ బిళ్ళ మెడలో వేసుకుని రకరకాల వేషాలతో చిత్ర విచిత్ర విన్యాసాలతో మరోసారి అదరగొట్టేసాడు కోట . హీరోహీరోయిన్లుగా వినోద్ కుమార్ , రోజా , ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , శ్రీహరి , రామిరెడ్డి , రాళ్ళపల్లి , అనూజ , చంద్రిక , బాబూమోహన్ తదితరులు నటించారు .

రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో భువనచంద్ర వ్రాసిన పాటలు బాలసుబ్రమణ్యం , చిత్ర శ్రావ్యమైన కంఠాలతో బాగుంటాయి . బోల్ బుజ్జి బోలో గొప్పల చిట్టా అనే టీజింగ్ సాంగ్ , గగన సీమలో ఓ ఊర్వశీ నా ప్రేయసీ , మల్లె పూల కాలం జమాయించు కాలం , ఊరంతా కోడై కూయాలి డ్యూయెట్లు హాటుగానే తీసారు దర్శకుడు వై నాగేశ్వరరావు . తార , దిలీప్ డాన్సుల్ని బాగా కంపోజ్ చేసారు .

తనికెళ్ళ భరణి వ్రాసిన ఈ హాస్యరస వినోదాత్మక చిత్రానికి కొమ్మనాపల్లి గణపతిరావు బిర్రయిన స్క్రీన్ ప్లేని సమకూర్చారు . ఎక్కడా విసిగించకుండా చకచకా సాగిపోయే ఈ సినిమా యూట్యూబులో ఉంది . వాణిశ్రీ అభిమానులు తప్పక చూడతగ్గ సినిమా …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడం కాదు ! ఈ సుందరి ఏమన్నదో తెలుసా ?
  • ఏయ్, తప్పు..! సాదిక్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేయకూడదు !!
  • నిజమే అనసూయా… అసలే సోషల్ మీడియాలో బికినీల కాలమిది !!
  • కంగనా అంటే అంతే ! Who Cares అంటూ రోజుకొకరికి ఇచ్చి పడేస్తోంది !
  • ఓహో… వన్ గ్రామ్ ఫ్రీ ఉంగరంపై మేనమామ రూపం అట !
  • ఆమె ఆమే ! రంభను తీసుకొచ్చినా రీప్లేస్ చేయలేరు ! అదే జరిగింది !!
  • యశస్వి జైస్వాల్ కథ కంచికేనా ? మీడియాలో బోలెడన్ని తీర్పులు !!
  • తెగ బలిసిన కార్లు పైకి ఎక్కేస్తాయి – మనమే పైలంగా ఉండాలె !!
  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions