Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శోభన్‌బాబును చంపేస్తే ప్రేక్షకులు ఊరుకుంటారా..? ఛఫో అనేశారు..!

May 7, 2026 by M S R

.

Subramanyam Dogiparthi … శోభన్ బాబు , బాలకృష్ణల రేర్ కాంబినేషన్. ఆరోజుల్లోనే మూడు కోట్ల భారీ బడ్జెట్టుతో వచ్చిన సినిమా ఈ అశ్వమేధం . ఇద్దరు హీరోయిన్లు . అమ్రీష్ పురి ద్విపాత్రాభినయం . ఆశా భోంస్లే పాటలు కూడా ఉన్నాయి . అయినా ఆ లెవెల్లో ఆడలేదు .

రామలక్ష్మణులు వంటి అన్నాదమ్ములు శోభన్ బాబు , బాలకృష్ణ . అన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ , తమ్ముడు పైలట్ . అమ్రీష్ పురి , కోట శ్రీనివాసరావు , రాధా రవి విలన్లు . ఆయుధాల అక్రమ వ్యాపారస్తులు . సిన్సియర్ ఆఫీసరయిన శోభన్ బాబుని చేయని హత్య కేసులో ఇరికించి అరెస్ట్ చేయించి అవమానిస్తారు .

Ads

ఖిన్నుడైన శోభన్ బాబు ఆత్మహత్య చేసుకోవటంతో తమ్ముడు అశ్వమేధాన్ని మొదలుపెట్టి విలన్లను తుదముట్టించి దేశాన్ని విధ్వంసం నుండి కాపాడతాడు . అయితే ఇద్దరు హీరోయిన్లలో ఒకరయిన మీనాకు అన్యాయం చేసాడు రాఘవేంద్రరావు . అలా ముగుస్తుంది సినిమా .

సినిమాకు ప్లస్ ఇళయరాజా సంగీతంలో వేటూరి వారి పాటల్ని బాలసుబ్రమణ్యం , ఆశా భోంస్లే , జానకమ్మ , చిత్రలు శ్రావ్యంగా పాడారు . కొన్ని పాటలు రాజస్థాన్ పేలసుల్లో షూట్ చేయబడ్డాయి . ప్రభు దేవా డాన్సుల్ని అందంగా కంపోజ్ చేసాడు .

ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమా , చెప్పనా ఉన్న పని చెయ్యనా కాస్త పని , గుంతలకిడి ఘుమ ఘుమందం , శీతాకాలం ప్రేమకు ఎండాకాలం , ఏం దెబ్బ తీసావురా ఓ యబ్బ నచ్చావురా అంటూ సాగే డ్యూయెట్లు హీరోహీరోయిన్ల మీద బాగా వచ్చాయి . ఫేమిలీ సాంగ్ జుం చకు చకు ఆనందాలే పొంగే పాట బాగా చిత్రీకరించబడింది .

బాలకృష్ణ , నగ్మాలు నటించిన ఏకైక చిత్రం . బాలకృష్ణకు మీనాతో మొదటి సినిమా . ఇతర పాత్రల్లో బ్రహ్మానందం , ప్రసాద్ బాబు , అల్లు రామలింగయ్య , గీత , తదితరులు నటించారు . కధను , డైలాగులను సత్యానంద్ వ్రాయగా , స్క్రీన్ ప్లేని యండమూరి సమకూర్చారు . రాఘవేంద్రరావు దర్శకుడు , అశ్వినీదత్ నిర్మాత . సినిమా యూట్యూబులో ఉంది . బాలకృష్ణ అభిమానులు చూడవచ్చు .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చైనా జిన్‌పింగ్‌కు ఏమైంది..? ఏదో భారీగానే తేడా కొడుతోంది!!
  • ఎవరినీ కాదనలేం- ఎవరినీ హత్తుకోలేం! బ్రిక్స్‌తో భారత్‌కు లాభమేంటి?
  • జస్ట్, సెక్యూరిటీ కాదు- రాష్ట్రపతి పక్కన నడక అంత ఈజీ కాదు!
  • సంపన్నుల లగ్జరీ కొనుగోళ్లు – సిస్టమ్‌కు నష్టమా? లాభమా?
  • ఒకప్పటి తిరుగులేని సామ్రాజ్యం- ఇప్పుడు 4 ముక్కల విచ్ఛిన్నం అంచుల్లో!!
  • దేబ్‌జానీ! నాగార్జున వీకెండ్ ఫ్లాప్ షోలో ఈమె ఒక్కతే కాస్త మెరుపు!!
  • పోనీ, మీ కేసీయార్‌తో ఒక్క హామీ ఇప్పించు చాలు… నాట్లు వేసేద్దాం…
  • విజయవాడ నాయకులందరికీ నిజంగా ఒక అవమానం…
  • ఆ బిన్ లాడెన్ వారసుడు హమ్జా ఇంకా బతికే ఉన్నాడా ।?
  • మా ఓట్లు పోయినట్లేనా ‘సర్’?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions