Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇప్పుడూ చూడొచ్చు..! ఇలాంటి భిన్నకథలు ఎప్పుడో గానీ రావు తెలుగులో..!!

February 24, 2026 by M S R

.

Subramanyam Dogiparthi … పేరు విన్నారా? చూసారా ఈ సినిమాని ?! చూసి ఉండకపోతే అర్జెంటుగా చూసేయండి . ఇలాంటి వినూత్న కధలతో సినిమాలు మన తెలుగులో ఎప్పుడో కాని రావు . It’s a crime , suspense , investigative thriller with most melodious songs and most enjoyable dances .

ముందుగా అభినందించవలసింది దర్శకుడు గీతాకృష్ణని . ప్రపంచంలో అక్కడక్కడా జరిగే కొన్ని మానవాతీత అనుభవాల ఆధారంగా ఈ సినిమా కధను తయారు చేసుకున్నారు . మనిషి శరీరంలో మెదడుకు తప్ప మరి ఏ ఇతర అవయవానికి జ్ఞాపకశక్తి ఉండదు . కానీ , కొన్ని అసాధారణ సందర్భాలలో ఆ శక్తి వేరే అవయవానికి కూడా సంక్రమించవచ్చు అనే ప్రమేయంతో ఈ సినిమా కధ నేయబడింది .

Ads

ఓ అందమైన జంట ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు . ప్రమాదంలో హీరో నరేషుకి కళ్ళు పోతాయి . అనుకోకుండా అతనికి కళ్ళు అమర్చేందుకు ఐ బాంక్ నుండి కళ్ళు లభిస్తాయి . ఆపరేషన్ కూడా సక్సెస్ అవుతుంది . అయితే ఆశ్చర్యంగా కట్లు విప్పగానే నన్ను చంపొద్దు చంపొద్దు అని నరేష్ కేకలు పెడుతుంటాడు .

హృషీకేశ స్వామి అనే ఒక ధనిక గురువు హత్య చయబడతాడు . అతని కళ్ళు ఇలా కేకలు పెడుతుంటాయి . కేసు సిబిఐకి అప్పగించబడుతుంది . సిబిఐ ఆఫీసర్ శరత్ బాబు కేసుని ఛేదిస్తాడు .

ఎందుకనో దర్శకుడు గీతాకృష్ణ సినిమాను శుభాంతం చేయకుండా ముగించారు . కోర్ట్ హాల్లో విలన్లు కోట శ్రీనివాసరావు , రంగనాధులను హీరోయిన్ శోభన రివాల్వరుతో షూట్ చేసి చంపేసి సంకెళ్లు వేయించుకుంటుంది . హీరో నరేష్ మతి స్థిమితాన్ని కోల్పోతాడు . ఇలాంటి ముగింపుని ఎందుకు ప్రిఫర్ చేసారో !!!

కోకిల
నటనపరంగా మొదటి తాంబూలం శోభనదే . సినిమాలో సింగర్ పాత్ర . తన నృత్యాలతో , ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది . ఆమే షీరో . ఆ పాత్రతో సమానమయిన పాత్ర హీరో నరేషుది . చాలా బాగా నటించాడు .

సిబిఐ ఆఫీసరుగా శరత్ బాబు , అతన్ని లవ్వాడే మీడియా మహిళగా గీత చాలా హుషారుగా , అల్లరిగా నటించింది . ప్రకృతి వైద్యుడిగా రమణమూర్తి , స్పెషలిస్ట్ నేత్ర వైద్యుడిగా సి యస్ రావు , విలన్లుగా నాజర్ , జీవా తదితరులు నటించారు . పోలీసు ఆఫీసరుగా శివకృష్ణ , ఇతర పాత్రల్లో విద్యాసాగర్ , అనిత , డబ్బింగ్ జానకి  ప్రభృతులు నటించారు .

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . పాటలన్నీ వేటూరి వారే వ్రాయగా బాలసుబ్రమణ్యం , మనో , చిత్ర , శైలజ పాడారు . శివశంకర్ నృత్యాలను కన్నుల విందుగా కంపోజ్ చేసారు . కోకిలా కొక్కొ కోకిలా కూతలా రసగీతలా డ్యూయెట్ చాలా బాగుంటుంది .

అలాగే మరో డ్యూయెట్ తళుక్కు బెళుక్కు కుళుక్కు . సినిమా మొదట్లో శోభన పాడే నవోదయం నాదం నిశ్శబ్ద సాగరాల నాడు నీ రాగం , చివర్లో పాడే ఆకాశం మేఘాలు మూసే వేళలో ఆవేశం రాగాలు తీసే వేళలో చాలా శ్రావ్యంగా ఉంటాయి . గీత పాడే బృంద నృత్య గీతం పుత్తడి బొమ్మ అద్భుతంగా చిత్రీకరించబడింది . గీత బాగా అల్లరిగా నటిస్తుంది .

శోభన
ప్రముఖ రచయిత కం నటుడు యల్బీ శ్రీరాం డైలాగుల రచయితగా ఈ సినిమా ద్వారానే అరంగేట్రం చేసారు . సరోజ్ పాడి ఛాయాగ్రాహణం బాగుంటుంది . నిర్మాత గుర్రం ఉమామహేశ్వరరావుని అభినందించవలసిందే .

సినిమా యూట్యూబులో ఉంది . An unmissable , off-beat and enjoyable movie . నేను పరిచయం చేస్తున్న 1246 వ సినిమా (23-2-2026) . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సర్.., మీరు ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారు ? స్పెర్మ్ బ్యాంకు !!
  • ఇరుముడి విషాదం! దిల్ రాజు ఎదుట సర్కారు సాగిలబడాలా?
  • ఈ తడారిన శ్వాసల తబలా చప్పుళ్లు ఓసారి వినండర్రా లీడర్లూ..!!
  • Irumudi – రవితేజ ‘ఇరుముడి’పై స్పష్టంగా ఓ మాలీవుడ్ ముద్ర !
  • ‘గ్లోబరీనా’ తవ్వకాలు షురూ ! కేటీయార్‌పైకి మరో అస్త్రం రెడీ !!
  • అబద్దాలు- తప్పుడు బాష్యాలు – కాళేశ్వరంపై అవే వక్రీకరణ కథలు !!
  • రాఖీకి ఈ ర్యాంప్ లుక్ ఎందుకు..? దారితప్పుతున్న క్రియేటర్లు…!!
  • కులం నిజం – వివక్ష నిజం – కులాధిపత్యం గుప్పిట్లో టాలీవుడ్‌ !!
  • రేవంత్ రెడ్డే టార్గెట్ ! తెర వెనుక ఒక్కటవుతున్న వేర్వేరు శక్తులు !!
  •  2029 టార్గెట్‌గా చకచకా పావులు..! జమిలి, డీలిమిటేషన్, మహిళా కోటా…?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions