.
ఒక సినిమా… కేజీఎఫ్ రావణ్ యశ్, సౌత్ ఫిమేల్ సూపర్ స్టార్ నయనతార, హుమా ఖురేషి, కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా… ఈ అతిరథులంతా నటిస్తున్న చిత్రం… టాక్సిక్… దర్శకురాలు గీతా మోహన్‌దాస్… ఆమె మొండితనం, సినిమాలోని బోల్డ్ అండ్ ఇంటిమేట్ సీన్లు మొత్తం ఆ తారాగణాన్ని బజారులోకి లాగేట్టుగా ఉన్నాయి…
కేజీఎఫ్‌తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకుని, రామాయణంలో రావణ పాత్ర కూడా పోషిస్తున్న యశ్ మాత్రం సినిమా నాణ్యత, రోత సీన్ల మీద స్పందించడం లేదు కానీ కియారా అద్వానీ మాత్రం లబోదిబో అంటోంది… కారణం… కథను బట్టి కాస్త లిబరల్‌గా యశ్‌తో కొన్ని బోల్డ్ సీన్లలో నటించింది గానీ, తీరా ఫైనల్ ఔట్ పుట్ చూసి, ఇదేంటి మరీ ఇంత ఘాటుగా కనిపిస్తోంది అని మొత్తుకుంటోంది…
Ads
అంతేకాదు, కాస్త డోస్ తగ్గించండి, లేకపోతే ఫ్యామిలీ ప్రేక్షకులు ఇక నన్ను పట్టించుకోరు, అసలే పెళ్లయింది, ప్లీజ్, దయచేసి ఆ సీన్ల నిడివైనా తగ్గించండి అని మొరపెట్టుకుంటోంది దర్శకురాలితో… ఆమె ససేమిరా అంటోంది… అసలు కథకు బోల్డ్ సీన్లే ప్రధానం, అవి లేకపోతే ఎలా, ముందే చెప్పాను కదా, ఇప్పుడేమో నా క్రియేటివ్ ఫ్రీడమ్‌కు అడ్డుపడితే సినిమాయే దెబ్బ తింటుంది అని మొండిగా వ్యవహరిస్తోంది… (కియారా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది…)
ఈ వివాదం కొనసాగుతూ సినిమా విడుదల కూడా వాయిదా పడుతూ వస్తోంది… చివరకు జూన్ 4 రిలీజ్ డేట్ అని ప్రకటించారు… ఇదీ ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ వర్గాల్లో హాట్ టాపిక్… (టాక్సిక్ అంటే అర్థం తెలుసు కదా, విషపూరితం… సినిమా కూడా ఓరకంగా అలాగే ఉందని ట్రయిలర్లు చూసిన విశ్లేషకులు కూడా తిట్టిపోశారు…)
ఈ చిత్రాన్ని దర్శకురాలు “పెద్దల కోసం రూపొందించిన ఒక అద్భుత కథ” (A Fairy Tale for Grown-ups) అని అభివర్ణించింది… అంటే ఆ సీన్లు కథలో చాలా కీలకమని, వాటిని తీసేస్తే సినిమా అనుకున్న ఇంపాక్ట్ రాదు, క్రియేటివ్ ఫ్రీడమ్ విషయంలో రాజీ పడను అంటోంది… (ఆమె సినిమాలు కాస్త డార్క్ షేడ్స్‌తోనే ఉంటాయి)…
ఈమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు రాజీవ్ రవిని వివాహం చేసుకుంది… ఈ టాక్సిక్ సినిమా ఆమె మొదటి పాన్ ఇండియా కమర్షియల్ బిగ్ మూవీ… భారీ తారాగణం కదా, 700- 800 కోట్ల బడ్జెట్… ఏమాత్రం తేడా కొట్టినా నటించిన తారలందరూ బదనాం కావడం తథ్యం…
దీనికి ప్రధాన నిర్మాత వెంకట్ కె. నారాయణ (Venkat K. Narayana), ఈయన KVN ప్రొడక్షన్స్ (KVN Productions) అధినేత… కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న సంస్థ ఇది…

ఈ టాక్సిక్ సినిమా నిర్మాణంలో యశ్ కూడా భాగస్వామి… తన సొంత బ్యానర్ అయిన ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’ (Monster Mind Creations) ద్వారా ఈ చిత్ర నిర్మాణంలో Co-producer… (రామాయణంలో కూడా కోప్రొడ్యూసర్)… ఇంత భారీ బడ్జెట్ చిత్రాాన్ని గీతూ మోహన్‌దాస్‌కు అప్పగించడం మీద కూడా సినీవర్గాల్లో విస్మయం వ్యక్తమైంది …
సినిమా విడుదలకు ముందే ఇంత నెగెటివిటీని మూటగట్టుకుంటుంటే అటు ప్రధాన నిర్మాత గానీ, ఇటు యశ్ గానీ… ఇందులో నటిస్తున్న ఇతర తారలు గానీ ఎందుకు స్పందించడం లేదనేదీ ప్రశ్నే… ఆ సీన్లు అలాగే ఉంటే సెన్సార్ బోర్డు నుంచీ చిక్కులు రావచ్చునని తాజా సమాచారం..!!
Share this Article