Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పక్కా కాలక్షేపం పల్లీ బఠానీ… జంధ్యాల, ఈవీవీ, రేలంగి… సేమ్ సేమ్…

May 21, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. కృష్ణ , విజయనిర్మల తమ స్వంత బేనర్ విజయకృష్ణ మూవీస్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ మొగుడు పెళ్ళాల దొంగాటకు కధను రేలంగి నరసింహారావు , Divakara Babu Madabhushi  అందించగా రేలంగి నరసింహారావు స్క్రీన్ ప్లేని , దర్శకత్వాన్ని నిర్వహించారు . డైలాగులను దివాకర్ బాబు వ్రాసారు .

రేలంగి నరసింహారావు సినిమా అనగానే ఫుల్ హాస్యరస భరిత సినిమా అని ఇట్టే అర్థం అవుతుంది . దానికి తోడు హాస్యరస చిత్రాలకు అప్పట్లో చిరునామాలలో ఒకరు నరేష్ …. నరేష్ , దివ్యవాణి , కోట శ్రీనివాసరావు , వై విజయ , శుభలేఖ సుధాకర్ , శ్రీలక్ష్మి , గుండు హనుమంతరావు , కృష్ణ చైతన్య ప్రభృతులు నటించారు .‌

Ads

నరేష్ జల్సా కుర్రోడు . ఎలాగోలా గడుగ్గాయి దివ్యవాణిని పెళ్లి చేసుకోవాలని తన ఐడెంటిటీని మరుగుపరచి కోళ్ల ఫారం యజమానిగా పరిచయం చేసుకుని తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుంటాడు . అద్దె ఇంటిని ఖాళీ చేయవలసి వస్తుంది .

నరేషుకు తెలియకుండా వాళ్ళ ఇంట్లోనే అద్దెకు దిగుతారు . తల్లిదండ్రులకు తాను నరేష్ పోలికలతో ఉన్న మరో వ్యక్తినని డూప్ చేస్తారు . పెళ్ళిచూపులకు తన బదులు స్నేహితుడు సుధాకర్ని పంపటం , సినిమా హాల్లో ఆ అమ్మాయి సుధాకర్ వెంట అతని భార్య శ్రీలక్ష్మిని చూడటం , వాళ్ళ కొంప కొల్లేరు కావటం జరుగుతుంది . ఈ డ్రామాకు తెర దించాలని అందరూ కలిసి నాటకం ఆడి నరేషుతో క్లైమాక్సులో నిజం బయలుపరిచేలా చేయటంతో సినిమా శుభాంతం అవుతుంది .

ఈ సినిమాలో సాధారణంగా శ్రీలక్ష్మికి దక్కే పాత్ర వై విజయకి దక్కింది . తన భర్త చేత మొక్కులు తీర్చేలా దేవుడికి టెండర్లు వేస్తుంటుంది . రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో వేటూరి , వడ్డేపల్లి కృష్ణ వ్రాసిన పాటలు థియేటర్లో బాగానే ఉంటాయి .

ముఖ్యంగా టైటిల్ సాంగ్ మొగుడు పెళ్ళాల దొంగాట ఇది నరుడే ఆడించు బంతాట చాలా బాగా వచ్చింది . దొంగ పెళ్ళికీ జైలు శోభనం , రంభయినా నీ ముందు , కొంప మీద కోడి పుంజు , వలచిన వనితతో పాటలు బాగుంటాయి . బాలసుబ్రమణ్యం , చిత్ర పాటల్ని పాడారు .

జంధ్యాల , రేలంగి నరసింహారావు , ఇవివి సినిమాల్లో సందేశాలు గట్రా ఏం ఉండవు . కాసేపు హాయిగా నవ్వుకుంటూ కాలక్షేపం చేయటమే . 1992 లో వచ్చిన ఈ సినిమా అలాంటిదే . యూట్యూబులో ఉంది . హాస్యరస ప్రియులు ట్రై చేయవచ్చు .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ట్రంప్ సేఫ్ ! కానీ ఆ జర్నలిస్టులు, వైట్‌హౌజ్ స్టాఫ్ పరిస్థితి..!?
  • చట్టం చేయని నిర్వాకం కేసీయార్‌ది ! నిందలు రేవంత్ రెడ్డిపైన !!
  • Bheemana Amavasya ! భర్తకు నటి ప్రణీత పాదపూజ వైరల్ ఫోటోలు !!
  • టాటా చైర్మన్ చంద్రశేఖరన్ నిష్క్రమణ వెనుక ఏం జరిగింది ?!
  • ఆ దరిద్రుడు, నరకం చూపించాడు ! అనుపమ వేదనాగీతం !!
  • ప్రకాష్‌రాజ్ నిర్మాతగా ఓ నాసి మూవీ – బాలచందర్ పరువూ గల్లంతు !!
  • అడాప్టివ్ టెస్టింగ్ ! నీట్- పోటీ పరీక్షల అక్రమాలకు రియల్ చెక్ !!
  • PTG Colony – అరకు ​హైవే మెరిసింది… కనీస గౌరవం మరిచింది!
  • చంద్రముఖి ! హీరోలు, భాషలు మారేకొద్దీ అష్టవంకర్లు పోయిన అసలు కథ !
  • గైర్హాజరీ టీచర్లపై ఇకపై కఠిన చర్యలు! ఉత్తర్వులు జారీ!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions