Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

70 ఏళ్ల మాస్ ముసలమ్మ..! ఈ వయస్సులోనూ రాధిక అదరగొట్టేసింది..!!

March 3, 2026 by M S R

.

రాధిక..! ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరే కదా… ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా… ఎన్నో సినిమాలు, ఎన్నో పాత్రలు… ఆ పేరు వినగానే గుర్తొచ్చే స్వాతికిరణం, స్వాతిముత్యం వంటి పాత్రలు మరీనూ… 63 ఏళ్ల వయస్సులో కూడా ఈరోజుకూ యాక్టివ్, టీవీ ప్రోగ్రామ్స్ నిర్మాతగా, నటిగా… ఇంత బిజీ లైఫులో కూడా జీతెలుగులో ఏదో ఓ షోలో జడ్జిగా కూడా కనిపిస్తోంది…

ఇప్పుడు ఆమె చేసిన ఓ పాత్ర తమిళ ఇండస్ట్రీలో హల్‌చల్ క్రియేట్ చేస్తోంది… అందులో ఆమె 70 ఏళ్ల బామ్మ పాత్ర పోషించింది… ఆ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా మేకప్ చేయించుకుంటున్న వీడియోలు కూడా ఈమధ్య వైరల్ అయ్యాయి చూశాం కదా… ఆ సినిమా పేరు తాయ్ కిళవి (ముసలవ్వ)… పాత్ర పావునుతాయ్ (బంగారమ్మ)…

Ads

ఈ సినిమాలో ఆమె నటన చూసి కమల్‌హాసన్ కూడా ‘లేడీ కమల్’ అని అభినందించాడట… ఆ మేకప్, ఆ లుక్ కోసం ఆమె కష్టపడిన తీరుకు కూడా..! నాలుగు రోజుల్లో 25 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా… పెద్ద పెద్ద స్టార్ల సినిమాలే తన్నేస్తున్న ఈ రోజుల్లో రాధిక మెయిన్ లీడ్‌గా చేసిన ఓ చిన్న సినిమా ఈమేరకు వసూళ్లు కురిపించడం అంటే విశేషమే కదా…

రాధిక

ఐతే కేవలం తమిళంలోనే ఉంది సినిమా… ఆమెది మధురై యాస… అంతా తమిళ యాక్టర్లే… తమిళ వాతావరణమే… సో, ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు చూడాలనుకుంటే ఏదైనా ఓటీటీలో వచ్చినప్పుడు తెలుగు డబ్బింగుతో చూడాలేమో… నిర్మాత శివకార్తికేయన్… తమిళంలో సానుకూల రివ్యూలే వస్తున్నాయి… సరే, సినిమా కథకొస్తే…

ఈ బామ్మకు కోపం ఎక్కువ, లౌక్యం ఎక్కువ… వడ్డీ వ్యాపారం చేస్తుంది, డబ్బు మీద యావ ఎక్కువ… అవసరమైతే ఎవరినైనా సరే బూతులతో దబాయించగలదు, దడదడలాడించగలదు… ముగ్గురు కొడుకులు… కానీ ఒక్కడూ ప్రయోజకుడు కాడు… సో, వాళ్లను తరిమేసి, ఈ ముసలమ్మ కూతురు, మనమడితో ఉంటుంది…

ఈ బామ్మ దగ్గర ఏదో బంగారు నిధి ఉందనేది ఊళ్లో ప్రచారం… ఆమెకు నోరే బలం కదా, హఠాత్తుగా ఆమెకు పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది… ఆమె నోరు తెరిస్తే తప్ప ఆ నిధి యవ్వారం బయటికి రాదు… అందుకే కొడుకులు, కోడళ్లు వచ్చి వాలతారు… ఆ నిధి కోసం ఏవేవో ప్రయత్నాలు, డ్రామాలే సినిమా కథ…

సినిమాను ప్రధానంగా కామెడీతోనే నడిపిస్తాడు దర్శకుడు శివకుమార్ మురుగేశన్… ఆ కామెడీ సీన్లు, డైలాగులు కూడా బాగా వర్కవుటయ్యాయి… చివరలో కొన్ని ఎమోషనల్ సీన్లతో కదిలించేస్తాడు… ఒక ధైర్యవంతురాలైన మాస్ బామ్మ, పల్లె ముసలమ్మ పాత్రే సినిమాలో హైలైట్… రాధిక అచ్చంగా ఆ పాత్రలోకి దూరిపోయింది…

ఆ పాత్ర ఎలా హిట్టవుతుందో తనకూ తెలుసు కదా, అందుకే ఆ ప్రోస్థటిక్ మేకప్ (వేయడానికి 5 గంటలు, తీయడానికి 2 గంటలు), ఆ లుక్ కోసం బాగా కష్టపడింది… ఫలితం దక్కింది..!! నటదురంధరి..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చైనా జిన్‌పింగ్‌కు ఏమైంది..? ఏదో భారీగానే తేడా కొడుతోంది!!
  • ఎవరినీ కాదనలేం- ఎవరినీ హత్తుకోలేం! బ్రిక్స్‌తో భారత్‌కు లాభమేంటి?
  • జస్ట్, సెక్యూరిటీ కాదు- రాష్ట్రపతి పక్కన నడక అంత ఈజీ కాదు!
  • సంపన్నుల లగ్జరీ కొనుగోళ్లు – సిస్టమ్‌కు నష్టమా? లాభమా?
  • ఒకప్పటి తిరుగులేని సామ్రాజ్యం- ఇప్పుడు 4 ముక్కల విచ్ఛిన్నం అంచుల్లో!!
  • దేబ్‌జానీ! నాగార్జున వీకెండ్ ఫ్లాప్ షోలో ఈమె ఒక్కతే కాస్త మెరుపు!!
  • పోనీ, మీ కేసీయార్‌తో ఒక్క హామీ ఇప్పించు చాలు… నాట్లు వేసేద్దాం…
  • విజయవాడ నాయకులందరికీ నిజంగా ఒక అవమానం…
  • ఆ బిన్ లాడెన్ వారసుడు హమ్జా ఇంకా బతికే ఉన్నాడా ।?
  • మా ఓట్లు పోయినట్లేనా ‘సర్’?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions