Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎంతసేపూ పూరేకలు విచ్చుకోవడంపైనేనా వేటూరి దృష్టి..!?

May 14, 2026 by M S R

.

“ఆ దేవుడు ఆ దేవితో అలకబూనెనేమో… ఈ రూపు గా శ్రీదేవిని ఇలకు పంపెనేమో.. రేకులు విచ్చిన సిరిమల్లి.. అన్నల ముద్దుల చెల్లి”  ఇది చంటి సినిమాలోని పాటలో ఓ పార్ట్… పుష్పవతి, వ్యక్తురాలు, పెద్ద మనిషి అయినా ఓ చిన్నారి కోసం పాడే పాట… వేటూరి మంచి రచయితే కానీ… రేకలు, పూరేకల ప్రస్తావన తనలోని కొంటెగాడిని బయటికి తీస్తుంది… ఉదాత్త సందర్భాల్లో కూడా ఈ మొగ్గ పువ్వు కావడం, సిరిమల్లి రేకలు విచ్చుకోవడం వంటి వర్ణనలోకి వెళ్లడం, తన పదాలు సరిగ్గా అక్కడికే వెళ్లడం సరైంది కాదనిపిస్తుంది…

పెద్ద మనిషి కావడం అంటే… ఓ పిల్ల తల్లి కావడానికి దైహిక అర్హత సంపాదించడం… మాతృత్వానికి సిద్దం కావడం… అదేదో సరళమైన, సభ్య పదాలతో చెప్పొచ్చు కదా… అక్కడా కేవలం సంభోగం, శృంగారం ధ్యాసేనా..? తను వేటూరి కదా, పైగా అది సినిమా కదా… ఇళయరాజాకేమో తెలుగు పదాలు తెలిసి చావవు కెదా.,. సో, అలా చలామణీలోకి వచ్చేసింది ఆ పాట… అఫ్‌కోర్స్, ట్యూన్ కారణంగా హిట్ కూడా అయ్యింది…

Ads

“పావురానికి, పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం”… ఇది మరో పాటలోని మరో వాక్యం… తనకు ఆ కోటలోని ఆ పిల్లతో జరిగింది పెళ్లే అని తల్లి ద్వారా తెలిశాక కథానాయకుడి ఆవేదన అన్నమాట… నిజానికి హీరో ఆ కథలో అజ్ఞాని, మూర్ఖుడు… పుస్తె కడితే పెళ్లి జరిగినట్టేననీ తెలియదు… అలాంటోడు… ఏకంంగా పావురానికీ పంజరానికీ పెళ్లి చేసే పాడులోకం అని పాడతాడు… ప్చ్…

నిజానికి ‘కంచె చేను మేసింది’ అనే సామెతకు విరుద్ధంగా, కంచెకు చేనుకు పెళ్లి అనే అర్థంతో సాగిన పాట… ఆమె పావురం కాదు, తను పంజరమూ కాదు, ఏదో వేటూరి అలా కలిపేశాడు, జనం ఆహా అన్నారు, చప్పట్లు కొట్టేశారు… పైగా ఇక్కడ పాడులోకం ఆ పెళ్లి చేయలేదు… లోకానికి సంబంధం లేదు, ఆ పిల్ల చేష్ట అది…

“చలిమర గదులలో సుఖపడు బ్రతుకులు వేసవి కోరునా?” అని హీరో ప్రశ్నిస్తే… “అలిగిన గుడిసెల చలువుల మనసులు మేడలో దొరకునా?” అంటూ హీరోయిన్ ఇచ్చే సమాధానం… తొలిసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చి ప్రకృతి అందాలు చూసి మురిసిపోతున్న హీరోయిన్ అంతరంగం అది… ఇక్కడ వేటూరిని మెచ్చుకోవాల్సింది చలిమర గదులు అనే ప్రయోగం… ఏసీ రూమ్స్‌కు… క్షుద్ర అనువాదాల ఈనాడు బాటతో పోలిస్తే ఎంత హాయి… చలిమర గదుల్లో సేద దీరుతున్నట్టే…

అయితే అలిగిన గుడిసెల చలువుల మనసులు మేడలో దొరుకునా అంటోంది ఆ పిల్ల… ఆమె అసూర్యంపశ్య… అంటే ఎండ కన్నెరగని, బయటిలోకం తెలియనిది… ఆమె ఈ అలిగిన గుడిసెలు, చలువుల మనసులు ఎలా తెలుసు..? ఇది కవి సమయమే తప్ప పాత్ర స్వభావం కాదు… కానీ వేటూరి కదా రాసింది… తెలుసనే అనుకుని చప్పట్లు కొట్టాలి మరి…

జారిపోయే కాలం చేజారిపోయే యోగం
రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం
కరువౌతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో

తను పెళ్లిచేసుకున్న వాడిని తనవాళ్లు కావాలనే దూరం చేశారని తెలుసుకుని చావడానికి సిద్ధపడ్డ కథానాయిక రోదన ఇది… దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం అనీ అంటుంది… ఇలా తనే తనకు తోచిన ఏవేవో భావాల్ని అక్షరీకరించి, పదాలుగా పొదిగి, పాటలుగా కూర్చి వదిలాడు మన మీదకు…

బహుశా ఇవన్నీ ట్యూన్లకు రాసిన పదాలేమో… అందుకే తెలుగు పదాలుగా అనిపిస్తాయి గానీ తెలుగు పాటలుగా వినిపించవు అనేెక చోట్ల… కాకపోతే కాస్త నయం, మరీ ఇతర డబ్బింగ్ పాటలుగా నాసిరకంగా లేవు… ట్యూన్‌లో పదాల్ని ఇరికించడంలో కూడా బాగా ప్రయాసపడతాడు వేటూరి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బుల్డోజర్ జస్టిస్… మజ్లిస్ నేతకు దెబ్బ… నేరస్తులకు షెల్టరిస్తే ఇల్లే ఉండదు..!
  • ఎంతసేపూ పూరేకలు విచ్చుకోవడంపైనేనా వేటూరి దృష్టి..!?
  • భారీ మలుపు తిరిగిన ‘అదృశ్య సరస్వతి’… త్రివేణీ సంగమం…!!
  • What is Real Success..? నిజమైన సక్సెస్ స్టోరీ అంటే ఏమిటి..?
  • పాకిస్థాన్‌కు సింధుగండం… ఇండియా జలాల మళ్లింపు షురూ…
  • ఆలీకి ఆది నుంచీ అలవాటే… పిచ్చి కూతలు, ఇప్పుడు తిక్క యాడ్స్…
  • వద్దూవద్దన్నా మద్దతు..! జోసెఫ్ విజయ్ కథే మారిపోయిందిగా..!!
  • చక్రపాణి – నాగిరెడ్డి… బాపు – రమణ… సేమ్ మామ – అప్పు..!
  • బుట్ట నిండా ఇడ్లీలు… రైల్వే స్టేషన్‌లో ఓ పెద్దాయన… ధర కేవలం రూపాయి…
  • మమత తేరుకుంటే… మళ్లీ ఈ దేశభద్రతకే ప్రమాదం… ఎందుకంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions