.
మలయాళ చిత్రాలంటే కొన్నేళ్లుగా మన తెలుగు ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. మరీ ఓటీటీ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక మరింత ఎక్కువగా… ఒకప్పుడు మలయాళ సినిమాలంటే థర్డ్ గ్రేడ్ నాటు మసాలా సరుకు… కానీ ఇప్పుడు అనేక కథన ప్రయోగాలు, ప్రజెంటేషన్ల తీరుకు వేదిక మాలీవుడ్…
గతేడాది వచ్చిన ‘వాలా’ పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే… ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘వాలా 2’ (Vaazha 2: Biopic of a Billion Bros) మలయాళంలో రికార్డులు సృష్టించి, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది… వాలా అంటే అరటిచెట్టు… పనికిమాలిన కొడుకుకన్నా అరటిచెట్టు మేలు అనే సామెత… అదే స్టోరీ లైన్…
Ads
కథా నేపథ్యం… మొదటి భాగంలోలాగే ఇందులో కూడా నలుగురు కుర్రాళ్ల కథే ఇది… చదువు అబ్బక, అల్లరి పనులతో తల్లిదండ్రులకు తలనొప్పిగా మారిన హషీర్, అలెన్, అజిన్, వినాయక్ అనే నలుగురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది…. కాలేజీలో గొడవలు, ఇంట్లో తిట్లు… ఇలా సాగుతున్న వీరి జీవితంలోకి ఒక పోలీస్ ఆఫీసర్ ప్రవేశించాక ఎలాంటి మార్పులు వచ్చాయి…? అసలు వీరు మారతారా లేదా…? అన్నదే ఈ సినిమా అసలు కథ….
ఎలా ఉందంటే….
-
నవ్వుల విందు…: సినిమా మొదటి భాగం అంతా ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది…. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్స్, కాలేజీలో టీచర్లకు, ఈ కుర్రాళ్లకు మధ్య జరిగే సన్నివేశాలు మరీ పొట్ట చెక్కలయ్యేలా కాదు గానీ, నవ్విస్తాయి….
-
ఎమోషనల్ టచ్…: సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది…. కేవలం అల్లరి మాత్రమే కాకుండా, అన్నదమ్ముల మధ్య అనుబంధం, విదేశాలకు వెళ్ళిన యువత పడే కష్టాలను దర్శకుడు చాలా హృద్యంగా చూపించారు…
-
నేచురల్ యాక్టింగ్…: ఇందులో నటించిన నలుగురు కుర్రాళ్లు మలయాళ సోషల్ మీడియా స్టార్స్…. వారు తమ పాత్రల్లో జీవించేశారని చెప్పాలి…. ఎక్కడా నటిస్తున్నట్లు కాకుండా మన పక్కింటి కుర్రాళ్లలానే అనిపిస్తారు…
-
మ్యూజిక్ & విజువల్స్…: కేరళ అందాలను అఖిల్ లైలాసురన్ విజువల్స్ చాలా సహజంగా చూపించాయి…. పాటలు కథలో భాగంగా సాగిపోతుంటాయి….
కానీ మొదటి భాగం ‘వాలా’ చూసిన వారికి కొన్ని సీన్లు మళ్లీ అవే రిపీట్ అయినట్లు అనిపించవచ్చు… అది చూడనివాళ్లకు వోకే… సెకండాఫ్‌లో కొన్ని చోట్ల నెమ్మదించినట్లు అనిపిస్తుంది.
‘వాలా 2’ కేవలం కుర్రాళ్ల కోసం మాత్రమే తీసిన సినిమా కాదు… తమ పిల్లలను అర్థం చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు కూడా చూడాల్సిన చిత్రం…. లాజిక్కులు పక్కన పెట్టి, హాయిగా నవ్వుకుంటూ, చివర్లో ఒక మంచి ఫీల్‌తో బయటకు రావాలనుకుంటే ‘వాలా 2’ పక్కా ఛాయిస్… మలయాళ మ్యాజిక్ మరోసారి పని చేసిందని చెప్పాలి!
తెలుగు డబ్బింగులో జాగ్రత్తలు తీసుకున్నారు, నచ్చింది… రెండేళ్ల క్రిితం వచ్చిన వాలా సూపర్ హిట్, ఇదీ మలయాళంలో 200 కోట్ల వసూళ్లు సాధించింది… కారణం, ఆ పిల్లల్లో మన చుట్టూ కనిపించే మన పిల్లల్ని చూసుకుంటాం కాబట్టి… స్టార్లు- సూపర్ హీరోయిజాలు, ఐటమ్ సాంగ్స్, రోత కామెడీ పంచులు, దరిద్రపు స్టెప్పులు- పాటలు, బీభత్సమైన బీజీఎం మన్నూమశానం ఏమీ లేవు కాబట్టి..! మీకు అలాంటి ఫక్తు ఫార్ములా తెలుగు సినిమాలే కావాలంటే ఈ సినిమాను అవాయిడ్ చేయండి…
Share this Article