.
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రభుత్వ కార్యాచరణ పూర్తయింది… ఎన్ని సభలు జరిగాయి, ఎన్ని ఫైళ్ల క్లియరెన్స్ జరిగింది, ఎన్ని గ్రామాలు- వార్డులు కవరయ్యాయి వంటి అంకెలు కాదు… ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏమిటి..? అందులో సక్సెసయ్యారా అనేది చూడాలి…
ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినప్పుడు 99 రోజులపాటు నిర్వహించడం సాధ్యమేనా అని అనుమానించారు… వివిధ థీమ్‌లతో రూపొందిన ఈ ప్రోగ్రామ్ అమలు చేద్దామనే రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పాడు అధికార యంత్రాంగానికి… తన ఉద్దేశం… రెండున్నరేళ్లయింది… జనంలోకి వెళ్లాలి, ప్రభుత్వాన్ని జనం గడపల ముంగిట్లోకి తీసుకుపోవాలి…
Ads
జనం నుంచి ఫీడ్ బ్యాక్ కావాలి… ప్రభుత్వపరంగా ఓ యాక్టివిటీ నిరంతరాయంగా మూడు నెలలు నడవాలి… తద్వారా ప్రభుత్వ పథకాలకు పాజిటివ్ ప్రచారం ఆటోమేటిక్‌గా వస్తుంది… చిన్నాచితకా జనం సమస్యలుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమక్షంలో అక్కడే సెటిలైపోవాలి… ప్రభుత్వంపై ఎంతోకొంత ఏర్పడే నెగెటివ్ వైబ్స్‌ను బ్రేక్ చేయాలి…
ఇది ఆలోచించినప్పుడే బీఆర్ఎస్ నుంచి ఉద్దేశపూర్వక అడ్డంకుల్ని కూడా రేవంత్ రెడ్డి ఎక్స్‌పెక్ట్ చేశాడు… ఐనాసరే, ఆ పార్టీ కేడర్‌ను జనం ముందే ఎక్స్‌పోజ్ చేద్దామనుకుని, ప్రోగ్రాం నిర్వహించాల్సిందేనని చెప్పాడు… విచిత్రంగా బీఆర్ఎస్ ఈ కోణంలో కూడా ఎక్కడా సక్సెస్ కాలేదు…
మొన్న బాల్క సుమన్ చెప్పాడు కదా… రైతుల ఆందోళన చేపడదామంటే నలుగురైదుగురు రైతులు, రచ్చ చేయడానికి 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అని… ఎస్, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, కేటీఆర్ ప్రెస్‌మీట్లు, ట్వీట్లు, నోట్లు తప్ప జనం నుంచి పెద్దగా స్పందన లేదు… అది వాళ్లకూ అర్థమవుతోంది… ప్రభుత్వ వ్యతిరేకత పెంచడానికి ఏదేదో నానా ప్రయాస పడుతున్నారు గానీ… అధికారగణం ఎంచక్కా, సాఫీగా ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను పూర్తి చేసేసింది…
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగింది… అమలు ముఖ్యాంశాలు…
– 12,758 గ్రామసభలు, 3,175 వార్డు సభలు… 15 లక్షల ప్రజలు పాల్గొన్నారని ప్రభుత్వ లెక్క.
– రాష్ట్రవ్యాప్తంగా 1,06,598 పెండింగ్ ఫైళ్లను పరిష్కరించారు…
– రోడ్డు భద్రత– అరైవ్ అలైవ్ కార్యక్రమంలో 4,512 గ్రామ రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేశారు.
– 393 ప్రమాదకర జంక్షన్లు, 548 బ్లాక్‌స్పాట్లు గుర్తించి తక్షణ చర్యలు చేపట్టారు. 519 కంటి పరీక్షా శిబిరాల్లో 16,079 డ్రైవర్లను పరీక్షించగా 4,863 మందికి దృష్టి సమస్యలు గుర్తించారు. గోల్డెన్ అవర్, హెల్మెట్, సీట్‌బెల్ట్, మద్యం సేవించి డ్రైవింగ్ నివారణపై విస్తృత ప్రచారం జరిగింది.
– సంక్షేమ వారంలో 1,574 సంక్షేమ వసతి గృహాల్లో తనిఖీలు జరిగాయి.
– చైల్డ్ సేఫ్టీ, సే నో టు డ్రగ్స్ వారంలో షీ టీమ్స్, ఏహెచ్‌టీయూ, భరోసా కేంద్రాల ద్వారా 1,702 అవగాహన సదస్సులు నిర్వహించారు.
– 5కే మారథాన్, యోగా, జుంబా సెషన్లు, యూత్ పార్లమెంట్‌లు, పర్యాటక క్లబ్‌లు, పరిశుభ్రత డ్రైవ్‌లు, జాబ్ మేళాలు నిర్వహించారు.
– రూ. 6 కోట్లతో నిర్మించిన 50 అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 27 అంగన్‌వాడీ భవనాలు, 7,292 గ్రామాల్లో స్త్రీ శక్తి భవనాలు, 131 ఫుడ్ గ్రెయిన్ గోదాములు, 577 లైవ్లీ హుడ్ వర్క్ షెడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయి…
Share this Article