.
క్వయిట్ కంట్రాస్టు… కేవలం $750,000 (సుమారు ₹6.25 కోట్లు) బడ్జెట్‌తో తీసిన హారర్ చిత్రం ‘అబ్సెషన్’ (Obsession) బాక్సాఫీస్ వద్ద ఏకంగా $286 మిలియన్లు (సుమారు ₹2,400 కోట్లకు పైగా) వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది… 400 రెట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టిన ఇలాంటి సినిమా పక్కన, మన దేశంలో ఎంతో స్ఫూర్తినిచ్చే నిజమైన కథతో వచ్చిన ‘భారత్ భాగ్య విధాత’ చతికిలపడటం నిజంగా ప్రేక్షకుడి మూడ్ ఎప్పుడూ ఎవరికీ అర్థం కాదనడానికి నిదర్శనం…
‘అబ్సెషన్’ అద్భుత విజయానికి కారణాలు చాలా ఉండొచ్చు… కొత్త తరం (Gen Z) ప్రేక్షకులను ఆకట్టుకునేలా “జాగ్రత్త, మీ కోరికలే మీకు శాపంగా మారవచ్చు” అనే సరికొత్త సైకలాజికల్ హారర్ పాయింట్ ఓ ప్రధాన కారణం కావచ్చు… కానీ ‘భారత్ భాగ్య విధాత’ సినిమా కూడా బాగానే ఉంది… ఇది చరిత్ర… హ్యూమన్ యాంగిల్ ఉంది… ఓ స్పూర్తిదాయక కథ… నిజం చెప్పాలంటే కంగనా రనౌత్ కూడా బాగా చేసింది…
Ads
ఐతే కంగనా రనౌత్‌పై ఉన్న తీవ్రమైన నెగెటివిటీ ఈ సినిమాను భారీగా దెబ్బతీసినట్టుంది… ఓవర్ డోస్ కంటెంట్… 26/11 ముంబై దాడుల నేపథ్యంలో ఇప్పటికే ‘మేజర్’, ‘ది ఎటాక్స్ ఆఫ్ 26/11’ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి… కాబట్టి కథలో ఎంత స్ఫూర్తి ఉన్నా ప్రేక్షకులకు అది కొత్తగా అనిపించలేదు… సినిమా రంగంలో ఎంత పెద్ద సందేశం ఉన్నా, దానికి ప్రేక్షకుల మద్దతు (మౌత్ టాక్), సరైన సమయం (టైమింగ్), నటీనటుల ఇమేజ్ ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈ రెండు సినిమాలే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ!
‘భారత్ భాగ్య విధాత’ (Bharat Bhhagya Viddhaata) విషయానికి వద్దాం… ముంబై మీద టెర్రర్ అటాక్ సమయంలో… కామా హాస్పిటల్‌లో దాదాపు 400 మంది రోగులను, గర్భిణులను రక్షించడానికి ప్రాణాలకు తెగించిన 15 మంది నర్సులు, వైద్య సిబ్బంది ప్రదర్శించిన నిస్వార్థ ధైర్యసాహసాలకు ఇది నిజమైన నివాళి… భయం, బాధ్యత, ధైర్యం కలబోసిన కంగనా పాత్ర అందరినీ కదిలిస్తుంది. గిరిజా ఓక్, స్మితా తాంబే తదితరులు ఆసుపత్రి సిబ్బందిగా కీలక పాత్రల్లో జీవించారు…
ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లో (వీకెండ్) కేవలం ₹2.45 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే సాధించి బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది… మొదటి మూడు రోజుల (ఫస్ట్ వీకెండ్) మొత్తం వసూళ్లు కూడా కేవలం ₹4.03 కోట్లు మాత్రమే నమోదయ్యాయి… ఆఫర్లు ఉన్నా పెరగని ఆదరణ… శనివారం నాడు ప్రేక్షకుల కోసం ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ (BOGO) ఆఫర్ పెట్టినప్పటికీ థియేటర్లలో జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు…
ఆదివారం నాటికి ఈ సినిమా థియేటర్ షోల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది… హర్యానా ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను మినహాయింపు (టాక్స్ ఫ్రీ) ఇచ్చినప్పటికీ, అది వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది…
కంగనా రనౌత్ వ్యక్తిగత, రాజకీయ వివాదాలు, ఆమెపై ఉన్న నెగెటివిటీ ఆమె సినిమాల బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి… ‘తలైవి’ సినిమా నుండి ఆమె నటించిన దాదాపు అన్ని చిత్రాలు వరుసగా పరాజయం పాలయ్యాయి… నటిగా ఆమె ప్రతిభను ఎవరూ శంకించనప్పటికీ, ఆమె సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ కూడా రాకపోవడానికి ఈ నెగెటివిటీ ఒక ముఖ్య కారణం కావచ్చు…
ఆమె గత చిత్రాల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే… వరుస ఫ్లాపుల పరంపర…
తలైవి (Thalaivii – 2021): జయలలిత బయోపిక్‌గా వచ్చిన ఈ సినిమాకు మంచి సమీక్షలు వచ్చాయి. కానీ, మల్టీప్లెక్స్ థియేటర్ల వివాదాలు, కరోనా పరిస్థితుల వల్ల బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.
ధాకడ్ (Dhaakad – 2022): ఇది మరీ దారుణమైన ఫ్లాప్‌గా మిగిలింది. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ యాక్షన్ సినిమా కనీస వసూళ్లు కూడా సాధించలేకపోయింది. కొన్ని థియేటర్లలో సింగిల్ డిజిట్ టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
తేజస్ (Tejas – 2023): ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో కంగన నటించిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను అస్సలు ఆకట్టుకోలేకపోయింది. మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
ఎమర్జెన్సీ (Emergency – 2025): ఇందిరా పాత్రలో కంగన స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. అనేక వివాదాలు, సెన్సార్ ఆలస్యం దాటుకుని జనవరి 2025లో విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద కేవలం ₹21.75 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి ‘బాక్సాఫీస్ బాంబ్’ (పెద్ద ఫ్లాప్) గా నిలిచింది. ‘భారత్ భాగ్య విధాత’ కూడా అదే బాటలో పయనిస్తోంది…
Share this Article