Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ సీఎంకు ముందే ఎలా తెలుసు..? ఇదంతా ముందస్తు ప్లానేనా..!

June 10, 2026 by M S R

.

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామం కాంగ్రెస్ పార్టీని షాక్‌కు గురిచేసింది… నిజమే… తప్పదు కాబట్టి ఎఐసీసీ వేణుగోపాల్ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దాకా అందరూ దీన్ని బీజేపీ కుట్రగా ఖండించారు, తప్పదు, సహజమే… పైగా ఇక్కడ బీజేపీ ఏదో దొంగాట ఆడిందనే సందేహాలు కాంగ్రెస్‌లో వ్యక్తమవుతున్నాయి…

అదేమిటో చెప్పుకుందాం… మధ్యప్రదేశ్ అసెంబ్లీ బలాబలాలను బట్టి పరిశీలిస్తే… బీజేపీకి రెండు రాజ్యసభ స్థానాలు ఖాయమని, మూడో స్థానం కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌కు సులభంగా దక్కుతుందని అందరూ భావించారు…

Ads

ఎందుకైనా మంచిదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగుళూరు క్యాంపుకి తరలించారు… కానీ 8 లేదా 9 మంది ఆ క్యాంపుకి వెళ్లలేదు… అక్కడే డౌటనుమానం పొడసూపింది అందరికీ… దీనికి తగినట్టే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ముందుగానే చేసిన వ్యాఖ్యలున్నాయి… తనకు రెండు సీట్లకే సరిపోయే బలం ఉన్నప్పుడు మూడో అభ్యర్థికి ఎందుకు పెట్టింది బీజేపీ..?

ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దించడంపై… పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం మరింత ఆశ్చర్యపరిచింది….  “బీజేపీ ముగ్గురు అభ్యర్థులూ గెలుస్తారు…” (కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి మూడో సీటు గెలవవచ్చులే అనుకుందా బీజేపీ..?)

ఆ సమయంలో ఆ వ్యాఖ్యను చాలామంది అదొక పొలిటికల్ కామెంటుగా మాత్రమే భావించారు… ఎందుకంటే మ్యాథ్స్ ప్రకారం మూడో సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాల్సిందే… కానీ అసలు రాజకీయ మలుపు అక్కడ కాదు… తెలంగాణ వైపు నుంచి, అంటే తను ఏ రాష్ట్రానికి పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నదో ఆ రాష్ట్రం నుంచి వచ్చింది ముప్పు…

ఆమె నామినేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి… తెలంగాణలో తనపై పెండింగ్‌లో ఉన్న ఒక క్రిమినల్ కేసు వివరాలను నామినేషన్ పత్రాల్లో పూర్తిగా వెల్లడించలేదనేది ఆరోపణ…. తెలంగాణ బీజేపీ నేతలు ఎవరో పక్కాగా ఆ కేసు వివరాల్ని మధ్యప్రదేశ్ బీజేపీకి పంపిస్తే, వాళ్లు మరింత పక్కాగా రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఫిర్యాదు చేశారంటున్నారు, ఆ ఆధారాలతో…। ఈ అభ్యంతరాలను పరిశీలించిన ఎన్నికల అధికారులు ఆమె నామినేషన్‌ను తిరస్కరించారట… దాంతో కాంగ్రెస్‌కు పోటీ చేసే అభ్యర్థే లేకుండా పోయింది… ఖేల్ ఖతం…

కానీ తెలంగాణలో ఆమెపై ఏ క్రిమినల్ కేసూ లేదని ప్రభుత్వం చెబుతోంది… మరి తెర వెనుక ఏం జరిగింది..? అఫ్‌కోర్స్, బీజేపీ అంటే అదేమైనా అహోబిలం మఠమా..? అదీ రాజకీయ పార్ఠీయే కదా… అందుకే అసలు ఏం జరిగిందనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది… నామినేషన్ తిరస్కరణతో ఇక బీజేపీ ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు… ఇక్కడే రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచిన అంశం ఉంది…

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు ముందే మోహన్ యాదవ్ మూడో సీటు కూడా బీజేపీదేనని అంత ధీమాగా ఎలా ప్రకటించాడు…? అది కేవలం ఆత్మవిశ్వాసమా? లేక రాజకీయ పరిణామాలపై ముందస్తు అవగాహనా? ఇంకేదైనా ముందస్తు వ్యూహం అమలు చేశారా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..!! కాంగ్రెస్ నుంచే ఆమె కేసు వివరాలు సేకరించామని అక్కడి బీజేపీ ముఖ్యులు చెప్పడం కేవలం డైవర్షన్, భేదోపాయం అనిపిస్తోంది…

అసలు ఏ నేరారోపణలూ లేకుండా… కేసులు లేకుండా… కేవలం ఒక కోర్టు వచ్చిన నోటీసుల్ని ఆధారంగా చేసుకుని, దాన్ని తప్పుగా నిర్ధారించి రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్ తిరస్కరించడం కూడా ఏదైనా బీజేపీ ప్లాన్‌లో భాగమా..? ఇంకాస్త వివరంగా మరో కథనంలో చెప్పుకుందాం…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగ్ గీతం – బోలెడు బ్లండర్స్, అది ఎక్కడెక్కడ దెబ్బతిన్నదంటే..?
  • కాళ్లల్లో కట్టెలు – ఆత్మరక్షణలో కిషన్‌రెడ్డి – తేలిపోయిన పేలవ వివరణ
  • BRS + Janasena + BJP … తెలంగాణ ద్వేషి పవన్ గోకుతూనే ఉన్నాడు…
  • అంతటి సిల్క్ సయ్యా అనడిగితే… నై అనే బావమరిది ఎవడుంటాడు..?
  • అనుకున్నదే – రక్తికట్టని ‘సింగ్ గీతం’ – మరీ దయనీయం వసూళ్లు
  • A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు
  • రాజకీయ కలకలం – ఠాక్రేకు మరో భంగపాటు? – జార్ఖండ్‌లో మరో ఘట్టం
  • BJD — పట్నాయక్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం — వారసుల్లేరు, నాయకుల్లేరు
  • Pepsi Blunder — ఓ మార్కెటింగ్ తొందరపాటు — దేశమంతా అల్లర్లు
  • ఆరుట్ల స్కూల్ — ప్రతి సర్కారు బడి ఇలా మారిపోతే ఎంత బాగుండు..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions