Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మెట్రో విస్తరణపై కేసీయార్ స్క్రిప్టు – రేవంత్‌రెడ్డి కాళ్లల్లో కిషన్‌రెడ్డి కట్టెలు..!!

June 15, 2026 by M S R

.

ఖుల్లంఖుల్లా… రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని, కేటీయార్‌ను కలిపేసి అటాక్ చేస్తున్నాడు… కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భావనతో మెట్రో-2 దశకు ఎలా అడ్డుపడుతున్నారో అంకెలతో సహా వివరించాడు ప్రెస్‌మీట్‌లో…

తుమ్మిడిహెట్టి బరాజ్ దగ్గర నుంచి మెట్రో-2 దాకా… రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల్ని కలిసి విజ్ఞప్తులు చేయడం, తరువాత కిషన్ రెడ్డి వెళ్లి పుల్లలు పెట్టడం రివాజు అయిపోయిందట… సీరియస్ విమర్శే… నిజానికి తను ఈ ఆరోపణలు  చేసేకొద్దీ… అసలు దానికి వివరణ ఇవ్వకుండా ‘నన్నెవడూ టచ్ చేయలేడు’ వంటి అనవసర, అసందర్భ ప్రకటలు చేస్తున్నాడు తప్ప కిషన్ రెడ్డి సబ్జెక్టులోకి మాత్రం రావడం లేదు…

Ads

పైగా అసెంబ్లీని రద్దు చేయి, ఎన్నికలకు మేం సిద్ధం అంటూ రఘునందన్ రావుతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాడు.,. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదేళ్ల మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు… అదీ మరిచిపోతే ఎలా..? పైగా రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నది కేటీయార్- కిషన్ రెడ్డి అక్రమ సంబంధం గురించి… తను స్ట్రెయిటుగా చెబుతున్నాడు…

అహ్మదాబాద్ మెట్రోకు పర్మిషన్ ఇస్తారు, విశాఖపట్నం మెట్రోకు ఇస్తారు… కానీ హైదరాబాదు మెట్రో విస్తరణకు మాత్రం మోకాలడ్డుతున్నారు… రఘునందన్ సవాల్ విసిరాడు కదా, రేవంత్ రెడ్డి సై అన్నాడు… కేంద్రంలో మోడీని సిద్దపడతాడా, మేమూ రెడీ అన్నాడు…

కిషన్ రెడ్డి- కేసీయార్ బంధం గురించి ఎప్పటి నుంచో ప్రచారం ఉన్నదే… పేరుకు అమిత్ షా ఎవరితోనూ వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదు అంటాడు… కానీ కిషన్ రెడ్డి అండ్ బ్యాచ్ అర్జెంటుగా బీఆర్ఎస్‌తో పొత్తో, అవగాహనో, విలీనమో జరిగిపోవాలని తహతహలాడుతున్నాడట… సో, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మైలేజీ రాకుండా కిషన్ రెడ్డే సైంధవ పాత్ర పోషిస్తున్నాడని, ఇది కుట్ర అనీ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు…

నిజానికి మెట్రోపై ఆది నుంచీ కేసీయార్‌ది అనుమానాస్పద వైఖరే… ముందే చారిత్రక కట్టడాల రక్షణ పేరిట, అండర్ గ్రౌండ్ లైన్ పేరిట అడ్డుపడి… తరువాత ‘ఏం ఒప్పందం’ కుదిరిందో ఇక మెట్రో పనులు కదిలాయి… కానీ అప్పటికే మూడేళ్లు జాప్యం… 15 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 22 వేల కోట్లకు చేరింది… ప్రాజెక్టు ఆలస్యం, కోవిడ్ ప్రభావంతో ఈ ఎల్అండ్‌టీ నష్టాల్లో కూరుకుపోయింది…

పదేళ్లు మెట్రో విస్తరణపై కేసీయార్ ఏమాత్రం ఆలోచించలేదు… దీంతో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో 9 వ స్థానానికి పడిపోయింది… మెట్రో విస్తరణను రేవంత్ రెడ్డి ఆలోచిస్తే… మెట్రో అంగీకరించ లేదు… మొదటి దశ యాజమాన్యమే రెండో దశ కట్టాలని కేంద్రం చెప్పింది… దీంతో రేవంత్ రెడ్డి అప్పుల భారానికి సిద్ధపడీ మొదటి దశను టేకోవర్ చేశాడు…

30 వేల కోట్ల మెట్రోని 15 వేల కోట్లకు కొనేలా ఒప్పందం కుదిరింది… రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు ఐఆర్ఎఫ్‌సీ రుణం ఇచ్చేలా అంగీకారం కుదిరింది… 13,600 కోట్లు 4 శాతం వడ్డీకి జపాన్ సంస్థతో అప్పు తీసుకొచ్చారు, ఇది IRFC నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కావాల్సి ఉంది… కానీ కిషన్ రెడ్డి మే 20 న ఖట్టర్ ను, 21 న అశ్వినీ వైష్ణవ్ ను కలిసి ఇవ్వొద్దని చెప్పాడని రేవంత్ రెడ్డి ఆరోపణ…

‘‘మీకు కష్టమనుకుంటే మీ 50 శాతం భాగస్వామ్యం అవసరం లేదు, మీరు NOC ఇవ్వండి… మేమే పూర్తిగా భరించి మెట్రో విస్తరణ చేసుకుంటాం… నలుగురు బీజేపీ ఎంపీలున్న ప్రాంతంలో మెట్రో విస్తరణ మీకెందుకు ఇష్టం లేదు..?’’ ఇదీ కిషన్ రెడ్డిపై సీఎం స్ట్రెయిట్ ఆరోపణ…

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎంపీలు, నాయకులు ఫుల్ డిఫెన్సులో పడిపోయారు..!! ఈ కొర్రీలు, కాళ్లల్లో కట్టెలు పెట్టడమేనా మోదీ చెప్పిన ‘‘కలిసి రండి, అభివృద్ధి చేసుకుందాం’’ అని మోడీ పిలుపునిచ్చింది..!!

అవునూ, జపాన్ నుంచి వచ్చిన ఐఆర్ఎఫ్‌సీ నిధులను ఎవరు చెల్లించాలి, వడ్డీలు ఎవరు కట్టాలి కిషన్ రెడ్డి సాబ్..?! ఓహ్, అదీ కేసీయార్‌ను అడిగాకే చెప్పాలా..?! చివరగా… రేవంత్ రెడ్డి ఓ మాటన్నాడు… ‘‘రేపు కేంద్ర కేబినెట్‌ నుంచి కిషన్‌రెడ్డిని తీసేసి ఈటలను మంత్రిని చేస్తే, ఆయన్నే అడుగుతాం… కిషన్‌రెడ్డి జోలికి రాను, రాను’’..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బాలమురళి పాడేది అసలు సంగీతమే కాదు- హైకోర్టులో ఓ కేసు …
  • ఎగిసిన రంగుల కెరటాలు కొన్ని విరిగిపడటం… స్వయంకృతాలే..!
  • 5 కోట్ల బంగారు రామచరితమానస్ – అయోధ్య గుడిలో మాయం !
  • కన్నెపల్లి పంపులపై కేటీయార్ వితండవాదం – ఇవిగో అసలు నిజాలు…
  • మూడు రాచకుటుంబాల వారసత్వం – ఒక్క వీడియోతో కెరీర్ కకావికలం
  • FIFA 2026 – అనూహ్య ఫలితాలు – అంచనాల్లో తేడాలే అసలు మజా!!
  • I will find you – గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ –
  • OTT కంటెంటుపైనా ‘కత్తెర’ – జీ5 నుంచి ఓ సినిమా మొత్తం లేపేశారు!!
  • ఆరుగురూ ఆరుగురే! అసలు జాతీయ ఉత్తమ అవార్డు విజేత ఎవరో!!
  • రావణ్‌పై రాజద్రోహం సెక్షన్? ప్రకాశ్‌రాజ్‌నూ బుక్ చేస్తారా?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions