పార్ధసారధి పోట్లూరి ……. మధ్యప్రాచ్యం మంట! పార్ట్ -6……. అమెరికా మరో క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ని తూర్పు మధ్యధరా సముద్రంలోకి పంపింది!ఇరాన్ కనుక హమాస్ కి మద్దతుగా దిగితే ఎదుర్కోవడానికి ! So! మధ్యధరా సముద్రం దాదాపుగా అమెరికన్ నేవీ పర్యవేక్షణ కిందకి వచ్చినట్లుగా భావించాలి! మరో వైపు మిగిలిన నాటో దేశాలు కూడా తమ డిస్ట్రాయర్స్ , ఫ్రిగేట్స్ ని మధ్యధరా సముద్రంలోకి పంపించాయి ఇజ్రాయెల్ కి మద్దతుగా!
*********************
ఇక రెండు రోజుల క్రితమే పుతిన్ తన ఎయిర్ ఫోర్స్ కి ఆదేశాలు ఇచ్చాడు… MIG-31 లని కింఝాల్ (Kizjhal) హైపర్ సానిక్ యాంటీ షిప్ మిసైళ్లతో అనుసంధానం చేసి నల్ల సముద్రం మీద పహారా కాయమని… ప్రస్తుతం రష్యా దగ్గర ఉన్నది, నాటో దేశాల దగ్గర లేనిదీ ప్రభావవంతమయిన Mig-31 మరియు కింఝాల్ హైపర్ సానిక్ మిసైల్ . కింఝాల్ హైపర్ సానిక్ మిసైల్ పరిధి 2 వేల కిలోమీటర్లు. MIG-31 నల్ల సముద్రం మీద పహారా కాయడం అనేది పెద్దగా ఉపయోగం లేదు కానీ సిరియా తీరంలో Khmeimim airbase రష్యాకి ఉంది. అక్కడ S-400 తో పాటు రష్యన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. అమెరికా కనుక వీటి మీద దాడి చేస్తే ఎదుర్కోవడానికి 24 గంటల పహారా పనికి వస్తుంది, కానీ కింఝాల్ ని అమెరికా కూల్చివేయగలదు.
Ads
*******************
So! మొత్తానికి చైనా ధైర్యం చేసిందా? పుతిన్ అడిగాడు కాబట్టి తన నేవీని పంపించాడు కానీ నిన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ లి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇజ్రాయెల్ కి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంది, కానీ పౌరులకి ప్రాణహాని కలగకుండా చూడాలి అని ప్రకటించాడు!
******************
చైనా U టర్న్?
అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్ రెండు రోజుల పర్యటన కోసం అమెరికా రావాల్సిందిగా వాంగ్ లీ ని కోరిన వెంటనే ఒప్పుకున్నాడు! 26, 27 తేదీలలో అంటే నేడు, రేపు చైనా విదేశాంగ మంత్రి అమెరికా పర్యటనలో ఉండి బ్లింకెన్, జో బిడెన్ లతో చర్చలు జరపబోతున్నాడు అన్నమాట! వెరసి పుతిన్ పిచ్చోడు అయ్యాడు. చైనాకి తన అవసరాలు ముఖ్యం కానీ రష్యా, పుతిన్ లు కాదు…
Share this Article