Uma Ilakkiya… ఈమె పేరు కాస్త ట్విట్టర్లో (ఎక్స్) సెర్చ్ చేయండి… ఈ పేరున్న ఆవిడ రాముడిని బూతులు తిడుతున్న వీడియో, వ్యాఖ్యలు చదవొచ్చు, చూడొచ్చు… అంతేనా… దేశోద్దారకుడు స్టాలిన్ నుంచి ఏదో పురస్కారం తీసుకుంటున్న ఫోటోలు, ఆ పక్కనే స్టాలిన్ రాజకీయ వారసుడు, సనాతన ధర్మ విరోధి ఉదయనిధి ప్లస్ ఒకరిద్దరు డీఎంకే పెద్దలూ కనిపిస్తారు…
ఆమె స్వయం ప్రకటిత జర్నలిస్టు కమ్ యాంకర్ కమ్ యాక్టివిస్ట్ కమ్ వాటెవర్… డీఎంకే సన్నిహితురాలు… అదేదో పదవి కూడా ఇచ్చారు ఆమెకు… బాధపడకండి ఆమె మాటలు చదివి… ఆఫ్టరాల్ హిందూ సమాజానికి పరధర్మ సమాజాలకన్నా స్వధర్మంలోనే శత్రువులు ఎక్కువ… ఎందుకంటే, హిందువులు తమ దేవుళ్లను ఎవరేం బూతులు తిట్టినా భరిస్తారు… ప్రపంచంలోకెల్లా అత్యంత సహనశీల సమాజం… పిరికి గొడ్లు అనుకున్నా సరే…
ఒకవైపు గతంలో పరధర్మ పాలకులతో జరిగిన ఆధ్యాత్మిక సాంస్కృతిక మత ప్రతీకల విధ్వంసం నుంచి ఒక ఆత్మాభిమాన సంకేతాన్ని అయోధ్యలో పునరుద్ధరించుకున్న ఉత్సవం జరుగుతుంటే ఇదుగో ఈ పైత్య ప్రకోపాలు మరోవైపు… అసలు దేవుళ్లను చెప్పులతో కొడుతూ ఊరేగించిన సమాజం కదా తమిళనాడు… వాటితో పోలిస్తే ఈమే రాముడి మీద చేసిన వ్యాఖ్యలు చిన్నవే… కానీ పదే పదే ఒక సెక్షన్ మనోభావాల మీద దాడి ఎందుకు జరుగుతోంది..?
Ads
ఆమె ఏమంటున్నదో ఆమె ఖాతాలోనే చూడాలని ప్రయత్నిస్తే కనిపించలేదు… బహుశా డిలిట్ చేయబడిందా.? లేక మరీ పాతదా..? కాకపోతే వేరే ట్వీటర్లు షేర్ చేసుకున్నారు ఆమె వీడియోను…! నువ్వు నాస్తికురాలివా..? వోకే, దానికే కట్టుబడి ఉండు… ఇతర ధర్మాలను అనుసరిస్తావా..? గుడ్, వాటికైనా నిబద్ధతతో కట్టుబడి ఉండు, విశ్వాసిగా ఉండు… కానీ ఇతరులను కించపరచడం ఏమిటి..? ఏ రజినీకాంతో దీన్ని విమర్శిస్తే సంఘి అని ముద్రలేస్తారు… వెక్కిరిస్తారు… అఫ్ కోర్స్, తమిళనాడులో హిందూ దేవుళ్లను ఎంత తిడితే అంత పాపులారిటీ, ఆదరణ…
‘‘రాముడు పెద్ద స్త్రీలోలుడు… హంతకుడు… తాగుబోతు… 1000 మంది స్త్రీలతో సంబంధాలుండేవి… ఉత్త పిరికిగొడ్డు… అందుకే సరయూ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు…’’ ఇదీ ఆమె వ్యాఖ్యానం… దారుణంగా ఉన్నయ్ వ్యాఖ్యలు… అవునూ, ఈ అక్కయ్యకు తెలియదా… ఇదే స్టాలిన్ అమ్మ, ఇదే స్టాలిన్ భార్యలు ఇవే హిందూ దేవుళ్లను ఎందుకు ఆరాధిస్తారు..? ఒక్కసారి వాళ్ల మీద కామెంట్ చేయమ్మా… డీఎంకే మార్క్ ఫత్వాలు, ఎన్ని శిక్షలు జారీ అవుతాయో చూద్దాం…
Share this Article