Aranya Krishna ………. ఆమె నిజంగా మరణించిందా? పూనం పాండే చనిపోయినట్లు ఇవాళ సాయంత్రం నెట్లో వార్త చూశాను. ఆమె మహా నటి కాదు. ఒక శృంగార తార. వీళ్లు వికృత వ్యవస్థకి పుట్టిన సాంస్కృతిక శిశువులే. ఎదుగుదల సమయంలో వ్యవస్థ తమకి ఆఫర్ చేసిన సంస్కృతిని స్వీకరించిన వారే. వ్యక్తిగతంగా తప్పు పట్టడానికి వాళ్లేం దోపిడీదారులు కారు. అందుకే 32 ఏళ్ల వయసులో గర్భాశయ కేన్సర్ తో ఒక బ్లూ స్టార్ చనిపోయినా అది బాధాకరమే.
2011 క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా భారత్ కప్ గెలిస్తే న్యూడ్ షో చేస్తానని ప్రకటించడం ద్వారా ఆమె వెలుగులోకి వచ్చింది. ఆమెలో కెరీర్లో పైకి రావడానికి అవసరమైన సెన్సేషనలిజం, దూకుడూ పుష్కలంగా వున్నాయి. తన భర్త శాం షూట్ చేస్తుండగా అశ్లీల వీడియోస్ చేసింది. ఐతే అతను తనని హింసిస్తున్నాడని కేసు పెట్టి, అతన్ని దూరంగా వుంచి, తన స్వంత టీం ఏర్పాటు చేసుకొని వీడియోస్ చేసేది.
Share this Article
Ads