నేను ఆ డర్టీ పిక్చర్స్‌ను షేర్ చేయదలుచుకోలేదు ఇక్కడ… కానీ రాంగోపాల్ వర్మ చంద్రబాబు అండ్ గ్యాంగు మీద చాలా నీచమైన, కేరక్టర్ అసాసినేషన్ సినిమాలు తీశాడు… అంతకుమించి పిచ్చి పిచ్చి గ్రాఫిక్ బొమ్మలతో సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు…
చెత్తా బొమ్మలు… ఆఫ్టరాల్ రాజకీయ విమర్శగా తీసుకోలేం దాన్ని… గతంలో ఎన్టీయార్ మీద కృష్ణ సినిమాలు తీశాడు… కానీ వ్యక్తిగతంగా కించపరచలేదు… తన రాజకీయ విధానాల్ని, పోకడల్ని విమర్శించాడు… అది జస్ట్, విమర్శ… అందులో తప్పులేదు… (ఐనా సరే ది బ్లడ్ అండ్ బ్రీడ్ పొగరుబోతు ఎన్టీయార్ పాత్ర పోషించిన కోట శ్రీనివాసరావు మీద కాండ్రించి ఉమ్మేశాడు… అది తన సంస్కారం… అది వేరే కథ)
ఇప్పుడు సోషల్ మీడియా ఉన్మాదులు అనలేను గానీ… ఒకరకంగా పరిధులు దాటి ఇంట్లో ఆడవాళ్ల మీద అసభ్యంగా, అశ్లీలంగా, చెత్తా పోస్టులు పెట్టి, శాడిస్టిక్ ఆనందం పొందిన సోషల్ యాక్టివిస్టుల మీద చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉరుముతోంది… వేటాడుతోంది…
Ads
సోకాల్డ్ శుద్ధపూస శ్రీరెడ్డి వంటి పత్తిత్తులు… బాబ్బాలూ క్షమించండి, మీ బాంచెన్, మమ్మల్ని వదిలేయండి అని వీడియోలు పెడుతూ కాళ్లబేరానికి దిగుతోంది… పైవాళ్లు బాగా సంపాదించారు, ఆఫ్టరాల్ మేం ఎంత..? ఆ పెద్ద వాళ్లతో తలబడండి అంటోంది… పిడుగులు కనిపిస్తుంటే ఇదేగా… డర్టీ కేరక్టర్లు…
ఇక్కడ రెండు ప్రశ్నలు… మరి వైసీపీ లేడీస్ మీద, జగన్ కుటుంబసభ్యుల మీద చెత్తా ప్రచారాలు చేసిన వాళ్లు లేరా..? ఎస్, ఉన్నారు… నిజంగా చంద్రబాబుకు క్లీన్ సోషల్ మీడియా మీద సంకల్పశుద్ధి ఉంటే, ఓ రాష్ట్ర చట్టం తెచ్చి, ఎవడు ఆడవాళ్ల మీద అసభ్యంగా కూసినా సరే, లోపలేసేలా చర్యలు తీసుకోవాలి…
ఎస్, యెల్లో మీడియా వైసీసీ ఉన్మాదుల మీద చర్యలు సబబే, ఇంకా కఠినంగా వ్యవహరించాలి, ఎన్‌కౌంటర్ చేయాలి అన్నంతగా వ్యాసాలు, సంపాదకీయాలు రాస్తోంది… మరోవైపు ఓ సీనియర్ జర్నలిస్టు సాక్షిలోె అబ్బే వీళ్లు బెదిరిస్తున్న చట్టాలు, సెక్షన్లు నిలబడవు అని రాసుకొచ్చాడు… మరి నిలబడని సెక్షన్ల మీద ఈ రాతలు దేనికి..?
(ఎస్, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ సోషల్ యాక్టివిస్టులను దాదాపు 300 మంది దాకా అన్‌ఫ్రెండ్ చేశాను నేను… ఆడవాళ్ల మీద అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని… అందులో వంద మందిని బ్లాక్ చేశాను…) సో, కేసులు కాదు… నిజానికి ఈ దుర్మార్గమైన ధోరణికి ఫుల్‌స్టాప్ పడేది కేసులతో కాదు… అందరూ అలాంటి చెత్తా ఖాతాలను బ్లాక్ చేసినప్పుడు…
ఇప్పుడు తాజాగా ఏమిటీ అంటే… మొన్న ఓ సోషల్ మిత్రుడు పోస్టు పెట్టాడు… రాంగోపాలవర్మ అత్యంత నీచంగా సినిమాలు తీయడమే కాదు, సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు చేశాడు, తనపై కేసులు పెట్టే దమ్ముందా అని..?
ఈరోజు వార్త ఏమిటంటే..? ‘‘డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు..! మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదు… ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్టులు చేశారని ఫిర్యాదు… టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు…’’
ఇతర వైసీపీ సోషల్ యాక్టివిస్టులను వేటాడుతున్నట్టే ఈ వర్మనూ వేటాడి లోపలేస్తారా..? తను యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టుకు ఎక్కబోతున్నాడా..? సదరు మేల్ శ్రీరెడ్డి కూడా క్షమించండి బాబోయ్ అని వీడియో రిలీజ్ చేస్తాడా..? చూడాలిక..!!
Share this Article