Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విషాదమే… కానీ ఉన్మాదం… కర్నాటక సర్కారు ఘోర వైఫల్యం…

June 4, 2025 by M S R

.

ఇది అభిమానం కానే కాదు, ఓరకమైన పిచ్చి, ఉన్మాదం… బెంగుళూరులో ఆర్సీబీ ఐపీఎల్ జట్టు విజయోత్సాహం, విజయోత్సవాలు జస్ట్, అబ్సర్డ్… స్టేడియం బయట తొక్కిసలాటలో కనీసం 11 మంది మరణించారనీ, 50 మంది గాయపడ్డారనీ ప్రాథమిక వార్తలు…

అన్నింటికీ మించి అక్కడి సర్కారు దిక్కుమాలినతనం… ఇటీవల కాలంలో సినిమా తారలు, క్రికెటర్ల పట్ల జనంలో అభిమానం నిజంగానే ఓ ఉన్మాద స్థాయిలో పెరిగిపోయింది… అప్పటికప్పుడు సంధ్య థియేటర్ దగ్గర జనం గుమిగూడిన సంఘటన తాలూకు నష్టాలు చూశాం మనం హైదరాబాదులో…

Ads

ఈ స్థితిలో ఈ విజయోత్సవాలకు ఎందుకు అనుమతి ఇచ్చినట్టు..? ఇంకా నయం, భారీ ర్యాలీ అనుకున్నారట… అసలే ట్రాఫిక్ నరకం కనిపించే బెంగుళూరు ఆ ర్యాలీ జరిగితే ఎక్కడిక్కడ స్థంభించిపోయేది… ఐనా ఐపీఎల్ ప్రతి ఏటా నిర్వహించబడేదే కదా… ఇదేమైనా ప్రపంచ కప్పా నాలుగేళ్లకోసారి జరిగి.., అన్ని విదేశీ జట్ల మీద గెలిస్తే సంబరాలు చేసుకున్నా ఓ లెక్క…

డిప్యూటీ సీఎం అంటున్నాడు… జనాన్ని కంట్రోల్ చేయలేనంతగా విరగబడ్డారు, తక్కువ టైమ్ కదా, సరిపడా ఏర్పాట్లు చేయలేకపోయాం, సారీ అట… సీఎం అదే మాట… అసలు ఆర్సీబీని కర్నాటక ప్రభుత్వం ఎందుకు ఓన్ చేసుకోవాలి, సర్కారు ఘనత ఏముంది ఈ విజయంలో..? అందుకే దిక్కుమాలినతనం అనేది…

అసలు కర్నాటకకూ ఈ ఆర్సీబీకి లింక్ ఏముందసలు..? అప్పట్లో కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా జట్టు కాబట్టి, తనది కర్నాటకలోని మంగుళూరు కాబట్టి, తన బీర్ల కంపెనీ ఆఫీసు బెంగుళూరు కాబట్టి, బెంగుళూరు అని పేరు పెట్టుకున్నాడు, అది సరే…

కానీ ఇప్పుడు యునైటెడ్ స్పిరిట్స్‌లో లండన్ మల్టీనేషనల్ మద్యం కంపెనీ Diageo మెజారిటీ వాటాలు… దాదాపు 55 శాతం… అంటే పూర్తి నియంత్రణ హక్కు దానిదే… అనేక దేశాల్లో ఆ కంపెనీ మద్యం ఉత్పత్తి, వ్యాపారం చేస్తుంది… తద్వారా ఆర్సీబీ ఓనర్‌షిప్… ఆఫీసు లండన్… మరి బెంగుళూరుతో దానికేం లింక్..? ఈ నగరంలో దాని లోకల్ ఆఫీసు ఉన్నందుకా..?

సరే, అందులో ప్లేయర్ల సంగతి చెప్పుకుందాం… (గత, ప్రస్తుత)

Virat Kohli… Delhi, India
Faf du Plessis… South Africa
Rajat Patidar… Madhya Pradesh, India
Jitesh Sharma… Haryana, India
Liam Livingstone… England
Krunal Pandya… Baroda, India
Tim David… Singapore
Romario Shepherd… Trinidad and Tobago
Manoj Bhandage… Rajasthan, India
Blessing Muzarabani… Zimbabwe
Josh Hazlewood… Australia
Rasikh Dar… Jammu and Kashmir, India
Suyash Sharma… Uttar Pradesh, India
Nuwan Thushara… Sri Lanka
Bhuvneshwar Kumar… Uttar Pradesh, India
Lungisani Ngidi… South Africa
Abhinandan Singh… Karnataka, India
Mohit Rathee… Haryana, India
Yash Dayal… Uttar Pradesh, India (found in google search)

గతంలో ఆడిన క్రిస్ గేల్, వెస్ట్ ఇండీస్, ఏబీ డివిలీర్స్, దక్షిణాఫ్రికా… ఒక్క అభినందన్ సింగ్ తప్ప ఇంకెవరైనా కన్నడిగులు ఉన్నారా..? మరెందుకు ఇలా కన్నడజనం విరగబడటం… కోహ్లీ, అఫ్‌కోర్స్, తనకు కర్నాటకలోనే కాదు, దేశమంతా కోట్ల అభిమానులు, పాకిస్థాన్ వంటి శతృదేశంలో కూడా…

తను హైదరాబాద్ వచ్చినా ఇలాగే జనం పోటెత్తుతారు… అంతే తప్ప తనేమీ కన్నడిగ కాదు,.. కేవలం జట్టు పేరులో బెంగుళూరు ఉన్నందుకు ఇంతగా కర్నాటక ఓన్ చేసుకోవాలా..? ఐనా ఆఫ్టరాల్ ఐపీఎల్ ట్రోఫీకి ఇంత హంగామా..? ఇంత తొక్కిసలాట..? అక్కడ ఎందరు ప్రాణాలు కోల్పోయినా…. వారి ఉసురు తీసుకున్నది ఖచ్చితంగా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వమే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions