Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోడీ సైప్రస్ ఫోటో వెనుక… శత్రు తుర్కియేకు ఓ స్ట్రాంగ్ వార్నింగ్..!!

June 17, 2025 by M S R

.

మోడీ ఓ బీచ్‌లో కుర్చీ వేసుకుని, కూర్చుంటే… అది ఓ దేశానికి వార్నింగ్ ఇవ్వడం… ఓ సంకేతం ఇవ్వడం… తెలుసు కదా, లక్షద్వీప్ ప్రమోషన్ ప్లస్ మాల్దీవులు కాళ్లబేరానికి రావడం…

ప్రతి దేశాధినేత ఫోటోకు, ట్వీట్‌కు, పలకరింపుకు విశేషం ఉంటుంది… మరీ ప్రత్యేకంగా అంతర్జాతీయ పరిణామాలు, విదేశాంగ నీతి విషయంలో అటు పుల్ల ఇటు కదిలితే దానికో అర్థం ఉంటుంది… ఎవరికి ఏం అర్థం కావాలో అదే అర్థమయ్యే మర్మం ఉంటుంది…

Ads

సైప్రస్ వెళ్లాడు కదా మోడీ… ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారం ఇచ్చారు, ప్రొటోకాల్ మర్యాదలు సరేసరి… కానీ మరో అబ్జర్వేషన్ మిత్రుడు Chiranjeevi Nimmaraju పోస్టులో కనిపించింది… ఇదుగో…



అధిరిపోయింది : టర్కీకి మోది మాస్టర్ స్ట్రోక్ : ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

సైప్రస్ లోని ఉత్తర సైప్రస్ ను కొన్ని దశాబ్దాల క్రితం టర్కీ ఆక్రమించుకుంది. అయితే ఇప్పటికీ ఈ ఉత్తర సైప్రస్ టర్కీ ఆధీనంలోనే ఉంది. దీనితో గత కొంత కాలం నుండి ఈ ఉత్తర సైప్రస్ లో స్వాతంత్రం కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి.

ఇక ఈ టర్కీ ఆధీనంలో ఉన్న ఉత్తర సైప్రస్ కు, సైప్రస్ కు మద్య బఫర్ జోన్ ఉంది. అక్కడే గ్రీన్ లైన్ కూడా ఉంది. అయితే నిన్న మోది గారు ఆ గ్రీన్ లైన్ ను దాటి నేరుగా బఫర్ జోన్ లోకి వెళ్ళిపోయారు. అక్కడి నుండి సైప్రస్ ప్రెసిడెంట్ తో కలిసి ఉత్తర సైప్రస్ కనపడేలా ఫోటో దిగి దానిని టర్కీకి పంపించారుట…

అంటే నువ్వూ నీ తొక్కలో దేశం, మా దేశం విషయంలో వేలు పెట్టావు కాబట్టి, ఇక నీకు ఉత్తర సైప్రస్ విషయంలో చుక్కలు చూపిస్తాను, అవసరమైతే గెరిల్లా పోరాటం చేయిస్తాను అని టర్కీ కు సూటిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు అన్నమాట.

నేను ఇక్కడ గెరిల్లా పోరాటం అని ఎందుకు అన్నాను అంటే ఇంతకు ముందు ఉతర సైప్రస్ లో ఉన్న గెరిల్లాల జెండాను పట్టుకుని మరీ మోది గారు సైప్రస్ లో ఫోటో దిగారు. అంటే ఉత్తర సైప్రస్ గెరిల్లాలకు భారత్ సపోర్టు చేస్తుంది అని అర్ధం అన్న మాట…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రష్మిక, పూజా హెగ్డే, ఐటమ్ సాంగ్… తమన్ భలే కథలు చెబుతాడు!
  • ఈ పిల్లాడిని బలిగొన్నది కేవలం ఆ ఒక్క మార్కేనా? ఓ మథనం అవసరం!!
  • హోటల్ పనివాడుగా మొదలై… స్టార్ హీరోలకు దీటుగా స్టార్ విలన్!
  • విద్యా శాఖ మాత్రం ఇవ్వొద్దుట ! – మంత్రిగా ఉంటే పర్లేదుట !!
  • భక్తి తప్పు కాదు – ఇదుగో ఇలాంటి మూఢ భక్తే ‘మోక్షమార్గం’!
  • ప్చ్… చివరకు ఈ అనంత జ్ఞాన శ్రీరాముడూ చెప్పేవాడయ్యాడు !!
  • హైడ్రా ! తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ రాజకీయ విభాగమా ?!
  • ఇదంతా తెలంగాణ అస్థిత్వ సమస్యా? బీఆర్ఎస్ పార్టీ అస్థిత్వ సమస్యా!?
  • బొద్దింకల పార్టీ ! మీకు తెలియని ఒక అంతర్జాతీయ పొలిటికల్ మిస్టరీ !!
  • అసలు సమస్య ‘నీట్’ను దాటి… మన వైద్య వ్యవస్థలోనే ‘రోగాలు’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions