.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, మరణాలు… అల్లు అర్జున్ బాధ్యతారహిత దుర్ఘటన, కేసు, అరెస్టు తరువాత ఏం జరిగింది..? అర్జున్‌కే ఏదో నష్టం జరిగినట్టు, తనే బాధితుడైనట్టుగా ఇండస్ట్రీ మొత్తం తన ఇంటికి ఓదార్పు యాత్ర నిర్వహించింది…
అది కాదు వార్త… సినిమా ఇండస్ట్రీ అంటే అంతే… మెగా కుటుంబం చల్లనిచూపు కోసం పరామర్శలకు పోటీపడ్డారు సినిమా ప్రముఖులు.., నాగార్జున ఎన్ కబ్జా కనెక్షన్షన్ సెంటర్ కూల్చేసి, అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి.., తెలంగాణ ప్రభుత్వం వెండి తెర వేల్పులు అయితేనేం, మబ్బుల్లో చుక్కలు అయితేనేం, సర్కారే అల్టిమేట్, ఎవరికీ భయపడేది లేదు అనే స్థిరధోరణిని కనబర్చింది… జనం మెచ్చుకున్నారు…
Ads
ఫ్యాన్స్ వేలాదిగా గుమిగూడి, ప్రమాదాలకు కారణమవుతున్న బహిరంగ ప్రిరిలీజ్ ఫంక్షన్లు వద్దన్నారు… టికెట్ రేట్లపై నియంత్రణ అన్నారు… నో మోర్ ప్రీమియర్ షోలు అన్నారు… అడ్డగోలు షోలూ కుదరదు పొమ్మన్నారు… ప్రేక్షకుల దోపిడీకి ఇక చెల్లు అన్నారు… గుడ్ స్పిరిట్… కానీ ఏమైంది..?
మళ్లీ యథాస్థితికి వచ్చింది… థియేటర్ల దోపిడీ ఏమీ ఆగలేదు… ఇప్పుడు హరిహర వీరమల్లు విషయంలో రేట్ల పెంపుకి ఓకేనట… ప్రీమియర్లకూ ఓకేనట… క్లోజ్డ్ కంపౌండ్‌లోనే చేసినా, ప్రిరిలీజుకూ పర్మిషన్ గ్రాంటెడ్… ఏమీ మారలేదు… తెలంగాణ ప్రభుత్వమే తన స్పిరిట్ కోల్పోయింది…
సో వాట్..? పవన్ కల్యాణ్ పక్క రాష్ట్రపు ఉపముఖ్యమంత్రి… అయితేనేం..? తెలంగాణ ప్రభుత్వం సాగిలబడాలా అనే ప్రశ్న జనం నుంచి వస్తోంది… మీకు ప్రత్యేకంగా ఏ వెసులుబాట్లూ ఇవ్వలేం అని ఈ ప్రభుత్వం ఎందుకు కరాఖండీగా చెప్పలేకపోయింది..? ఎందుకు భయం..?
రాత్రికిరాత్రి పవన్ కల్యాణ్ టాలీవుడ్‌ను ఏ అమరావతికో, ఏ విశాఖకో పట్టుకెళ్లిపోతాడా..? అది సాధ్యమేనా..? అనవసర భయాలు, వెనుకంజలు… పదే పదే ప్రతిపక్షం రేవంత్ రెడ్డి, చంద్రబాబు బంధాన్ని చూపిస్తూ, అది తెలంగాణ వ్యతిరేక బంధం అని ముద్రలు వేస్తూనే ఉంటుంది… ఆ విమర్శలకు బలాన్ని చేకూర్చే ఇలాంటి నిర్ణయాలు దేనికి సీఎం సాబ్..?!
పవన్ కల్యాణ్ ఏపీ పొలిటిషియన్… పవర్‌లో ఉన్నాడు… నిజానికి అక్కడే భారీగా ప్రిరిలీజ్ ఫంక్షన్ పెడతారని అనుకున్నారు… ఎందుకో ఆ ఆలోచన విరమించుకుని, హైదరాబాద్‌లో సింపుల్‌గా లాగించేశారు.., ఏపీలో తనదే పవర్ కాబట్టి… టికెట్ రేట్ల అడ్డగోలు పెంపు, ప్రీమియర్లు ఎట్సెట్రా ఏవైనా తనకు చిటికెలో పని… పైగా సినిమా మంత్రి కూడా తన పార్టీయే… ఇలాంటి విషయాల్లో చంద్రబాబు వేళ్లు పెట్టడు… కానీ మనకెందుకు అవన్నీ అనేదే ప్రశ్న… కోమటిరెడ్డి, దిల్‌రాజు ఐనా క్లారిటీ ఇస్తారంటారా..?!
Share this Article