Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వరల్డ్ వార్ సన్నాహాలు షురూ..! ఆపరేషన్ సిందూర్ ఆపించింది ఎవరు..?!

September 20, 2025 by M S R

.

Pardha Saradhi Potluri ………. మూడో ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు – part 1
ఆపరేషన్ సిందూర్ కి విరామం!
ఎవరు మధ్యవర్తిత్వం వహించారు?
యాసిర్ అల్ రూమయ్యాన్ – Yasir al Rumayyan!

రుమయ్యాన్ సౌదీ అరేబియాకి చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ( PIF Public Investment Fund) కి గవర్నర్. తను సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కి కుడి భుజం!
సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద 650 బిలియన్ డాలర్లని వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టింది తమ దేశ భవిష్యత్ అవసరాల కోసం. సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సూచనలమేరకు  రుమయ్యాన్ 650 బిలియన్ డాలర్ల పెట్టుబడులని పర్యవేక్షిస్తూ ఉంటాడు.

Ads

MBS (Mohammad Bin Salman) కుడి భుజం యాసిర్ అల్ రుమయ్యాన్ మాట అంటే అమెరికా, యూరపులతో పాటు పాకిస్తాన్ లో కూడా చెల్లుబాటు అవుతుంది. యాసిర్ ఏదన్నా పని కావాలని అడిగితే అది MBS అడుగుతున్నట్లుగానే భావిస్తాయి అన్ని దేశాలు.

యాసిర్ అల్ రుమయ్యాన్ - డోనాల్డ్ ట్రంప్- ఎలాన్ మస్క్!
గత సంవత్సరం ట్రంప్ గెలిచినట్లు ప్రకటించగానే రుమయ్యాన్ జెడ్డా నుండి అమెరికా వెళ్ళాడు ట్రంప్ ని కలిసి అభినందనలు తెలపడం కోసం!
కానీ ట్రంప్ నేరుగా రుమయ్యాన్ కి అపాయింట్మెంట్ ఇవ్వకుండా WWE ( World Wrestling Entertainment) ప్రీమియర్ షోలో కలుద్దాం అంటూ సందేశం పంపించాడు.

సౌదీ అరబ్బులు సదరు రెస్లింగ్ షోలకి వెళ్లడం అనేది సర్వసాధారణం కాబట్టి అక్కడ యాదృచ్చికంగా కలిసినట్లుగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఎవరూ ఏమీ అనుకోరు.
WWE షోలో రుమయ్యాన్ ట్రంప్ పక్కనే కూర్చుని మాట్లాడడం కెమెరా కంటికి చిక్కింది. మధ్యలో ట్రంప్ కూర్చుని ఉంటే, ఒక పక్క యాసిర్, మరో పక్క ఎలాన్ మస్క్ కూర్చున్నారు.
ఆ సమయంలోనే భారత్ అంశం చర్చకి వచ్చింది. అయితే అప్పటికి ట్రంప్ అధ్యక్షుడిగా ఎంపిక అయ్యాడు కానీ ప్రమాణ స్వీకారం చేయలేదు.

trump
**********
యాసిర్ అల్ రూమయ్యాన్ - అసీమ్ మునీర్ లింక్!
మొహమ్మద్ బిన్ సల్మాన్ కి తమ దేశం ఎక్కువ రోజులు చమురు ఎగుమతుల మీద ఆధారపడి మనుగడ సాధించలేదని తెలుసు! అందుకోసమే వివిధ దేశాలలో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాడు.
MBS తరపున పనులు చక్కపెట్టే రూమయ్యాన్ పాకిస్తాన్ ఫెయిల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తో మంచి స్నేహం ఉంది.  మునీర్ ను పాకిస్తాన్ ISI చీఫ్ గా నియమించడం, ఆ తరువాత ఇతర సీనియర్ జెనరల్స్ ని పక్కన పెట్టి, జూనియర్ అయిన ఆసిమ్ మునీర్ ని సైన్యాధ్యక్షుడుగా నియమించడం వెనుక MIB తరపున ఈ యాసిర్ అల్ రూమయ్యాన్ హస్తం ఉంది.

అప్పు కావాల్సిన సమయంలో పాకిస్తాన్ అధికారులు సౌదీ వెళ్లి తెచ్చుకోవడం పరిపాటి! అలాంటిది సౌదీ ప్రిన్స్ MIB ని కాదనగలగే ధైర్యం పాకిస్తాన్ లో ఎవరికి ఉండదు.
ఆసిమ్ మునీర్ ని సైన్యాధ్యక్షుడిగా MIB నిర్ణయించడం వెనుక బలమైన కారణం ఉంది!

MIB బలూచిస్థాన్ లో అరుదైన భూ ఖనిజాలని ( Rare Earth Minerals) గుర్తించి, వాటిని వెలికి తీసి, పాకిస్తాన్ లోనే ప్రాసెస్ చేసి వాటిని ఎగుమతి చేయాలనేదే MIB ప్లాన్!
ఇప్పటికే బలూచిస్థాన్ లో పెట్టుబడులు పెట్టడం, మినరల్స్ గురించి అన్వేషించడం మొదలైంది!
దశల వారీగా మొత్తం 34 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది! అయితే దీనిని 52 బిలియన్ డాల్లర్లకి పెంచితే బాగుంటుందని పాకిస్తాన్ పౌరప్రభుత్వం కోరుతున్నది!

మొత్తం సైనిక జెనరళ్లు తినేస్తే నాయకులకు ఏం మిగులుతుంది కాబట్టి… అంచనా కంటే మరో 20 బిలియన్ల డాలర్లు పెంచితే రాజకీయ నాయకులు కూడా తింటారు. బదులుగా బలూచిస్థాన్ లో ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలు జరగటం లేదని అంతర్జాతీయ వేదికల మీద గట్టిగా చెప్పగలుగుతాం!
బలూచిస్థాన్ లో పనులు సవ్యంగా జరగాలి అంటే దానికి తమ మాట వినే సైన్యాధ్యక్షుడు కావాలి కాబట్టి ఆసిమ్ మునీర్ ని సైన్యాధ్యక్షుడు గా నియమించాడు MBS.

అఫ్కోర్స్! వ్యవహారం చేసేది  రూమయ్యాన్! అందుకే రూమయ్యాన్ తో ఆసిమ్ మునీర్ కి స్నేహం ఏర్పడింది.
బలూచిస్తాన్ లో రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీతకి ఒప్పుకున్నందుకు గాను ఆసిమ్ మునీర్ కి అంతో కొంత ముట్టచెప్పాడు MIB తరుపున రుమయ్యాన్!
MBS ఇచ్చే డాలర్లనే ట్రంప్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టడానికి ఆసిమ్ మునీర్ ని ఒప్పించి, ఏకంగా వైట్ హౌస్ లో ట్రంప్ తో మూడు రోజుల ఆతిధ్యం ఏర్పాటు చేశాడు యాసిర్!

ఆసిమ్ మునీర్ ట్రంప్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టినందుకు గాను బదులుగా పాకిస్తాన్ అధ్యక్షుడిగా చేస్తానని మాట ఇచ్చాడు ట్రంప్! ఇదంతా MBS తరపున యాసిర్ అల్ రుమయ్యాన్ కధ నడిపించాడు!
సౌదీ ప్రిన్స్ MBS మరియు UAE లు గ్యారంటర్లు!

IMF దగ్గర 8 బిలియన్ డాలర్ల లోన్ పెండింగ్ లో ఉంది చాలా కాలంగా. పాకిస్తాన్ క్రెడిట్ హిస్టరీ బాగాలేనందున ఎవరన్నా గ్యారంటీ ఇస్తేనే కానీ అప్పు ఇవ్వలేమని IMF అంటే, సౌదీ, UAE లు గ్యారంటీ ఇచ్చిన తరువాతే IMF లోన్ ఇవ్వడం మొదలు పెట్టింది!

***************
రుమయ్యన్ సౌదీ ప్రిన్స్ మెహమ్మద్ బిన్ సల్మాన్ కి కుడి భజం అని చెప్పడానికి ఇది మరొక కారణం..
ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ కంపెనీ అయిన అరమ్కో (ARAMCO – Arabian American Oil Company) aramco కి చైర్మన్ గా వ్యవహారిస్తున్నాడు అల్ రుమయ్యన్!

రుమయ్యాన్ సౌదీలోని అతి పెద్ద మైనింగ్ కంపెనీ అయిన మా అదేన్ ( Ma’ aden) కి కూడా చైర్మన్!
Ma’aden మైనింగ్ కంపెనీ ప్రస్తుతం బలూచిస్థాన్ లో సహజవాయువు, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం అన్వేషణ చేస్తున్నది.

*****************
ఆపరేషన్ సిందూర్ భీకరంగా జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ లోని Ma’aden ఇంజినీర్లు, అధికారులు భయభ్రాoతులకి గురయ్యారు. పాకిస్థాన్ మీద భారత్ చేస్తున్న దాడులని వివరంగా ఎప్పటికప్పుడు అల్ రుమయ్యాన్ కి తెలియచేస్తూ తాము సౌదీకి తిరిగి వచ్చేస్తామని అభ్యర్థించారు.

పాకిస్థాన్ లో భారత్ చేస్తున్న దాడుల తీవ్రత గుర్తించిన అల్ రుమయ్యాన్ వెంటనే ఆసిమ్ మునీర్ కి ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం భారత్ తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిపోవాలి లేదంటే IMF ఇచ్చిన గ్యారంటీని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరించాడు.

MAY 9, 10 తేదీలలో జరిగింది…
ఆసిమ్ మునీర్ వెంటనే తన DGMO (Director General Military Operations) కి ఫోన్ చేసి ఇండియన్ DGMO కి ఫోన్ చేసి కాల్పుల విరమణ కోసం అడగమని ఆదేశించాడు. పాకిస్తాన్ DGMO భారత DGMO కి ఫోన్ చేసి కాల్పుల విరమణ కోసం అభ్యర్థించడం, దానిని భారత్ తిరస్కరిస్తూ దాడులు కొనసాగించడం జరిగింది!

ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ DGMO పైన ఒత్తిడి తెచ్చి ఎలాగైనా కాల్పుల విరమణ కోసం భారత్ ని ఒప్పించమని పదే పదే కోరడంతో పాకిస్తాన్ DGMO MAY 9 న నాలుగుసార్లు, MAY 10 న నాలుగు సార్లు ఇండియన్ DGMO కి ఫోన్ చేసి బ్రతిమలాడడం జరిగింది!

కాల్పుల విరమణ అనేది పాకిస్థాన్ కోసం కాదని, అది సౌదీ ప్రిన్స్ కోసమని గ్రహించిన మోడీ కాల్పుల విరమణ కేవలం విశ్రాంతి మాత్రమే అనీ, తిరిగి ఎప్పుడైనా మొదలవవచ్చని ప్రకటించడం జరిగింది!
సౌదీ ప్రిన్స్ నుండి సౌత్ బ్లాక్ కి ఫోన్ వచ్చి ఉండవచ్చు కాల్పుల విరమణకి అంగీకరించమని… కానీ ఈ విషయం మీద ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రధాన మంత్రి కార్యాలయం!

So! ఇక్కడ ట్రంప్ ప్రమేయం ఎంత మాత్రం లేదని స్పష్టమవుతున్నది!

భారత ప్రధాని నరేంద్ర మోడీ, EAM  జై శంకర్ చాలా స్పష్టంగా చెప్పారు ఆపరేషన్ సిందూర్ కి విరామం ఇవ్వడం అనేది కేవలం పాకిస్తాన్ DGMO నుండి పదే పదే అభ్యర్ధనలు రావడం వల్లే తాత్కాలిక విరామం ప్రకటించాము అని!

DGMO కి ఆదేశాలు ఇచ్చింది ఆసిమ్ మునీర్…

***************
ఆపరేషన్ సిందూర్ కి విరామం ప్రకటించిన వారానికే యాసిర్ అల్ రుమయ్యాన్ కోరిక మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఆసిమ్ మునీర్ కి అత్యున్నత పదవి అయిన ఫెయిల్డ్ ( ఫీల్డ్) మార్షల్ ని ఇచ్చి సత్కరించింది!

పాకిస్తాన్ జెనరళ్లకి ఒక్కొక్కరి ఛాతీ మీద కనీసం అరడజను పతకాలు ఉంటాయి కానీ వాటిని ఎవరు ఎందుకు ఇచ్చారో తెలియదు… కానీ కరాచి ఫుట్ పాత్ ల మీద కొనుక్కొచ్చి తగిలించుకుంటారు అనే జోక్ పాకిస్తాన్ లో ప్రచారంలో ఉంది… ఒక్కటంటే ఒక్క యుద్ధంలో గెలవని పాకిస్తాన్ సైన్యానికి, దాని జెనరళ్లకి పదుల కొద్దీ మెడల్స్ ఉంటాయి!
ఇంతవరకు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోని ఇజ్రాయేల్ సైనిక అధికారులు సైన్యంలో తమ పదవిని సూచించే బ్యాడ్జ్ లు మాత్రమే ధరిస్తారు తప్పితే ఎలాంటి మెడల్స్ ఉండవు… (మిగతాది సెకండ్ పార్టులో...)
***************

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘నాదేముందమ్మా… లైట్ మీల్స్… ఇదుగో ఈ మాత్రం ఉంటే చాలు…’
  • రేవంత్ రెడ్డి అలా సంకల్పించాడు… ఇలా ట్రంపు ఓ చాన్స్ ఇస్తున్నాడు…
  • ఆయుధ విసర్జన కాదు… రిట్రీట్ అసలే కాదు… జస్ట్, ఓ లీడర్ లొంగుబాట..!!
  • భిన్నమైన స్టోరీ లైన్… సీరియస్ ఫ్లో… ‘బిచ్చగాడి’ మరో గుడ్ ఎఫర్ట్..!!
  • H1B వీసా లక్ష డాలర్ల ఫీజు… ఎవరికి..? ప్రభావం ఎంత..? ప్రచారం ఏమిటి..?
  • ఓ మోస్తరు ’బ్యూటీ’ఫుల్ మూవీ..! ఈ కథానాయికకు ఫ్యూచర్ ఉంది..!
  • రష్యా ఆయిల్ కొంటే ట్రంపు పెనాల్టీలు… అసలు కుట్రదారులు ఎవరు..?
  • వరల్డ్ వార్ సన్నాహాలు షురూ..! ఆపరేషన్ సిందూర్ ఆపించింది ఎవరు..?!
  • గద్దను ఎలా బీభత్సంగా వేటాడాలో… అదేదో భాషలో చెబితే ఎలా స్వామీ..?!
  • మంచు లక్ష్మి నటన, ఖర్చు, ప్రయాస… ఏవీ వర్కవుట్ కాలేదు ఫాఫం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions