.
ఎవరో కోమటిరెడ్డి అట… ఇంకెవరో శ్రీహరి అట… వాట్ నాన్సెన్స్, పవన్ కల్యాణ్ తన దిష్టి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా… నీ సినిమాలు నడవనివ్వము బిడ్డా అని హెచ్చరిక జారీ చేశారు ఇద్దరూ కలిసి… అఫ్‌కోర్స్, శ్రీహరి ఏ శాఖో, ఏమిటో ఎవరికీ తెలియదు, వదిలేద్దాం…
నిజంగా నవ్వొచ్చింది… అదెవత్తో.,. సారీ, చాలామంది జనసేన సోషల్ టీమ్… ఏకంగా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులను హెచ్చరిస్తున్నారు… తెలంగాణ మీ అయ్య జాగీరా అని… ఎందుకట అంటే, కొందరు కాంగ్రెస్ నేతలు పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తున్నారు కాబట్టి అట… (నిజంగా ఈ తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గూశరం లేదు)…
Ads
.
కులం… కేవలం కులమే… అంతే… మరి ఏపీకి తెలంగాణ దిష్టి తగిలింది అనే ఆ అత్యంత తీవ్ర భారీ పరిజ్ఙాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యల మీద స్పందన ఏది..? అక్కడ చేతకాదు గానీ తెలంగాణ ఎవ్వడి జాగీర్ అని సోషల్ మీడియాలో ప్రశ్నలు స్పందిస్తున్నారు కొందరు… తెలంగాణలో అలవిమాలిన స్వేచ్ఛ అనుభవిస్తున్నారు కదా… థాంక్స్ టు కేసీయార్, థాంక్స్ టు రేవంత్ రెడ్డి…
తెలంగాణ ఏర్పడ్డాక పన్నెండు రోజులు నిద్రాహారాలు మాని బాధపడ్డ… అత్యంత తీవ్ర తెలంగాణ ప్రేమికుడికి మద్దతా ఇది..? కులమేనా ప్రాతిపదిక..? ఈ కేరక్టర్‌ను పట్టుకుని…… ఫాఫం, తెలంగాణ బీజేపీ గోదావరి ఈదుతుందట…. పిటీ మోడీ, పిటీ కిషన్ రెడ్డి… నో నో…. పిటీ బండి సంజయ్, పిటీ ధర్మపురి అర్వింద్… మీ కుల స్పృహకు జోహార్లు…
సదరు పవన్ కల్యాణ్ అనబడే భారత జాతి ఆశాకిరణం దిష్టి వ్యాఖ్యలపై ముచ్చట ప్రచురించిన కథనం ఇదుగో లింక్…
ఈ తెలంగాణ ద్వేషి అస్సలు మారడు… మళ్లీ అదే విద్వేష ప్రదర్శన..!!
కేవలం పవన్ కల్యాణ్ ఆధారంగా తన పిచ్చి కూతలను సమర్థించే తెలంగాణ నేతల పట్ల తెలంగాణ జనం సానుభూతి చూపిస్తోంది… అన్నట్టు, అసలు విషయానికి వద్దాం… ఫాఫం, తెలంగాణ ప్రభుత్వంలో ఓ సినిమాటోగ్రఫీ అనే శాఖ ఉందని, ఆ మంత్రే మరిచిపోయాడు… ఉన్నట్టూ కాదు, లేనట్టూ కాదు…
అసలు ఆ శాఖకు అనధికార మంత్రి దిల్ రాజు… మరి కోమటిరెడ్డి అనే సదరు మంత్రికి ఇజ్జత్ లేదా అంటారా..? నేనూ ఉన్నాను అని ఉనికి చాటుకోవడానికి ఓ శుష్క ప్రకటన అంటారా… ఎస్, టాలీవుడ్‌లో ఎవడూ పట్టించుకోడు… పైగా పవన్ కల్యాణ్ అనబడే సోకాల్డ్ ప్రపంచ సాంస్కృతిక దిగ్గజ నాయకుడిని పట్టించుకుంటారా..?

బెనిఫిట్ షోలు, అధిక టికెట్ రేట్లు, ప్రిరిలీజ్ ఫంక్షన్లపైనే రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్… కారణం, దిల్ రాజు అృతీనబడే ముఖ్యమంత్రి, మంత్రి అన్నీ… తనకు తెలంగాణ ప్రభుత్వం అంత దాసోహం అనాలా..?
అసలు తనే సినిమాటోగ్రఫీ మంత్రి… ఆఫ్టరాల్ కోమటిరెడ్డి..!! ఒరేయ్, పవన్ కల్యాణ్, నువ్వు గనుక ‘దిష్టి’ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే నీ సినిమాలు నడవనివ్వం అంటున్నాడు… ఫాఫం, తన మాటకు చెల్లుబాట ఏముంది..?
అంతా దిల్ రాజు కదా… తెలంగాణ సంస్కృతీ పరిరక్షకుడు… ఫాఫం రేవంత్ రెడ్డి… ఫాఫం తెలంగాణ ప్రభుత్వం…. తెలంగాణ వీరద్వేషి పవన్ కల్యాణ్ పాదాాల మీద తెలంగాణ ఆత్మగౌరవాన్ని పరుస్తున్న విషాదం…!!
Share this Article