.
పార్థసారథి పొట్లూరి… ఇండిగో ఎయిర్ లైన్స్ నిర్వాకం! కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విఫలం అయ్యింది! మోడీకి అప్రదిష్ట!
వరసగా 8 వ రోజున కూడా ఇండిగో విమాన సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి అంటే కేంద్ర విమానయాన శాఖ ఎంతలా మొద్దు నిద్రపోతున్నదో అర్ధమవుతున్నది!
Ads
ఇండిగో ఎయిర్ లైన్స్ ఉదంతం విదేశీ కుట్ర కాదు!
స్వదేశీ కుట్ర! ద్రోహులు మన దేశంలోనే ఉన్నారు!
అలసత్వంతో కనారిల్లితున్న వ్యక్తులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు!
తప్పు మన దగ్గర పెట్టుకుని సమర్ధించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేసినా అది సఫలం అవదు!
డిసెంబర్ 2 న మొదలైన ఇండిగో విమాన సర్వీసుల రద్దు ప్రహసనం డిసెంబర్ 9 వరకూ కొనసాగుతూనే ఉన్నది!
వేల మంది ప్రయాణీకులు ఎయిర్ పోర్ట్ లలో సమాధానం చెప్పేవారు లేక తమ లగేజీ కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది.
ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లు కుంభమేళా సమయంలో కాశీ, ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్లు ఎలా క్రిక్కిరిసిపోతాయో అలా కనిపించాయి!
ఇంటర్వ్యూలకి వెళ్లే వాళ్ళు, బిజినెస్ పని మీద వెళ్ళేవాళ్ళు, ముఖ్యమైన ఆపరేషన్ కోసం హాస్పిటల్స్ కి వెళ్ళేవాళ్ళు,పెళ్లయిన కొత్త దంపతులు రిసేప్షన్ కోసం వేరే నగరానికి వెళ్ళాల్సిన వాళ్ళు.. ఇలా వివిధ రంగాల వాళ్ళు ఇండిగో సర్వీసెస్ రద్దు అవడంతో ఇబ్బందులు పడ్డారు!
భారతదేశ విమానయాన రంగ చరిత్రలో ఇండిగో ఎయిర్ లైన్స్ సర్వీసెస్ రద్దు అనేది అతి పెద్ద తప్పిదం! ఇంతకు పూర్వం, ఇకముందు కూడా ఇలాంటి తప్పిదం జరిగే అవకాశం ఉండబోదు!
వాతావరణం అనుకూలించపోవడం వల్ల విమాన సర్వీసులు రద్దు అవడం సహజం, ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ దేశంలో జరిగేదే ఇది!
కానీ పైలట్ల కొరత, గ్రౌండ్ సిబ్బంది కొరత వల్ల ఏకంగా 2600 సర్వీసులు రద్దు అవడం, అదీ ఒకే ఒక్క ఎయిర్ లైన్స్ వల్ల ఇలా జరగడం భరతదేశ విమానయాన రంగంలో ఇదే మొదటిసారి!

ఈనాటి సంక్షోభానికి కారకులు ఎవరు?
ఇండిగో ఎయిర్ లైన్స్, భారత విమానయాన మంత్రిత్వ శాఖ, డైరెక్టర్ జెనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ సంయుక్తంగా బాధ్యత వహించాలి!
******
- ఇండిగో సంక్షోభం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసుకోవాలి అంటే 2012 లోకి వెళ్ళాలి!
2012 లో భారత్ లోని విమాన పైలట్ల అసోసియేషన్స్ అయిన ఇండియన్ కమర్షయల్ పైలట్స్ అసోసియేషన్, ఇండియన్ పైలట్స్ గిల్డ్, ఫెడరేషన్ అఫ్ ఇండియన్ పైలట్స్ లు కలిసి ఢిల్లీ హైకోర్ట్ లో పిటిషన్ వేసాయి. పిటిషన్ ఉద్దేశం ఏమిటంటే…..
1. భారత విమానయాన రంగంలో పైలట్లకి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన త్వరగా మానసికంగా, శారీరకంగా అలిసిపోతున్నామనీ (Fatigue), కాబట్టి నిబంధనలు మార్చాలని కేంద్ర విమానయాన శాఖ, డైరెక్టరెట్ అఫ్ సివిల్ ఏవియేషన్, ఫ్లైట్ ఆపరేటర్స్ కి ఆదేశాలు ఇవ్వమని అభ్యర్థించాయి.
2.అంతర్జాతీయ ప్రయాణీకుల విమాన పైలట్స్ కి ఎలాంటి ప్రమాణాలు వర్తింపచేస్తున్నారో అవే ప్రమాణాలు భారత పైలట్స్ కి వర్తింపచేయాలి… ఇవి భారతదేశ పైలట్ అసోసియేషన్లు అడిగినవి…
సరిగ్గా 12 ఏళ్ళ తరువాత… ఢిల్లీ హై కోర్టు తన తుది తీర్పుని ప్రకటించింది ఈ అంశాల మీద. మళ్ళీ మళ్ళీ పిటిషన్లు లేదా రివ్యూ పిటిషన్లు వేయడానికి వీలు లేకుండా…
2024లో ఢిల్లీ హైకోర్టు మొత్తం 22 పాయింట్లని అమలు చేయడానికిగాను గుర్తించింది.
CAR 24 – సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ ( Civil Aviation Requirements – CAR ) లేదా CAR 2024 పేరుతో వ్యవహరిస్తారు ఢిల్లీ హై కోర్ట్ మార్పులు చేయాలి అని తీర్పు ఇచ్చిన అంశాలని!
- ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని అమలు చేయడానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ ఒక సంవత్సరం గడువు కోరింది. కోర్టు అనుమతి ఇచ్చింది.2024 లో ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన ఆదేశాలని అమలుచేయాల్సిందిగా DGCA అన్ని ఆపరేటర్ల కి కోర్టు చెప్పిన విధంగా మార్పులు చేసుకోవడానికి సంవత్సరం సమయం ఇచ్చింది!
ఏప్రిల్ 7, 2025 న కేంద్ర విమానయాన శాఖ అప్పటి ఢిల్లీ హై కోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ తార విటత్స గుంజు ( Justice Tara Vitasta Gunju) ముందు ఒక ఆఫిడవిట్ దాఖలు చేస్తూ, కోర్టు గుర్తించిన 22 అంశాలలో 15 అంశాలని జులై 1, 2025 నాటికి అమలుచేస్తామని, మిగతా 7 అంశాలని నవంబర్ 1 నాటికి అమలుచేస్తామని హామీ ఇచ్చింది.
So! ఢిల్లీ హై కోర్టు కేసు విచారణ పూర్తయిపోయినట్లుగా ప్రకటిస్తూ కేసు మూసివేసింది!
ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన ఆదేశాలలో కొన్ని ముఖ్యమైన అంశాల గురుంచి చర్చిద్దాం… ఎందుకంటే ఇండిగో ఫియాస్కో అనేది ఈ ముఖ్యమైన అంశాల వల్లనే సంభవించింది…
FDTL – Flight Duty Time Limitations!
FDTL అంటే పైలట్ విమానం నడిపే పనిగంటలు, పైలట్ కి ఇచ్చే విశ్రాంతి సమయాన్ని నియంత్రించే విధానం అన్న మాట.
కోర్టు ఆదేశాలకి ముందు పైలట్ పని గంటలు, విశ్రాంతి ఎలా ఉండేవి?
3. ప్రతీ పైలట్ వారానికి 36 గంటల విశ్రాంతి మాత్రమే తీసుకోవాలి.
4. కొత్త రూల్స్ ప్రకారం ప్రతీ పైలట్ వారానికి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది కోర్టు ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది అన్ని ఎయిర్ లైన్స్!
5.దూర ప్రయాణాలప్పుడు, అదీ రాత్రి సమయంలో 12 గంటల నుండి ఉదయం 6 వరకూ పనిచేయాల్సి ఉంటుంది. అంతకుముందు రాత్రి 12 నుండి ఉదయం 5 వరకూ ఉండేది.
6.పైలట్లు ఇంతకుముందు రాత్రిపూట 5 లాండింగ్స్ చేయాల్సి వచ్చేది.
7.కొత్త రూల్స్ ప్రకారం వారానికి రెండు సార్లు మాత్రమే రాత్రిపూట లాండింగ్స్ చేయాలి.
8.పైలట్లు వారానికి ఒక్క లాండింగ్ మాత్రమే రాత్రి పూట చేయాలి, ఒకవేళ 8 గంటలు నిర్వీరామంగా విమానం నడపాల్సివస్తే…
ఈ విషయాలని తెలియచేస్తూ DGCA ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎక్ష్ప్రెస్స్, విస్తారా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలకి ఒక సంవత్సరం ముందే తెలియచేసింది.
ఢిల్లీ హై కోర్టు ఆదేశాలని ఒక సంవత్సరం ముందే అన్ని ఎయిర్ లైన్స్ కి తెలియచేసినా ఒక్క ఇండిగో మాత్రమే 2,600 ఫ్లైట్స్ ని ఎందుకు రద్దు చేసింది?

ఇండిగో ఎయిర్ లైన్స్ సహవ్యవస్థపకుడు అయిన రాహుల్ భాటియా బలుపు వల్లే!
19 ఏళ్ళ క్రితం రాహుల్ భాటియా ప్రారంభించిన ఇండిగో ఎయిర్ లైన్స్ అంచెలు అంచెలుగా ఎదిగి భారత పౌర విమానయాన రంగంలో 63% వాటాతో అగ్రస్థానంలో ఉంది.
రాహుల్ భాటియా ఒక్క ఇండిగో ఎయిర్ లైన్స్ మాత్రమే కాదు, గురుగ్రామ్ లో మూడు లక్జరీ హోటళ్లకి యజమాని కూడా!
ఇండిగో ఎయిర్ లైన్స్ ఒళ్ళుబలుపు ఎంతలా ఉంది అంటే నవంబర్ 1 కల్లా కొత్త రూల్స్ ని పాటించడానికి ఏవేవి అవసరం అవుతాయో అన్నీ సిద్ధం చేసుకొని DGCA కి తెలియచేయాలి, కానీ ఇండిగో ఆ పని చేయలేదు!
విచిత్రం ఏమిటంటే డిసెంబర్ 2 న ఫ్లైట్స్ రద్దు చేయడానికి ముందు.. అంటే నవంబర్ 30 న CAR 24 నిబంధనల విషయంలో సందేహాలు ఉన్నాయని DGCA ఆఫీస్ ని సంప్రదించింది. పోనీ అప్పుడన్నా తమకి ఇబ్బందులు ఉన్నాయని DGCA కి తెలిపిందా అంటే అదీ లేదు. DGCA ఇండిగో అడిగిన అన్నీ సందేహాలకి సమాధానాలు ఇచ్చింది!
డిసెంబర్ 2 న ఇండిగో ఫ్లైట్స్ ఒకదాని తరువాత ఇంకోటి అలా ఫ్లైట్స్ ని రద్దు చేసుకుంటూ పోయింది. DGCA అధికారులు, విమానయాన శాఖ మంత్రి ఆఫీసు నుండి ఫోన్లు వస్తే ఏదో సాఫ్ట్వేర్ లో గ్లిచ్ అనీ సరిచేస్తున్నామని సమాధానం చెప్పింది ఇండిగో!
ఇండిగో రాహుల్ భాటియా తెలిసీ కుట్ర చేశాడా?
ఇది కుట్ర అనే అనిపిస్తుంది వివరాలు లోతుగా అధ్యయనం చేస్తే!
ముందు ఇండిగో చేసింది ఏమిటో చూద్దాం….
ఇండిగోకి ఇప్పుడున్న4,500 పైలట్స్ కి అదనంగా మరో 150 మంది కెప్టెన్స్, ఫస్ట్ ఆఫీసర్స్ ని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్త రూల్స్ ప్రకారం. ఎందుకంటే, ఒక పైలట్ ఒక విమానం నడిపే పని గంటలు తగ్గాయి మరియు విశ్రాంతి ఇచ్చే సమయం పెరిగింది!
ఇండిగో కనుక ఇప్పుడు నడుస్తున్న రూట్లలో విమానాలు రద్దు చేయకుండా నడపాలి అంటే కొత్తగా పైలట్స్ తో పాటు గ్రౌండ్ స్టాఫ్ ని కూడా రిక్రూట్ చేసుకోవాలి. కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది, లాభాల మార్జిన్స్ తగ్గిపోతాయి అనే భయంతో గడువు సమీపిస్తున్నా కూడా పైలట్స్ ని, గ్రౌండ్ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోలేదు!
దేశీయ విమానయాన రంగంలో 63% వాటా ఉన్న ఇండిగో మీద కొత్త రూల్స్ ని అమలుచేయమని ఒత్తిడి తెస్తే ఏమవుతుందో చూడండి అని కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరింది ఇండిగో!
ఏమయ్యిందో చూస్తూనే ఉన్నాం కదా?

ఎయిర్ ఇండియా కానీ, విస్తారా, ఆకాశ, స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ ఇండిగో ప్రయాణీకుల ఒత్తిడిని భరించే స్థితిలో లేవు కాబట్టి టికెట్ ధరలు డైనమిక్ పధ్ధతిలో ఆకాశాన్ని తాకాయి!
ఇండిగో మోనోపలి స్థితిలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి…
9.ఇండిగో రాత్రిపూట ఎక్కువగా విమానాలు నడుపుతుంది. ఎందుకంటే ఏదన్నా ఎయిర్పోర్ట్ లో రాత్రిపూట విమానాన్ని ఖాళీగా ఉంచి పార్కింగ్ చేస్తే గంటకి లక్షల్లో ఫీజు కట్టాల్సి ఉంటుంది. అందుకే పార్కింగ్ ఫీజు నుండి తప్పించుకోవడానికి రాత్రి పూట ఎక్కువ షెడ్యూల్ ని అందుబాటులో ఉంచుతుంది ప్రయాణీకులకి. ధర తక్కువ కదా అని ఎక్కువమంది ఇండిగోని ఎంచుకుంటూ వస్తున్నారు.
10. ఇప్పుడున్న పైలట్స్ కి అదనంగా మరో 150 మందిని రిక్రూట్ చేసుకుంటే అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది, దాంతో టికెట్స్ ధరలు పెంచాల్సి వస్తుంది ఫలితంగా మార్కెట్లో తన మోనోపలి తగ్గుతుంది!
11.ఇండిగో తన గ్రౌండ్ సపోర్ట్ సిబ్బందికి తక్కువ జీతాలు ఇస్తుంది. ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ కి చెందిన ఉద్యోగి ఒకరు బహిరంగంగానే లెటర్ వ్రాసాడు మీడియాకి. దానిలో ముగ్గురు గ్రౌండ్ స్టాఫ్ చేయాల్సిన పనిని ఒక్కరితో చేయిస్తుంది ఇండిగో అని. గ్రౌండ్ స్టాఫ్ జీతం కేవలం 18,000 వేల రూపాయలు మాత్రమే!
మరి అన్ని ఎయిర్ లైన్స్ కంటే తక్కువ ధరకే ఇండిగో సర్వీసులని ఎలా నడపగలుగుతున్నది అనే సందేహం ఉన్న వాళ్లకి పొదుపు చేస్తూ, లాభాలు పొందుతూ వస్తున్నది అనే సమాధానం వస్తుంది.
Well! ఎక్కువగా ఆదా అయ్యేది ఎయిర్ పోర్ట్ లలో విమాన పార్కింగ్ ఫీజులని చెల్లించకుండా ఉండడం వల్లనే!
భారత ప్రభుత్వాన్ని బెదిరించబోయి బొక్క బోర్లా పడ్డాడు రాహుల్ భాటియా!
గత వారం రోజుల్లో కాన్సిల్ చేసిన ఫ్లైట్స్ తాలూకు డబ్బు వాపసు ఇవ్వాలి ఇప్పటికే 800 కోట్లు చెల్లించింది ఇంకా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంది.
వారం రోజుల నుండి సగం విమానాలు వివిధ ఎయిర్ పోర్ట్ లలలో పార్కింగ్ లో ఉన్నాయి మరి వాటి ఫీజులు కూడా కోట్లలోనే ఉంటాయి. ఇండిగో డిసెంబర్ 2 కి ముందు ఉన్న విశ్వాశాన్ని కోల్పోయింది. తిరిగి పూర్వ వైభవం పొందడం కష్టం!
రాహుల్ భాటియా ఒక్కడేనా కుట్రదారుడు?
రాహుల్ భాటియా ఒక్కడే ఈ దుష్ట ఆలోచన చేసిఉంటాడా?
రాహుల్ భాటియా ఒక్కడే ఈ పని చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే వరసగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే హీనపక్షం 2000 కోట్లు నష్టం వస్తుందని తెలియదా!
బహుశా జార్జ్ సోరోస్ తో చేతులు కలిపి ఉండవచ్చు. జార్జ్ సోరోస్ గతంలోనే ప్రకటించాడు భారత్ లో మోడీని గద్దె దింపడానికి 500 బిలియన్ డాల్లర్లని అయినా సరే ఖర్చు పెడతాను అని.
2 వేల కోట్లు కాదు 5 వేల కోట్లు ఇస్తాను అని ఆఫర్ ఇచ్చివుండవచ్చు!
******
కేంద్ర ప్రభుత్వ వైఫల్యం!
ఇండిగో సృష్టించిన సంక్షోభం చిన్నదేం కాదు! విద్యావంతులు, బిజినెస్ ఎలైట్లు ఇండిగో నిర్వాకాన్ని ప్రభుత్వ వైఫల్యంగానే చూస్తారు తప్పితే విడిగా ఇండిగో ఎయిర్ లైన్స్ వైపు చూడరు!
కేంద్ర పౌర విమానయాన శాఖ బాధ్యత సురక్షితంగా, సమయపాలనగా విమానాలు నడిచేట్లుగా చూడడానికే కదా ఉంది?
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు పార్లమెంట్ లో ఇండిగో సంక్షోభానికి కారణం వివరిస్తూ మళ్ళీ ఎవరూ కూడా ఇలాంటి పనికి పూనుకోవడానికి భయపడేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించడం దానికి NDA సభ్యులు బల్లలు చరుస్తూ అభినందించడం చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియలేదు.
సివిల్ ఏవియేషన్ మంత్రి గారికి చివరి నిముషం వరకూ ఇండిగో ఫ్లైట్స్ రద్దు చేయడం గురుంచి తెలియదుట!

ఢిల్లీ హై కోర్టుకి CAR 24 నిబంధనలు అమలు చేస్తామని ఆఫిడవిట్ ఇచ్చి, ఆ నిబంధనలు ఏమిటో అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలకి తెలిపింది DGCA కాదా? రామ్ మోహన్ నాయుడుకి DGCA తనకిందే పనిచేస్తుందని తెలియదా?
దేశంలోని ఏ ఎయిర్ లైన్స్ అయినా కొత్తగా పైలట్స్ ని రిక్రూట్ చేసుకుంటే ఆ విషయాన్ని DGCA కి తెలియచేస్తాయి. అది రూల్.
మరి గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఇండిగో అదనంగా పైలట్స్ ని రిక్రూట్ చేసుకుందా లేదా అని DGCA ఎందుకు అడగలేదు ఇండిగో ని? తనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు అని ఎందుకు అడగలేదు?
2024 లోనే ఢిల్లీ హై కోర్టు ఆదేశాలని అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలకి పంపిస్తూ, మీరు ఎలాంటి చర్యలు తీసుంటున్నారో DGCA నివేదిక ఇవ్వాలని ఆదేశాలలో స్పష్టంగా పేర్కొన్నారు కదా?
మరి అలాంటప్పుడు DGCA ఇండిగో ని అదనపు సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నారా లేదా మీ ఫ్లైట్ ఆపరేషన్స్ ని ఇప్పుడున్న సిబ్బందితోనే నడపదలుచుకుంటే ఆ మేరకు ఫ్లైట్స్ షెడ్యూల్స్ ని తగ్గించారా లేదా అని DGCA ఎందుకు అడగలేదు?
నవంబర్ 30 న ఇండిగో ఎయిర్ లైన్స్ CAR 24 నిబంధనల గురుంచి సందేహ నివృత్తి కోసం DGCA కి వచ్చినప్పుడన్నా CAR 24 కంప్లియన్స్ గురుంచి ఎందుకు అడగలేదు?
డిసెంబర్ 2 న ఇండిగో ఫ్లైట్స్ కాన్సిల్ అవుతున్నా ఇంకో పక్క ఇండిగో బుకింగ్స్ చేసుకుంటూ ఉంటే DGCA ఎందుకు ఆపలేదు?
- ఇదేమి యాధృచ్చికంగా జరిగిన సంఘటన కాదు!డిసెంబర్ 4, 5 తేదీలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన జరుగుతున్న సమయంలో ఇండిగో ఫ్లైట్స్ రద్దు అనేది పీక్ స్టేజ్ కి వెళ్ళింది అన్నది మర్చిపోకూడదు!పుతిన్ కి బద్ధ శత్రువు జార్జ్ సోరోస్ అన్న సంగతి అందరికి తెలిసిన విషయమే! జార్జ్ సోరోస్ CIA తో కలిసి పనిచేస్తాడు అన్నది నిజమే!సాఫ్ట్వేర్ టెక్నీకల్ గ్లిచ్ కాదు ఇండిగో, రామ్ మోహన్ నాయుడు చెప్తున్నట్లు.కావాలనే చేసిన కుట్ర!
బీజేపీకి అభిమానులు ఉన్న వర్గాన్నే ఇండిగో టార్గెట్ చేసి సఫలం అయ్యింది!
*****

అర్ణబ్ గోస్వామి Vs TDP జాకీ ఆపరేటర్స్!
ఆర్నాబ్ గోస్వామి మంత్రి రామ్ మోహన్ నాయుడు ఎక్కడా అంటూ టీడీపీ ప్రతినిధి దీపక్ రెడ్డిని అడిగితే… తెలిసింది చెప్పి ఉంటే బాగుండేది, కానీ లోకేష్ పరిస్థితిని పర్యవేక్షrస్తున్నాడని అర్ధం వచ్చేలా మాట్లాడాడు దీపక్ రెడ్డి. దాంతో ఆర్నాబ్ ఇండిగో ఉదంతంతో లోకేష్ కి ఏమి సంబంధం అని అడిగాడు…
దీపక్ రెడ్డి ఆర్నాబ్ తో…,.: nara lokesh babu is monitoring situation from last 24 hours.
And he set up a war room also.
ఏవన్నా అర్ధం ఉందా? ఇండిగో ఉదంతం మీద లోకేష్ వార్ రూమ్ ఓపెన్ చేసి మానిటరింగ్ చేస్తున్నాడని దీపక్ రెడ్డి గారి ఉవాచ!
అర్ణబ్ గోస్వామి దీపక్ రెడ్డితో మాట్లాడే సమయానికి లోకేష్ అమెరికాలోని డలాస్ లో ఉన్నాడు.
అందుకే జాకీ ఆపరేటర్స్ అని అన్నది!
మరో టీడీపీ ప్రతినిధి పట్టాభి వరస కూడా ఇంతే!
రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం ఎక్కడున్నాడో మాకు తెలియదు అంటే బాగుండేది! అదీ నిజమే కదా?
అనవసరంగా లోకేష్ పేరుని తీసుకోచ్చి తాము జాకీ ఆపరేటర్స్ అని ప్రపంచానికి చెప్పకనే చెప్పుకున్నారు!
అసలు టీడీపీకి కేంద్ర పౌరవిమానయాన శాఖ మీద అంత మక్కువ ఎందుకు?
2014-19 టర్మ్ లో కూడా అశోక్ గజపతి రాజు గారిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని చేశారు, ఇప్పుడేమో రామ్ మోహన్ నాయుడుని అదే శాఖకి మంత్రిని చేశారు! ఎందుకంత మక్కువ?
ఇప్పటికైనా మోడీ కానీ, అమిత్ షా కానీ చంద్రబాబుతో మాట్లాడి రామ్ మోహన్ నాయుడుకి వేరే మంత్రిత్వ శాఖ అప్పచెపితే మేలు! అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన మరిచిపోకముందే ఇండిగో ఉదంతం జరగడం రామ్ మోహన్ నాయుడు అదే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరగడం అతని దురదృష్టం!
మన తెలుగు వాడు కదా, ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలలో అనర్గళంగా మాట్లాడతాడు అని ఏకంగా కేబినెట్ మంత్రి పదవి ఇస్తే ఎలా?
మంచి వక్త ఎప్పుడూ మంచి కార్యదక్షత కలవాడుగా ఉంటాడు అని రూల్ ఏమీ లేదు కదా? ఏదన్నా పనిచెపితే చేసుకోచ్చేవాడు మంచి వక్త అయిండకపోవచ్చు!

- ఆర్నాబ్ గోస్వామి దగ్గర ఏదో సమాచారం ఉండి ఉండవచ్చు లేకపోతే TDP ని, రామ్ మోహన్ నాయుడిని ఎందుకు టార్గెట్ చేస్తాడు?
టీడీపీ వాళ్ళు బాయ్ కాట్ రిపబ్లిక్ టీవీ అని అంటున్నారు కానీ అదేమీ పనిచేయదు. రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేయాలి అనే నినాదం టీడీపీ శ్రేణులు తలకెత్తుకున్నాయి కానీ అర్ణబ్ గోస్వామికి కల్ట్ ఫాన్స్ ఉన్నారు. అనవసరంగా కెలుక్కోవద్దు! అతను జర్నలిస్ట్! మీకు ఇష్టం ఉంటే అడిగినదానికి జవాబు చెప్పండి లేకపోతే లేదు! ఆర్నాబ్ తో పెట్టుకుంటే ఒకటీ, ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే వేరు కాదు… ఇద్దరూ ఒకటే! వీళ్ళకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది.
- ఫెడరేషన్ అఫ్ ఇండియన్ పైలట్స్ అధ్యక్షుడు కెప్టెన్. C. S. రణధవ ఒక ప్రకటన చేస్తూ అసలు ఇండిగో ఎయిర్ లైన్స్ కి పైలట్స్ కొరత కానీ, విమానాల కొరత కానీ లేదు, ఉద్దేశ్యపూర్వకంగా ఫ్లైట్స్ రద్దు చేసి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసింది అని ఆరోపించాడు! ఒక పైలట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కెప్టెన్ రణధవ ఆరోపణకి విలువ ఉంటుంది.
ఇండిగో మీద ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ మొత్తం రూట్లలో 10% రద్దు చేసి వాటిని ఇతర ఆపరేటర్లకి కేటాయించింది. ఇంత జరిగితే మహా అయితే ఇండిగో CEO రాజీనామా చేసి వెళ్ళిపోతాడు అంతే! లోకేష్ తో ఏరా ఏరా అనుకునేంత స్నేహం ఉంది కాబట్టి రామ్ మోహన్ నాయుడు పదవిలో కొన.. సా…గు…తూనే ఉంటాడు.
Share this Article